అన్వేషించండి

Kakinada Port Case: కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ, సీఐడీ దూకుడు, వారికి మరోసారి నోటీసులు జారీ

Andhra Pradesh News | వైసీపీ హయాంలో కేవీ రావును బెదిరించి కాకినాడ పోర్టు హక్కులను బలవంతంగా లాక్కున్నారని ఫిర్యాదుతో పాటు నగదు సేకరణపై దర్యాప్తు సంస్థలు ఈడీ, సీఐడీ దూకుడు పెంచాయి.

ED Probe On Kakinada Port Issue | అమరావతి: కాకినాడ పోర్టు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇటీవల పార్లమెంటు సమావేశాలు ఉన్నాయనే కారణంగా ఎంపీ విజయసాయిరెడ్డి, అనారోగ్య కారణాలతో అరబిందో చైర్మన్ శరత్ చంద్రారెడ్డి విచారణకు హాజరు కాలేదు. 

మరోసారి ఈడీ నోటీసులు
ఈ కేసులో ఎంపీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఇప్పటికే విచారణకు హాజరు కాగా, విచారణకు రావాలని విక్రాంత్ రెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రూ. 494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు అరబిందో ఆ డబ్బులు ఎలా సమకూర్చింది, ఎవరిచ్చారు అనేదానిపైనే విచారణ కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లో రూ.3600 కోట్ల విలువైన వాటాలను కేవీ రావు నుంచి తీసుకున్నారు. అయితే తననుంచి బలవంతంగా లాగేసుకున్నారని కేవీ రావు కూటమి ప్రభుత్వం వచ్చాక ఫిర్యాదు చేశారు. పోర్టు వ్యవహారంలో  ఆరో ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ కు చెల్లించిన రూ.494 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. 

కాకినాడ పోర్ట్ వ్యవహారంలో ఒక్క పైసా తీసుకోవడానికి కూడా అనుమతించబోమని అరవిందో సంస్థకు ఏపీ సిఐడి లేఖ రాసింది. డివిడెండ్లు తీసుకున్నా చర్యలు తప్పవని సీఐడీ హెచ్చరించింది. వేరొకరి నంచి లాక్కోవడమే అక్రమం అవుతుందని, దాని నుంచి లాభాలు పొందడం కూడా నేరమే అని స్పష్టం చేసింది. నాలుగేళ్ల వ్యవధిలో రూ.102 కోట్లు తీసుకున్నారని, ఇక ఆపేయండంటూ అధికారులు స్పష్టం చేశారు. అరబిందో డైరెక్టర్లను విచారించేందుకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. అరబిందో చైర్మన్ శరత్ చంద్రారెడ్డి నేడు సీఐడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. విచారణకు సంబంధించి ఇప్పటికే అరవిందో సంస్థకు ఏపీ సిఐడి లేఖ రాసింది. 

చిక్కుల్లో అరబిందో సంస్థ

గత ప్రభుత్వ అండదండలతో ఆనాడు అక్రమాలకు పాల్పడిన అరబిందో సంస్థ చిక్కుల్లో పడిందన్నారు ఏపీ సీఐడీ చీఫ్. కాకినాడ పోర్టును వ్యాపారవేత్త కేవీ రావు నుంచి అరబిందో తీసుకున్న కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. అరబిందో డైరెక్టర్లు, ఆరో ఇన్‌ఫ్రా సంస్థకు సీఐడీ లేఖలు రాసింది. బెదిరింపులకు పాల్పడి 2021లో కేవీ రావు నుంచి 41.12 శాతం వాటాలు లాక్కున్నారని, దానిపై వచ్చిన లాభాలు, డివిడెండ్లు పంచుకోవడానికి వీల్లేదని హెచ్చరించింది. లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ఆ లేఖలో స్పష్టం చేశారు. 

మీతో ఆధారాలుంటే ఇవ్వండి, చట్టప్రకారం చర్యలు

‘నాలుగేళ్లలో డివిడెంట్‌ కింద రూ.102కోట్లు తీసుకున్నారు. కేవీ రావు నుంచి యాజమాన్య హక్కులు లాక్కోవడంపై విచారణ జరుపుతున్నాం. దీనికి సంబంధించి అన్ని నిబంధనలు ఉల్లంఘించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారంపై విచారణ జరుపుతున్నాం. పూర్తి హక్కులున్న కేవీ రావును బెదిరించినట్లు ఆయన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నాం. మీరు ఒక్క అడుగు ముందుకేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించాం. కాకినాడ పోర్టుపై పూర్తి హక్కులు తనకే ఉన్నట్లు కేవీ రావు ఆధారాలు సమర్పించారు. మీతో ఆధారాలు ఉంటే సమర్పించండి. దీనిపై న్యాయబద్ధంగా విచారణ చేస్తాం. బాధితుడిగా ఉన్న కేవీరావు హక్కులను కాపాడాల్సిన తమపై ఉందిని’ సిఐడి చీఫ్ లేఖలో తెలిపారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
IPL 2025 PBKS VS RCB Result Update:  పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి 3వ ఓటమి
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్Klassen's glove error Rickelton Not out | IPL 2025 MI vs SRH మ్యాచ్ లో అరుదైన రీతిలో రికెల్టన్ నాట్ అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
IPL 2025 PBKS VS RCB Result Update:  పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి 3వ ఓటమి
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Weather Hyderabad: ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత-  హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌  
ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత- హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌
Lowest scores in IPL:ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
Tata Advanced Systems Limited:  టాటాలో ఉద్యోగాలు.డైరక్ట్ వాక్ ఇన్ …  ఎప్పుడు.. ఎక్కడంటే.. ?
టాటాలో ఉద్యోగాలు.డైరక్ట్ వాక్ ఇన్ … ఎప్పుడు.. ఎక్కడంటే.. ?
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
Embed widget