BRS MP Candidates: మరో నాలుగు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ - అక్కడ కొత్తవారికి ఛాన్స్
Telangana News: వరంగల్, చేవెళ్ల సహా మరో రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థినిగా కడియం కావ్య పేరును ఫిక్స్ చేశారు.
![BRS MP Candidates: మరో నాలుగు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ - అక్కడ కొత్తవారికి ఛాన్స్ BRS Party announces other two MP Candidates for Warangal and Chevella constituencies in telangana BRS MP Candidates: మరో నాలుగు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ - అక్కడ కొత్తవారికి ఛాన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/5c7533e0be704340eee4528752776ca21710341467733234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
BRS Party MP Candidates: బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మరో నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్, చేవెళ్ల, నిజామాబాద్, జహీరాబాద్ స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్ - అనిల్‌కుమార్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ ను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థినిగా కడియం కావ్య పేరును ఫిక్స్ చేశారు. ఈమె స్టేషన్ ఘన్ పూర్ ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేరును ఖరారు చేశారు. ఈయన తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ కీలక నేతలు, ప్రజాప్రతినిధులు, ఆయా నియోజకవర్గాల స్థానిక నేతలతో చర్చించి వారి అభిప్రాయాల మేరకు కేసీఆర్ ఈ అభ్యర్థులను ఎంపిక చేసినట్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.
నేడు (మార్చి 13) వరంగల్ లోక్‌సభ పరిధిలోని నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ అభ్యర్థిత్వాలను ఖరారు చేసి ప్రకటించారు. వరంగల్, చేవెళ్లలో బీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. అయినా కూడా ఇతరులకు అవకాశం కల్పించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మళ్లీ పోటీకి ఆసక్తి చూపలేదు. దీంతో గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వచ్చిన కాసాని జ్ఞానేశ్వర్‌కు అవకాశం కల్పించారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ రెండు సార్లు అక్కడి నుంచే గెలవగా.. మరోసారి కూడా పోటీకి ఆసక్తిగా ఉన్నారు. కానీ, బీఆర్ఎస్ అధిష్ఠానం కడియం కుమార్తెకు అవకాశం ఇచ్చింది.
కవితకు షాక్
నిజామాబాద్ ఎంపీగా 2014 ఎన్నికల్లో గెలిచిన కల్వకుంట్ల కవిత తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో అదే స్థానం నుంచి ఓడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలకు కవితను తప్పించారు. ఆమె స్థానంలో బాజిరెడ్డి గోవర్థన్ కు ఎంపీ టికెట్ ఇచ్చారు కేసీఆర్.
ఇప్పటికే తొలి జాబితా ప్రకటన
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ, బీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావుకు మరో అవకాశం ఇచ్చింది. మహబూబాబాద్ (ఎస్టీ) స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత పేరును ఖరారు చేశారు. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను తొలి విడతలో ప్రకటించారు.
1) ఖమ్మం -నామా నాగేశ్వర్ రావు
2) మహబూబాబాద్ -(ఎస్ .టి )మాలోత్ కవిత
3) కరీంనగర్ -బోయినిపల్లి వినోద్ కుమార్
4)పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్
5) మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి
6) చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్
7) వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య
8) జహీరా బాద్ -గాలి అనిల్ కుమార్ .
9) నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)