అన్వేషించండి
Advertisement

TTD News:అమ్మవారి నవ్వు, చూపు, సిగ్గు, మాటకు ప్రతీక అయిన ముత్యాలపందిరిపై ఆదిలక్ష్మి అలంకారంలో అలమేలుమంగ
Tiruchanoor : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా అలమేరు మంగ ముత్యపుపందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చింది

Tiruchanoor
1/5

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై శ్రీ ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించింది
2/5

నవంబరు 30 ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో భక్తులు భారీగా పాల్గొని అమ్మను దర్శించుకున్నారు
3/5

ముత్యాలంటే అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి...స్వాతికార్తెలో ముత్యపుచిప్పల్లో చినుకు పడి మేలుముత్యంగా రూపొందుతాయంటారు. అలాంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో వర్ణించారు
4/5

తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తుల కన్నులకు అంతకుమించిన పండుగ ఏముంటుంది
5/5

కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 12 నుంచి రెండున్నర వరకూ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు వరకూ అలిమేలుమంగకు ఉంజల్ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుంచి 9 వరకూ అమ్మవారు సింహవాహనంపై భక్తులను కటాక్షించనుంది
Published at : 30 Nov 2024 12:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తిరుపతి
న్యూస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion