అన్వేషించండి
Chiranjeevi with Pawan Kalyan Photos : 'తమ్ముడి' సేవకు 'అన్నయ్య' ఫిదా.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి భారీ విరాళం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi latest photos with Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీకి భారీ మొత్తంలో విరాళం ఇచ్చారు. వాటికి సంబంధించిన ఎమోషనల్ పోస్ట్‌ను చిరు తన ఇన్‌స్టాలో రాశారు.

మెగా బ్రదర్స్ కలిసిన వేళ.. చిరుతో పవన్ కళ్యాణ్(Images Source : Insatagram/chiranjeevikonidela)
1/6

మెగా బ్రదర్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి చాలా రోజులు అయింది. రీసెంట్గా జరిగిన పండుగల సమయంలో కూడా పవన్ ఎక్కడా వారితో కనిపించలేదు. ఆ లోటును ఇప్పటికి తీర్చారు మెగా బ్రదర్స్. (Images Source : Insatagram/chiranjeevikonidela)
2/6

చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర మూవీ సెట్స్‌కి పవన్ కళ్యాణ్.. మరో అన్న నాగబాబుతో వెళ్లి కలిశారు. మెగాస్టార్.. పవర్ స్టార్‌ని కలిసి చూసిన అభిమానులు తెగ పండుగ చేసుకుంటున్నారు.(Images Source : Insatagram/chiranjeevikonidela)
3/6

తమ్ముడి చేస్తున్న సేవకు మెచ్చిన అన్నయ్య.. జనసేన పార్టీకి భారీ మొత్తంలో విరాళం అందించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. (Images Source : Insatagram/chiranjeevikonidela)
4/6

ఈ నేపథ్యంలో ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన చిరంజీవి.. ఓ ఎమోషన్ క్యాప్షన్ పెట్టారు. అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు. అధికారం లేకపోయినా, తన సంపాదన ని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం.తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన కి విరాళాన్ని అందించాను.. అంటూ క్యాప్షన్ పెట్టారు.(Images Source : Insatagram/chiranjeevikonidela)
5/6

నిస్వార్థపరుడైన తన తమ్ముడి పార్టీకి కొంతైనా తన వంతు సాయం చేస్తున్నట్లు చిరు దానిలో వివరించారు. దీంతో మెగా అభిమానులు కామెంట్ల రూపంలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ తరఫున చిరంజీవి మొట్ట మొదటిసారి ఇన్వాల్వ్ అయ్యారంటూ హ్యాపీగా ఉందంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు.(Images Source : Insatagram/chiranjeevikonidela)
6/6

పార్టీ విషయం పక్కన పెడితే.. ఈ అన్నదమ్ముల కలయికను చూసి అభిమానులు ఆనందంగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. (Images Source : Insatagram/chiranjeevikonidela)
Published at : 08 Apr 2024 07:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion