అన్వేషించండి
Bhanumathi Serial Today Episode ఏప్రిల్ 09 ఎపిసోడ్: శక్తి కుట్ర, శాంభవి అక్కసు.. ఆవేదనలో పార్థు, ఎగ్జామ్ హడావుడిలో భాను- భానుమతి ఏప్రిల్ 09 ఎపిసోడ్ హైలెట్స్!
Bhanumathi Serial Today: చదువుకుని డాక్టర్ అవ్వాలని కలలు కనే భానుమతి.. తండ్రికోసం చదువు త్యాగం చేసిన పార్థు... ఇద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతోంది. భానుమతి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Bhanumathi Serial April 9th Episode Written Update
1/10

మీరు జనాల ముందు పెద్దవారు కావొచ్చు..కానీ మా ముందు కాదంటాడు SI. నీ ఉద్యోగంలో పవర్ నాపై చూపిద్దాం అనుకుంటున్నావా అని అడుగుతాడు బలరాం. నన్ను ఎంత త్వరగా తీసుకొచ్చావో అంతే త్వరగా నేను బయటకు వెళ్తా అంటాడు బలరాం
2/10

ఎవరో కాల్ చేస్తే ఆ పెళ్లి ఆపడానికి వచ్చాను..కానీ ఇప్పుడు సమస్య నాది, పంతం నాది , ప్రతీకారం నాది.. నాపై చేయి చేసుకుంటావా అని రగిలిపోతాడు SI. ఇంతలో పోలీస్ స్టేషన్ కి వచ్చి పార్థు, సూరి, దుర్గలను లోపలకు వెళ్లకుండా అడ్డుకుంటారు
3/10

పదిమందికి న్యాయం చెప్పే నా కొడుక్కి ఇంత అన్యాయమా అని బలరామ్ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇదే అదనుగా శాంభవి రెచ్చిపోతుంది. ఇలాంటి అలగా జనంతో సంబంధం కలుపుకోవడం వల్లే ఈ సమస్య అని నోరుపారేసుకుంటుంది. శారద నచ్చచెప్పినా వినదు
4/10

శక్తి కొడుకు వచ్చి నా దగ్గర ఓ ఆయుధం ఉందంటూ తాను తీసిన వీడియో చూపిస్తాడు. ఎస్ ఐ ని బలరాం కొట్టడం, ఆయన్ను అరెస్ట్ చేయడం ఉంటుంది. ఈ వీడియో వైరల్ అయితే పరువుపోతుందని చెబుతాడు. పెదనాన్నకి ఎంత అవమానం జరిగితే ఆయన్ను తొక్కేయడానికి అంత మంచి అవకాశం దొరుకుతుంది అంటుంది శక్తి
5/10

పెళ్లి ఆగిపోయిన బాధతో ఇంటికొచ్చిన కోటి, ప్రమీల బాధపడతారు. భానుమతి ఆ ఇంట్లోకి అడుగుపెడితే నా జీవితం కూడా బాగుంటుందని కలలు కన్నా అంటాడు కోటి. నా కూతురి జీవితంలో సుఖం లేదేమో అని బాధపడుతుంది ప్రమీల.
6/10

కోటీశ్వరుల ఇంటికి వియ్యంకులం అయిపోతున్నామని కలలు కన్నారని సూటిపోటి మాటలంటారు చుట్టుపక్కలవారంతా. బలరామ్ గారి మనసులో ఏముందో తెలిస్తే మనం తర్వాత ఏం చేయాలో తెలుస్తుంది నేను పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లొస్తా అంటాడు కోటి. భానుమతిని ఇల్లు దాటనీయొద్దని చెబుతాడు.
7/10

పెళ్లి ఆగిపోయింది కాబట్టి పరీక్ష రాయడానికి వెళ్లొచ్చు అనుకుంటే నానమ్మ ఉంటే ఎలా అనుకుంటారు భాను, వసు. వందరూపాయల నోటుకి దారం కట్టి కుమారికి ఎర చూపించి పరుగులు తీయిస్తుంది వసు. అదే టైమ్ లో భానుమతి తప్పించుకుని ఎగ్జామ్ కి వెళుతుంది
8/10

పోలీస్ స్టేషన్ కి వెళ్లే దారిలో స్వామీజీ కనిపిస్తే విభూది తీసుకుని పార్థు దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు కోటి. మరోవైపు లాయర్ కోసం పార్థు, సూరి, దుర్గలు ఎదురుచూస్తుంటారు
9/10

పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు బస్సు కోసం పరుగులు తీస్తుంది భానుమతి. తాను ఎలాగైనా పరీక్ష రాసి డాక్టర్ కావాలని దేవుడిని కోరుకుంటుంది.
10/10

బానుమతి ఏప్రిల్ 10 ఎపిసోడ్ లో... కాల్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసుకోమని బలరాం అంటాడు.. ఆమెను వదిలిపెట్టేది లేదంటాడు పార్థు.
Published at : 09 Apr 2025 10:15 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion