అన్వేషించండి
Photo Moment: టాలీవుడ్ సూపర్‌స్టార్‌తో లేడీ సూపర్ స్టార్ - అఖిల్ అక్కినేనిని గుర్తు పట్టారా?
Mahesh Babu and Nayanthara: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, లేడీ సూపర్ స్టార్ నయనతారను ఒక్క ఫ్రేములో చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అనంత్ అంబానీ పెళ్లిలో ఆ ముచ్చట తీరింది.

అనంత్ అంబానీ రాధికా మర్చంట్ పెళ్లిలో సౌత్ స్టార్స్
1/5

తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క తెలుగులో ఏమిటి? బాలీవుడ్ హీరోయిన్లు చాలా మందికి ఆయన ఫేవరెట్. ఆల్ ఓవర్ వరల్డ్ ఫాలోయింగ్ ఉంది. లేడీ సూపర్ స్టార్ నయనతారకు సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సూపర్ స్టార్లు ఇద్దర్నీ ఒక్క ఫ్రేములో చూడాలని ప్రేక్షకులు కొందరు ఆశపడ్డారు. ఆ కోరిక అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లితో తీరింది. సినిమాలో కలిసి నటించలేదు కానీ పెళ్లిలో కలిసి ఫోటోకి ఫోజు ఇచ్చారు. మహేష్ బాబు, నమ్రత, సితారతో పాటు విఘ్నేష్ శివన్ - నయన్ దంపతులతో పాటు ఈ ఫోటోలో సూర్య, జ్యోతిక దంపతులు, జెనీలియాను సైతం చూడొచ్చు. అన్నట్టు... అఖిల్ అక్కినేనిని గుర్తు పట్టారా? ఆ ఫోటోలో ఉన్నాడు.
2/5

కొత్త జంట అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ దంపతులతో విఘ్నేష్ శివన్, నయనతార దంపతులు. ఈ ఫోటో షేర్ చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు నయన్ - శివన్
3/5

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజయపథంలో నడిపిన ధోనికి విఘ్నేష్ శివన్ ఫ్యాన్. ధోని దంపతులతో నయన్ - శివన్ జోడీ.
4/5

బంగారు వర్ణపు చీరలో ఒంటి నిండా నగలతో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లికి నయనతార వెళ్లారు. ధగధగ మెరిసిపోయారు.
5/5

నయనతార మీద తన ప్రేమను చూపించే విషయంలో విఘ్నేష్ శివన్ ఎప్పుడూ ముందు ఉంటారు. నయన్ కూడా అంతే! ఆవిడ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Published at : 17 Jul 2024 11:12 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion