IPL Auction 2022 Day 2 LIVE Updates: ఆక్షన్ ముగిసింది, ఇక యాక్షనే!
IPL 2022 Mega Auction LIVE Updates: ఐపీఎల్-15 మెగా వేలానికి సర్వం సిద్ధమైంది. అతిపెద్ద వేలానికి బెంగళూరు ఆతిథ్యం ఇస్తోంది. పది జట్ల వ్యూహకర్తలు, ప్రతినిధులు, యజమానులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు.
LIVE
Background
IPL 2022 Mega Auction Day 2 LIVE Updates: ఐపీఎల్-15 మెగా వేలానికి సర్వం సిద్ధమైంది. బహుశా బీసీసీఐ నిర్వహించే చివరి అతిపెద్ద వేలానికి బెంగళూరు ఆతిథ్యం ఇస్తోంది. పది జట్ల వ్యూహకర్తలు, ప్రతినిధులు, యజమానులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఐపీఎల్ పాలక మండలి మెగా వేలాన్ని పర్యవేక్షిస్తున్నారు.
స్పాన్సర్‌గా టాటా
ఈ సీజన్‌కు టాటా కంపెనీ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. దేశవిదేశాల నుంచి దాదాపుగా 600 మంది క్రికెటర్లు వేలానికి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో 217 మందిని ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోనున్నాయి. భారత్ నుంచి దాదాపు 370 మంది పేర్లు నమోదు చేసుకున్నారు.
కొత్తగా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్లు కూడా చేరడంతో మొత్తం జట్ల సంఖ్య 10కి చేరింది. ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనుంది. జట్లు రిటైన్ చేసుకున్న 33 మంది కాకుండా మొత్తంగా 590 మంది ఆటగాళ్ల కోసం జట్లు పోటీపడనున్నాయి.
ఐపీఎల్ 2022 మెగా వేలాన్ని లైవ్ చూడటం ఎలా?
ఈ ఐపీఎల్ మెగా వేలం బెంగళూరులో జరగనుంది. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు ఈ వేలం జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ హెచ్‌డీలో ఈ వేలాన్ని లైవ్‌లో చూడవచ్చు. అలాగే డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో కూడా ఈ మెగా వేలాన్ని లైవ్‌లో చూడవచ్చు.
ఈ వేలంలో మొత్తంగా 590 మంది ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి ఆటగాడికి ఫిక్స్‌డ్ బేస్ ప్రైస్ ఉంటుంది. అత్యధిక బేస్ ప్రైస్ రూ.2 కోట్లుగా ఉంది. మొత్తంగా 48 మంది ఆటగాళ్లు తమ బేస్ ప్రైస్‌ను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్‌తో 20 మంది ఆటగాళ్లు ఉన్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్
#OrangeArmy, we are Ready To Rise. We repeat. We are #ReadyToRise 🧡#IPLAuction pic.twitter.com/sQ5zCgFsex
— SunRisers Hyderabad (@SunRisers) February 13, 2022
బెంగళూరు పూర్తి జట్టు ఇదే..
View this post on Instagram
ఈ ఐపీఎల్‌లో టాప్-5 డీల్స్ ఇవే..
View this post on Instagram
చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్ ఇదే
All set to R🦁AR! #Prideof2022 #WhistlePodu 💛
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) February 13, 2022
ఆక్షన్ ముగిసింది, ఇక యాక్షనే!
రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్ మెగా వేలానికి తెరపడింది. ఇషాన్ కిషన్ రూ.15.25 కోట్ల ధరను దక్కించుకుని.. వేలంలో అత్యధిక ధరను దక్కించుకున్న వారిలో టాప్-5కి చేరుకున్నాడు. దీంతోపాటు క్రీడాకారులు కోటీశ్వరులుగా మారారు. మెగా వేలం ముగియడంతో.. ఇక అందరి చూపు ఐపీఎల్ ప్రారంభం వైపుకు తిరిగింది.