అన్వేషించండి
Brahmamudi April 12th Episode: ఏదో అడగాలని ఎంతో చెప్పాలని ..రాజ్ కావ్య మనసులో ప్రేమ ఉప్పెన - బ్రహ్మముడి ఏప్రిల్ 12 ఎపిసోడ్ హైలెట్స్!
Brahma Mudi Serial Today Episode: రాజ్ ని రామ్ గా మార్చేసింది యామిని. రాజ్ చచ్చిపోయాడని ఇంట్లో అందరూ నమ్ముతున్నా కావ్య మాత్రం తను తిరిగివస్తాడంటోంది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇవే...

Brahma Mudi Serial Today episode April 12 Episode
1/11

ఎందుకు వచ్చారు అని కావ్య అడిగితే..బొకే ఇవ్వడానికి అని కవర్ చేస్తాడు. మిమ్మల్ని చూసినప్పటి నుంచి బాగా తెలిసినవాళ్లలా అనిపించారు దాని గురించి ఏమైనా ఆలోచించారా అని రాజ్ అడిగితే..కావ్య ఎమోషనల్ అవుతుంది.
2/11

నేను గతం మర్చిపోయాను మీరు బాగానే ఉన్నారుగా నిజం చెప్పండి..ఇంతకు ముందు మనం ఎప్పుడైనా కలిశామా అని రాజ్ అడుగుతాడు. ఈ విషయం మీరు చెప్పకపోతే మిమ్మల్ని ఎక్కడికీ పంపించను అంటాడు. నాకు వెళ్లాలని లేదు కానీ ఉండలేను, ఉండి నిజం చెప్పలేను అని వెళ్లిపోతుంది
3/11

మరోవైపు యామిని రాజ్ ని వెతుక్కుంటూ ఆఫీస్ కి వస్తుంది. లోపలకు వెళ్లి ఉంటే స్టాఫ్ చూసి గుర్తుపట్టేస్తారు..ఎలాగైనా బయటకు తీసుకెళ్లిపోవాలి అనుకుంటూ లోపలకు వెళ్లి శ్రుతిని కలుస్తుంది. రామ్ కోసం వచ్చాను అంటే ఆ పేరుతో ఎవరూ లేరు అనేస్తుంది శ్రుతి. రాజ్ అనగానే అర్థమవుతుంది
4/11

రాజ్ సార్‌కి అలా జరిగేసరికి కావ్య మేడమ్‌ని ఓదార్చేందుకు వచ్చారా అంటుంది. వాట్ అని షాక్ అవుతుంది యామిని. ఇంతలో బయటకు వచ్చిన రాజ్ ... తన కారు వెనుకే రాజ్ కారు చూసి షాక్ అయి కాల్ చేస్తాడు. నేను ఇక్కడున్నట్టు తనకి ఎలా తెలిసింది అనుకుంటాడు. కాల్ లిఫ్ట్ చేసిన యామినితో నేను నీ కారు దగ్గర ఉన్నాను అనడంతో వస్తున్నా అని వెళ్లిపోతుంది.
5/11

నాకు తెలియకుండా నన్ను ఫాలో చేస్తున్నావా అని ఫైర్ అవుతాడు రాజ్. నేను నా ఫ్రెండ్ ని కలిసేందుకు వెళుతుంటే నీ కారు కనిపించి ఆగాను అని అబద్ధం చెబుతుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ అని అడిగితే ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడేందుకు వచ్చాను అంటాడు.. హమ్మయ్య ఆఫీసుకి కాదు అని కూల్ అవుతుంది
6/11

ఫ్యామిలీ సభ్యులంతా హాల్లో కూర్చుని ఉంటారు. రేపు వదిన పుట్టినరోజు కదా అన్నయ్యా అంటాడు ప్రకాశం. రాజ్ ఉన్నప్పుడైతే వదిన పుట్టిన రోజుకి గుడిలో అన్నదానం చేసేవారు..ఇప్పుడు ఆ ఆనందం లేదుకదా అంటుంది.
7/11

తనే లేనప్పుడు పుట్టినరోజులెందుకు అనేసి బాధగా వెళ్లిపోతుంది అపర్ణ. చేదు విషయాలు త్వరగా మరిచిపోవడమే మంచిది అంటుంది. నాకు ఆకలి లేదంటుంది అపర్ణ. పదండి మనం తిందాం అంటుంది రుద్రాణి. నువ్వు మనిషివేనా అని ఫైర్ అవుతుంది ధాన్యం.
8/11

ఇన్నాళ్లూ ఆస్తులకోసం గొడవపడినప్పుడు ఈ ప్రేమంతా ఎక్కడికి పోయిందని అంటుంది వెటకారంగా. సాటి మనిషికి కష్టం వస్తే నీలా చూస్తూ ఊరుకోలేను అంటుంది. ఇదంతా చూసి అప్పు..ఇక ఆలస్యం చేయకూడదు నిజం బయటపెట్టాలి అనుకుంటుంది
9/11

రాజ్ వెళ్లిపోయిన తర్వాత ఆ బొకే చూస్తూ కూర్చుంటుంది కావ్య. ఇక్కడ కావ్య..అక్కడ రాజ్ మనసులతో మాట్లాడుకుంటారు. నిజం చెప్పొచ్చుకదా అని రాజ్ అనుకుంటే మీరే తెలుసుకోవాలి అంటుంది కావ్య...
10/11

బిల్స్ క్లియర్ చేయలేదంటూ పార్టనర్స్ వచ్చి కావ్యతో మాట్లాడుతారు. మేనేజర్ ని పిలిచి మాట్లాడిన కావ్య.. 24 గంటల్లో మీ డబ్బును ఇచ్చేస్తామని మాటిస్తుంది కావ్య
11/11

బ్రహ్మముడి ఏప్రిల్ 14 ఎపిసోడ్ లో ఇంటికొచ్చిన కావ్యతో జరిగినదంతా చెబుతుంది అప్పు. నిజం చెప్పాల్సిన టైమ్ వచ్చిందంటుంది. లోపలకు వెళ్లి అపర్ణను ఓదార్చిన కావ్య.. మీ అబ్బాయి బతికే ఉన్నాడు మీకు చూపిస్తాను అని ప్రామిస్ చేస్తుంది.. అపర్ణ సంతోషంగా ఉంటుంది. https://www.hotstar.com/in
Published at : 12 Apr 2025 08:52 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
వరంగల్
న్యూస్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion