అన్వేషించండి

Morning Top News: తెలంగాణ మహిళల చేతికి పవర్ స్టీరింగ్, పోర్టు వ్యవహారంలో ఈడీ దూకుడు వంటి మార్నింగ్ టాప్ న్యూస్

Top 10 Headlines Today: అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు, విష్ణుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు మార్నింగ్ టాప్ న్యూస్

 కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ దూకుడు
కాకినాడ పోర్టు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరో అడుగు వేసింది. వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇటీవల పార్లమెంటు సమావేశాలు ఉన్నాయనే కారణంగా ఎంపీ విజయసాయిరెడ్డి, అనారోగ్య కారణాలతో అరబిందో చైర్మన్ శరత్ చంద్రారెడ్డి విచారణకు హాజరు కాలేదు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
బాలికకు పాము కాటు.. రెండు పాములను చంపి..
ఓ చిన్నారికి పాము కరవడంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు, స్థానికులు రెండు పాములను చంపేశారు. మొదట ఓ పామును కొట్టి చంపేశారు. అదే సమయంలో మరో పాము అక్కడికి రావడంతో ఇదే కరిచి ఉండొచ్చునన్న కోపంతో దాన్ని కూడా చంపారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. ఆ పాములతో ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తేల్చిచెప్పడంతో బాలిక తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
మహిళల చేతికి పవర్ స్టీరింగ్
తెలంగాణ ప్రభుత్వం మరో సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొస్తోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన సోలార్ పవర్ విస్తరణ బాధ్యతను మహిళా సంఘాలో చేతిలో పెట్టనుంది. అదే టైంలో కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ బస్‌లను కూడా వారికే ఇవ్వబోతోంది. ఈ రెండు విజయవంతమైతే దేశానికే తెలంగాణ మహిళా సంఘాలు ఆదర్శంకానున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
అల్లు అర్జున్ కు నోటీసులు
అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ( మంగళవారం) తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఆయనను ప్రశ్నించనున్నారు. అల్లు అర్జున్ ఆరోపణల తర్వాత పోలీసులు ఈ కేసును మరింత సీరియస్ గా తీసుకున్నారు. ప్రెస్మీట్ లో అర్జున్ మాట్లాడటం కూడా తప్పేనని..  బెయిల్ పై ఉన్న వ్యక్తి ఇలా కేసు గురించి మాట్లాడకూడదని చెబుతున్నారు. మీడియా ఎదుట కూడా మాట్లాడినందున విచారణకు వెళ్లడమే మంచిదని అల్లు అర్జున్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
స్మగ్లర్ హీరోకు అవార్డులా: మంత్రి సీతక్క
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పుష్ప సినిమాలో ‍స్మగ్లర్‌ను హీరో చేసి పోలీసును విలన్ చేశారు. ఒక స్మగ్లర్‌ పోలీసుల దుస్తులు విప్పి నిలబెడితే జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతం? . ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయి. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలి. జై భీమ్‌ వంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదు’ అని మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
శ్యామ్ బెనెగల్ కన్నుమూత
భారతీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం. ఏడు సార్లు జాతీయ అవార్డు అందుకున్న దిగ్దర్శకుడు శ్యామ్ బెనెగళ్ 90 సంవత్సరాల వయస్సులో కిడ్నీ సంబంధిత సమస్యలతో సోమవారం (డిసెంబర్ 23వ తేదీ) సాయంత్రం 6:30 గంటలకు మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె పియా బెనెగళ్ ధ్రువీకరించారు. సరిగ్గా 90 సంవత్సరాల 9 రోజులు జీవించి ఇక సెలవంటూ ఆయన కన్నుమూశారు. దీంతో ప్రపంచ సినిమా చరిత్రలో వైభవోపేత అధ్యాయం ముగిసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
విష్ణుతో నాకు ప్రాణహాని: మనోజ్
సినీ నటుడు మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే వీరి వివాదంపై పోలీస్ స్టేషన్లలో పలు ఫిర్యాదులు నమోదు అయ్యాయి. తాజాగా విష్ణుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అన్న విష్ణు, ఆయన అనుచరులతో తనకు, తన ఫ్యామిలీకి ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్‌ రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై వివరంగా లేఖ రాసి మనోజ్ పోలీసులకు సమర్పించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
రిజర్వేషన్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల్లో బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్ల సాధనకు న్యాయపరమైన పోరాటం చేయాలని సీఎం చంద్రబాబు  నిర్ణయించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ సూచనలపై సమీక్షలో చర్చించారు. మంత్రుల కమిటీ ప్రాథమికంగా ఇచ్చిన సూచనలను అధికారులు సీఎంకు వివరించగా.. సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఈ చట్టాన్ని తీసుకురావాలని అధికారులకు సూచించారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. 
 
ఎలాంటి అనుమతులు అవసరం లేదు: మంత్రి
భవన నిర్మాణాల అనుమతులపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. నిర్మాణాల కోసం ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని మంత్రి తెలిపారు. దీని కొరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి అనుమతులు పొందవచ్చున్నారు. లేఅవుట్, భవనాలకు సంబంధించి, వీధిదీపాలు, వరద నీరు, ఘనవ్యర్థాల నిర్వాహణ తదితర అంశాల పై 15 రోజుల్లో డీపీఆర్ రూపొందించాలని అధికారులను ఆదేశించాని మంత్రి నారాయణ తెలిపారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో రామ్‌ మాధవ్‌..?బీజేపీ జాతీయ అధ్యక్షుని పదవి మార్చితో ముగుస్తుండడంతో ఇప్పుడు ఆ పదవి ఎవరికి దక్కుతుందన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షునిగా నడ్డా వ్యవహరిస్తుండగా బీజేపీలో సీనియర్‌ నాయకుడు, పైగా దక్షిణాదికి చెందిన నేత అయితే దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి బాగుంటుందని బీజేపీ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ అధినాయకత్వంతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ సానుకూలత కూడా అవసరం  కావడంతో గతంలో బీజేపీ జాతీయ కార్యదర్శిగా పని చేసిన వారణాసి రామ్‌మాధవ్‌ పేరుతో పాటూతెలంగాణాకు చెందిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పేరు కూడా    వినిపిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Kakinada Port Case: కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ, సీఐడీ దూకుడు, వారికి మరోసారి నోటీసులు జారీ
కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ, సీఐడీ దూకుడు, వారికి మరోసారి నోటీసులు జారీ
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Kakinada Port Case: కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ, సీఐడీ దూకుడు, వారికి మరోసారి నోటీసులు జారీ
కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ, సీఐడీ దూకుడు, వారికి మరోసారి నోటీసులు జారీ
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
TollyWood: ఫిల్మ్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకెళ్లేందుకు పవన్ ప్రయత్నాలు - ఎంత వరకు సక్సెస్ అవుతాయి ?
ఫిల్మ్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకెళ్లేందుకు పవన్ ప్రయత్నాలు - ఎంత వరకు సక్సెస్ అవుతాయి ?
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
AP Rains Update: ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
Embed widget