అన్వేషించండి

Viral News: బాలికకు పాము కాటు, ఏది కరిచిందో తెలియక రెండు పాములను చంపి ఆసుపత్రికి!

Telangana News | బాలికను ఆటుకుంటుండగా ఓ పాము కాటేసింది. ఆ సమయంలో రెండు పాములు కనిపించడంతో వాటిని చంపిన కుటుంబం ఆస్పత్రికి తీసుకెళ్లి డాక్టర్ కు చూపించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన జరిగింది.

Snake Bite in Nagarkurnool District | నాగర్‌కర్నూలు: ఓ చిన్నారికి పాము కరిచింది. దాంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు, స్థానికులు రెండు పాములను చంపేశారు. మొదట ఓ పామును కొట్టి చంపేశారు. అదే సమయంలో మరో పాము అక్కడికి రావడంతో ఇదే కరిచి ఉండొచ్చునన్న కోపంతో దాన్ని కూడా చంపారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. 

అసలేం జరిగిందదంటే..
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం కంసాన్ పల్లిలో తొమ్మిదేళ్ల బాలిక ఆడుకుంటుండగా ఓ పాము కరిచింది. పాము కరవడంతో అపస్మారక స్థితికి వెళ్లిన బాలికను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆ పరిసర ప్రాంతాల్లో వెతకగా ఓ పాము కనిపించడంతో స్థానికులు దాన్ని కొట్టి చంపేశారు. అనూహ్యంగా అక్కడికి మరో పాము రావడంతో ఏ పాము కరిచిందో తెలియక దాన్ని కూడా చంపేశారు. అనంతరం  రెండు పాములను బాలిక కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

స్నేక్ క్యాచర్‌ను పిలిచిన డాక్టర్లు

బాలికను పాము కరిచిన చోట రెండు పాములు కనిపించడంతో స్థానికుల సాయంతో వాటిని చంపినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఏ పాము కరిచిందో తెలయదు కనుక వాటిని హాస్పిటల్‌కు తీసుకెళ్లి డాక్టర్లకు చూపించామన్నారు. అవి పరిశీలిస్తే చికిత్స అందించడం తేలిక అవుతుందని భావించినట్లు బాలిక కుటుంబం తెలిపింది. డాక్టర్లు స్నేక్ క్యాచర్ సుమన్‌కు దీనిపై సమాచార ఇచ్చారు. అనంతరం హాస్పిటల్‌కు వచ్చిన స్నేక్ క్యాచర్ రెండు పాములను పరిశీలించాడు. ఆ పాములతో ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చిచెప్పడంతో బాలిక తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిపోయారు.

Also Read: Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ 

చిన్నారులు ఆడుకునే సమయంలో పాము కాటుకు గురవడం తరచుగా వింటూనే ఉంటాం. అయితే తమ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఏమైనా ప్రమాదకర ప్రాణాలు ఉన్నాయా అని జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. పెద్దలకు సైతం కొన్నిసార్లు పాములు కరుస్తుంటాయి. అయితే విషం శరీరానికి పాకకుండా ఆ భాగానికి తాడు లాంటికి కట్టి, ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి. ఎంత త్వరగా హాస్పిటల్ తీసుకెళ్తే ప్రాణాలు దక్కడానికి అవకాశాలు అంత మెరుగవుతాయి. ఇంట్లో పెద్దవాళ్లు ఏం అంటారో అని భయపడి చెప్పకపోవడం వల్ల సైతం చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరిగాయి. కనుక తల్లిదండ్రులు పిల్లల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
AP Rains Update: ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
AP Rains Update: ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget