అన్వేషించండి
Actress Anjali: 'గేమ్ ఛేంజర్'కి అలాంటి కండిషన్స్ - ఏం చేయను, నా నోటికి ప్లాస్టర్ వేసేశారు..
Actress Anjali on Game Changer: నటి అంజలి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌పై ఆసక్తిర అప్‌డేట్ ఇచ్చింది. ఈ మూవీ విషయంలో కొన్ని కండిషన్స్ ఉన్నాయని, నా నోటికి ప్లాస్టర్ వేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Image Credit: yours_anjali/instagram
1/7

Actress Anjali About Game Changer Movie: సినీ నటి, తెలుగమ్మాయి అంజలి రీఎంట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవల గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో అలరించిన అంజలి ఇప్పుడు విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో ఫ్యాన్స్ పలకరించేందుకు రెడీ అవుతుంది.
2/7

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్య్వూలతో బిజీగా ఉంది. దీంతో అంజలి ఎక్కడికి వెళ్లిన గేమ్ ఛేంజర్ మూవీ విశేషాలపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే గేమ్ ఛేంజర్ సినిమా గురించి చాలా చెప్పాలని ఉందని, ముఖ్యంగా తన పాత్ర గురించి చెప్పేందుకు చాలా ఉత్సాహంతో ఉన్నానంది.
3/7

అంజలి మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్‌లో నా పాత్ర గురించి చాలా చెప్పాలని ఉంది. ఎన్నో విషయాలు నా గొంతు వరకు వచ్చి ఆగిపోతున్నాయి. కానీ ఏం చేయను. దర్శక-నిర్మాత కండిషన్స్ వల్ల ఏం చెప్పలేకపోతున్నా.
4/7

ఈ సినిమా గురించి ప్రొడక్షన్ హౌస్ కానీ, దర్శకుడు శంకర్ గారు కానీ ఏమీ మాట్లాడట్లేదు. అలాగే ఎవరినీ కూడా ఏం మాట్లాడొద్దంటున్నారు. అందుకే నేను ఏం చెప్పలేకపోతున్నారు. ఇలా మూవీ గురించి అడిగిన ప్రతిసారి నా మాటలు గొంతువరకు వచ్చి ఆగిపోతున్నాయి.
5/7

దీంతో నా నోటికి ప్లాస్టర్ వేసినట్టుగా అనిపిస్తోంది" అంటూ పట్టుకొచ్చింది. అనంతరం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో తన పాత్రపై గురించి చెప్పుకొచ్చింది. "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నా పాత్ర పేరు రత్నమాల. నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది.
6/7

ఇందులోని వైవిధ్యమే నన్ను ఈ సినిమాకు అంగీకరించేలా చేసింది. సినిమాలో నా పాత్రను మలిచిన తీరు చాలా బాగుంది. నిజానికి అందరు నన్ను పక్కంటి అమ్మాయి పాత్రలో చూడాలనుకుంటారు.
7/7

కానీ దానికి రత్నమాల రోల్ చాలా భిన్నంగా ఉంటుంది. ఈ పాత్ర నేను మాత్రమే న్యాయం చేయగలననే నమ్మకం డైరెక్టర్ కృష్ణ చైతన్య నన్ను తీసుకున్నారు. ఏ నమ్మకంతో నన్ను తీసుకున్నారో కానీ, ఇలాంటి మంచి పాత్ర పోషించినందుకు మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.
Published at : 28 May 2024 09:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
రాజమండ్రి
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion