PAK vs ENG Final: ఫైనల్లో పాక్ విలవిల - ఇంగ్లాండ్ టార్గెట్ 138
ICC T20 WC 2022, IND vs PAK: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. ఫస్టాప్‌లో ఆంగ్లేయులే ఆధిపత్యం చెలాయించారు. పాక్‌ను 137కే పరిమితం చేశారు.
IND vs PAK, 1 Innings Highlight: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. ట్రోఫీ గెలిచేందుకు ఇంగ్లాండ్, పాకిస్థాన్ నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. అయితే ఫస్టాప్‌లో ఆంగ్లేయులే ఆధిపత్యం చెలాయించారు. ఆదిల్ రషీద్ (2/22), సామ్ కరన్ (3/12) తమ బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. పాక్‌ను 137కే పరిమితం చేశారు. ఆ జట్టులో బాబర్ ఆజామ్ (32; 28 బంతుల్లో 2x4), షాన్ మసూద్ (38; 28 బంతుల్లో 2x4, 1x6) టాప్ స్కోరర్లు.
View this post on Instagram
భయపెట్టిన బౌలర్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ బ్యాటర్లను ఇంగ్లిష్ బౌలర్లు వణికించారు. ఓవర్ క్యాస్ట్ కండిషన్స్‌ను ఉపయోగించుకొని చక్కని లెంగ్తుల్లో బంతులు విసిరారు. స్వింగ్, బౌన్స్‌తో ప్రత్యర్థికి మెరుగైన ఆరంభం దక్కనీయలేదు. ఓపెనర్లు రిజ్వాన్ (15), బాబర్ ఆజామ్ (32) షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. జట్టు స్కోరు 29 వద్ద కరన్ వేసిన బంతికి రిజ్వాన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి పాక్ 39/1తో నిలిచింది.
వన్‌డౌన్‌లో వచ్చిన హ్యారిస్ (8)ను రషీద్ బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో బాబర్, మసూద్ 24 బంతుల్లో 39 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. అద్భుతమైన గూగ్లీతో బాబర్‌ను ఔట్ చేసి రషీద్ ఈ జోడీని విడగొట్టాడు. తన స్పిన్‌తో పరుగుల్నీ నియంత్రించాడు. మరికాసేపటికే స్టోక్స్ బౌలింగ్‌లో ఇఫ్తికార్ ఔటయ్యాడు. కష్టాల్లో పడ్డ జట్టును షాదాబ్ (20) ఆదుకొనే ప్రయత్నం చేశాడు. రెండు పరుగుల వ్యవధిలోనే మసూద్, షాదాబ్ పెవిలియన్ చేరడంతో రన్‌రేట్ తగ్గిపోయింది. ఆఖర్లో టపటపా వికెట్లు పడటంతో పాక్ 138/7 వద్ద ఆగిపోయింది.
View this post on Instagram