Gaza News: మృతుల సంఖ్యలో కన్‌ఫ్యూజన్, క్లారిటీ ఇచ్చిన ఇజ్రాయేల్
Israel Gaza Attack: ఇజ్రాయేల్ హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్యలో కన్‌ఫ్యూజన్‌పై ఓ అధికారి క్లారిటీ ఇచ్చారు.
Israel Gaza War:
1,200 మంది మృతి..
ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంలో(Israel Hamas War) మృతుల సంఖ్య విషయంలో ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ 1,400 మంది ఇజ్రాయేల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పిన ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఆ తరవాత 1,200 మందే చనిపోయారని లెక్కలు వెల్లడించింది. దీనిపై ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు సలహాదారు వివరణ ఇచ్చారు. "పొరపాటును సంఖ్యని పెంచి చెప్పాం" అని వెల్లడించారు. అమెరికా న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయేల్ అధికారి మార్క్ రెగెవ్ (Mark Regev) దీనిపై క్లారిటీ ఇచ్చారు. చాలా మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయని, వాళ్లందరూ ఇజ్రాయేల్ పౌరులే అని పొరపడినట్టు చెప్పారు. వాళ్లంతా హమాస్ ఉగ్రవాదులు అని తరవాత గుర్తించామని అందుకే..మృతుల సంఖ్యని సవరించాల్సి వచ్చిందని వివరించారు.
"ముందుగా 1,400 మంది ఇజ్రాయేల్ పౌరులు చనిపోయారని వెల్లడించాం. కానీ ఇప్పుడా సంఖ్యని 1,200 కి తగ్గించాం. మృతుల సంఖ్యని ఎక్కువగా అంచనా వేశాం. ఈ విషయంలో పొరపాటు చేశాం. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్నాయి. అవి ఇజ్రాయేల్ పౌరులవే అనుకున్నాం. కానీ విచారణ చేపట్టిన తరవాత అవి హమాస్ ఉగ్రవాదులవే అని గుర్తించాం"
- మార్క్ రెగెవ్, ఇజ్రాయేల్ అధికారి
గత వారం ఇజ్రాయేల్ విదేశాంగ శాఖ ప్రతినిధి అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రదాడుల గురించి మాట్లాడుతూ మృతుల సంఖ్యని వెల్లడించారు. అటు పాలస్తీనా మాత్రం ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి 11,470 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది.
చిన్నారులు ప్రాణాలు బలి..
ఇజ్రాయేల్, హమాస్ మధ్య (Israel Hamas War) జరుగుతున్న యుద్ధంలో Al Shifa హాస్పిటల్ (Al Shifa Hospital) కీలకంగా మారింది. మొత్తం యుద్ధం అంతా ఇక్కడ ఒక్క చోటే జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ హాస్పిటల్‌నే హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్‌గా వినియోగించుకుంటున్నారని ఇజ్రాయేల్ భావిస్తోంది. అందుకే ఈ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. ఈ కారణంగా వేలాది మంది రోగులకు వైద్యం అందడం లేదు. చిన్నారులు చనిపోతున్నారు. మరి కొంత మంది గాజా పౌరులు (Gaza Updates) అక్కడి నుంచి వేరే చోటకు వెళ్లిపోతున్నారు. ఈ విషయంలో ఇజ్రాయేల్‌పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ..."హమాస్‌ని అంతం చేయడమే మా లక్ష్యం" అని తేల్చి చెబుతోంది. హాస్పిటల్‌లో మిలిటరీ యాక్టివిటీస్ అన్నీ తక్షణమే ఆపేయాలని ఇజ్రాయేల్ గాజాని హెచ్చరించింది. 12 గంటల్లోగా దాడులను విరమించుకోవాలని డెడ్‌లైన్ పెట్టింది. కానీ అందుకు గాజా అంగీకరించలేదు. హమాస్ ఉగ్రవాదులు (Hamas in Gaza) లొంగిపోవాలని అల్టిమేటం జారీ చేసినప్పటికీ అదీ వర్కౌట్ కాలేదు. అందుకే దాడుల తీవ్రతను పెంచింది ఇజ్రాయేల్. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం (United Nations) కనీసం 2,300 మంది రోగులు హాస్పిటల్ నుంచి వెళ్లిపోయారు. చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే చిక్కుకుపోయిన వాళ్లూ మెల్లగా బయటకు వస్తున్నారు. నవంబర్ 14 నాటి లెక్కల ప్రకారం హాస్పిటల్‌లో 36 మంది చిన్నారులున్నారు.
Also Read: Gaza News: నెతన్యాహుని కాల్చి పారేయాలి, కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు