News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

Bhagavad Gita: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఉపదేశించిన భగవద్గీతలో సమాధానం లేని సందేహం ఉండదు. ఏదో తీవ్రమైన కష్టంలో ఉన్నాం అనుకునేవారు ఒక్కసారి భగవద్గీత చదివితే అంతకు మించిన ఉపశమనం దొరకదేమో.

FOLLOW US: 
Share:

Bhagavad Gita:  బాధలో ఉన్నప్పుడు చిన్న మాట స్వాంతన చేకూర్చుతుంది. దుఃఖంలో కూరుకుపోయినప్పుడు ఓ చిన్న మాట అంతులేని ఓదార్పునిస్తుంది.  ఎందుకీ జీవితం అనిపించినప్పుడు ఓ చిన్న సూక్తి ఎందుకు జీవించాలో చెబుతుంది. చెప్పాలంటే సమస్యలు లేని జీవితం ఉంటుందా, బాధలేని మనిషి ఉంటారా... కానీ సమస్యకైనా, బాధకైనా, దిగులుకైనా, దఃఖానికైనా అన్నింటికీ సమాధానం భగవద్గీత. 

సాక్షాత్తూ శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి, హృదయం వికలమై.. రాజ్యం కోసం వారిని నేను వధించలేనని బాధపడిన అర్జునుడికి చెప్పిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత. దీనిని మతగ్రంధంగా పూజించే గ్రంధంగా భావించరాదు.. మనిషిగా బతకడానికి కావాల్సిన సూత్రాలు అందించే  అందించిన గ్రంధం. ఇందులో కొన్ని శ్లోకాల సారాంశం తెలుసుకున్నా చాలు. అలాంటి కొన్ని శ్లోకాలు మీకోసం.... 

శ్లోకం
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే|
గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితాః||

భావం: దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితం. ఆత్మానాత్మ వివేకులు, అనిత్యములైన శరీరం గురించి కానీ, నిత్యం-శాశ్వతం అయిన ఆత్మ గురించి కానీ దుఃఖించరాదు.

శ్లోకం
దేహినోऽస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా|
తథా దేహాన్తరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి ||

భావం: శరీరానికి బాల్యం, యవ్వనం, ముసలితనం ఎలాగో..జీవుడికి మరొక దేహమును పొందడం కూడా అంతే. అందుకే ఈ విషయంపై ధీరులు మోహం పెంచుకోరు

Also Read: భగవద్గీత మొత్తం చదవలేదా అయితే ఈ శ్లోకాలు గుర్తుపెట్టుకోండి చాలు!

శ్లోకం
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోऽపరాణి|
తథా శరీరాణి విహాయ జీర్ణా- న్యన్యాని సంయాతి నవాని దేహీ

భావం: చిరిగిన వస్త్రాలు విడిచి నూతన వస్త్రాలు ఎలా ధరిస్తారో అలాగే  ఆత్మ(జీవాత్మ) జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది

శ్లోకం
నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః|
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః||

భావం:ఆత్మ నాశనము లేనిది, ఆత్మను శస్త్రములు చేధించలేవు, అత్మ అగ్నిలో దహనం కాదు, ఆత్మ నీట్లో తడవదు, వాయువు ఆపేయలేదు.. అందుకే ఆత్మకు నాశనం లేదు

శ్లోకం
జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ|
తస్మాదపరిహార్యేऽర్థే న త్వం శోచితుమర్హసి|| 

భావం: పుట్టినవానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.

Also Read: భగవద్గీత - సక్సెస్ ఫుల్ పర్సన్ కావాలంటే మీలో ఏ ల‌క్ష‌ణాలు ఉండాలో తెలుసా?

శ్లోకం
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి|| 

భావం:కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు.

శ్లోకం
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః|
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే|| 

భావం: దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడును, రాగము, భయము, క్రోధము పోయిన వాడును, స్థితప్రజ్ఞుడు అంటారు

శ్లోకం
ధ్యాయతో విషయాన్పుంసః సఙ్గస్తేషూపజాయతే|
సఙ్గాత్సఞ్జాయతే కామః కామాత్క్రోధోऽభిజాయతే|| 

భావం:విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధం వల్ల అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితంగా బుద్ధిని కోల్పోయి అధోగతి చెందుతారు

శ్లోకం
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి|
స్థిత్వాస్యామన్తకాలేऽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి|| 

భావం: ఆత్మజ్ఞానపూర్వక కర్మానుస్టారము, బ్రహ్మప్రాప్తిసాధనము కలిగిన జీవుడు సంసారంలో పడకుండా సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. 

Also Read : ఈ రెండు పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవద్దని భగవద్గీత చెబుతోంది!

గీతోపదేశంలో శ్రీకృష్ణుడు అస్త్రశస్త్రాల విశేషాల గురించి చెప్పలేదు. వాటిని ఎలా సంధించాలో వివరించలేదు. యుద్ధ వ్యూహాలు నేర్పించలేదు. శత్రువులను సంహరించే మెలకువలనూ నేర్పలేదు. ఈ విషయాలన్నింటిలో తనకు తానే సాటి అయిన అర్జునుడిని ఆవహించిన మాయను తొలగించి రణరంగంలోకి దిగేలా బోధించాడు. ‘నీకు నిర్దేశించిన కర్మలను నువ్వు చేయడమే సరైనది. దేనినీ చేయకపోవడం కన్నా నీ ధర్మాన్ని అనుసరించి పని చేయడమే ఉత్తమం. ఏ పనీ చేయకుండా ఉంటే శరీర నిర్వహణ కూడా ముందుకు కొనసాగదు’. అని బోధించాడు. అది రణరంగంలో అర్జునుడికి మాత్రమే కాదు..మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరికీ వాసుదేవుడు బోధించిన పాఠం భగవద్గీత.

Published at : 22 Sep 2023 05:15 PM (IST) Tags: Devotional Spirituality Arjuna Bhagavad Gita mahabharat Srikrishna

ఇవి కూడా చూడండి

Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!

Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!

Horoscope Today December 2nd, 2023: ఈ రాశివారు ఒత్తికి దూరంగా ఉండాలి లేదంటే..

Horoscope Today  December 2nd, 2023: ఈ రాశివారు ఒత్తికి దూరంగా ఉండాలి లేదంటే..

Christmas 2023: క్రిస్మస్ వేడుకలు‌ డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు!

Christmas 2023: క్రిస్మస్ వేడుకలు‌ డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు!

Political Astrology Predictions 2023: 2023 ఎన్నికల్లో ఈ 6 రాశుల రాజకీయనాయకులకు గ్రహాలు అనుకూలంగా లేవు - ఏదైనా అద్భుతం జరగాలంతే!

Political Astrology Predictions 2023: 2023 ఎన్నికల్లో ఈ 6 రాశుల రాజకీయనాయకులకు గ్రహాలు అనుకూలంగా లేవు - ఏదైనా అద్భుతం జరగాలంతే!

Political Astrology Predictions 2023: 2023 ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయనాయకులు గెలవడం పక్కా !

Political Astrology Predictions 2023: 2023 ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయనాయకులు గెలవడం పక్కా !

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం