India vs Kuwait Final: 9వ SAFF టైటిల్ నెగ్గిన భారత్, పెనాల్టీ షూటౌట్లో 5-4తో కువైట్ పై విజయం
India vs Kuwait Final: భారత ఫుట్ బాల్ జట్టు 9వ సారి సాఫ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. పెనాల్టీ షూటౌట్ లో భారత్ 5-4తో కువైట్‌ను ఓడించింది.
India vs Kuwait Final: భారత ఫుట్ బాల్ జట్టు 9వ సారి సాఫ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. సునీల్ ఛెత్రీ సారథ్యంలోని టీమిండియా జట్టు ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కువైట్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ముందు నిర్ణీత సమయం ముగిసే సమయానికి భారత్, కువైట్ జట్లు ఒక్కో గోల్ చేయడంతో మ్యాచ్ 1-1తో డ్రా అయింది. అయితే నిర్ణయాత్మక పెనాల్టీ షూటౌట్ కు దారితీసిన మ్యాచ్ లో చివర్లో అద్భుతంగా రాణించిన భారత్ 5-4తో కువైట్‌ను ఓడించింది.
సాఫ్ 2023 ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్, కువైట్ తలపడ్డాయి. అయితే నిర్ణీత సమయంలో ఫలితం తేలలేదు. ఇరు జట్లు ఒక్కో గోల్ చేయగా మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు వెల్లింది. పెనాల్టీ షూటౌట్‌లో భారత ఆటగాడు ఉదాంత సింగ్ ఒక పెనాల్టీ ఛాన్స్ మిస్ చేయగా, మిగతా నాలుగు ప్రయత్నాల్లో విజయం సాధించి గోల్స్ చేశారు. కువైట్ సైతం 4 ప్రయత్నాల్లో విజయం సాధించింది. భారత గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సంధు కువైట్ ఆటగాడు హజియా పెనాల్టీని గోల్ చేయకుండా అడ్డుకోవడంతో భారత్ ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారత్ గతంలో 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021 సంవత్సరాలలో విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో విజయంతో 9వ సారి సాఫ్ ఛాంపియన్ గా అవతరించింది.
🇮🇳 INDIA are SAFF 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 for the 9️⃣th time! 💙
— Indian Football Team (@IndianFootball) July 4, 2023
🏆 1993
🏆 1997
🏆 1999
🏆 2005
🏆 2009
🏆 2011
🏆 2015
🏆 2021
🏆 𝟮𝟬𝟮𝟯#SAFFChampionship2023 #BlueTigers 🐯 #IndianFootball ⚽ pic.twitter.com/3iLJQSeyWG
గత వారం ఇవే జట్లు గ్రూప్ దశలో తలపడగా ఆ మ్యాచ్ సైతం 1-1తో ముగిసింది. నేడు ఫైనల్ కావడంతో ఫలితం తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఫైనల్స్ చేరడానికి ముందు ఇరు జట్లు మంచి గేమ్స్ ఆడాయి. భారత్ తొమ్మిది మ్యాచ్ లు, ప్రత్యర్థి కువైట్ జట్టు ఆరు మ్యాచ్ లు గత నెల రోజుల్లో ఆడాయి. సెమీఫైనల్ మ్యాచ్ లో ఈ జట్లు లెబనాన్ టీమ్ ను, బంగ్లాదేశ్‌లను నాకౌట్ చేయడానికి 120 నిమిషాల సమయం తీసుకున్నాయి.
కువైట్ విషయానికొస్తే గత 13 ఏళ్ల నుంచి ఆ జట్టు ఒక్క కప్పు కూడా కొట్టలేదు. చివరగా కువైట్ టీమ్ 2010 అరేబియన్ గల్ఫ్ కప్ సాధించింది. మరోవైపు ఫిఫా ఆ టీమ్ ను అక్టోబర్ 2015 నుంచి డిసెంబర్ 2017 వరకు నిషేధించడం తెలిసిందే. సాఫ్ ఛాంపియన్ షిప్ నెగ్గి మాజీలకు అంకితం చేయాలనుకున్న కువైట్ ప్లేయర్లకు నిరాశే ఎదురైంది. సెకండ్ సెమీఫైనల్లో లెబనాన్ ఆటగాళ్ల గోల్స్ ను భారత గోల్ కీపర్ గుర్మీత్ సింగ్ అద్భుతంగా అడ్డుకోవడంతో భారత్ ఫైనల్ చేరింది. మరోవైపు ఛెత్రీ, అన్వర్, మహేష్, ఉదాంత సత్తా చాటడంతో రికార్డు స్థాయిలో తొమ్మిదో సారి సాఫ్ ఛాంపియన్ గా భారత్ నిలిచింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial