Telangana News: మహిళల చేతికి పవర్ స్టీరింగ్- సరికొత్త ఆలోచన చేస్తున్న తెలంగాణ సర్కారు
Solar Plants For DWCRA : మహిళా సంఘాలకు ఉపాధి మార్గాలు కల్పించి వారిని మరింత శక్తమంతంగా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వారికి సోలార్ ప్రాజెక్టులు అందజేయనుంది.
Electric Buses And Solar Plants for DWCRA Groups: తెలంగాణ ప్రభుత్వం మరో సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొస్తోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన సోలార్ పవర్ విస్తరణ బాధ్యతను మహిళా సంఘాలో చేతిలో పెట్టనుంది. అదే టైంలో కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ బస్‌లను కూడా వారికే ఇవ్వబోతోంది. ఈ రెండు విజయవంతమైతే దేశానికే తెలంగాణ మహిళా సంఘాలు ఆదర్శంకానున్నాయి.
తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీటింగ్‌లో ప్రభుత్వం చేపట్టే బోయే పథకాల అమలు విధానంపై అధికారులతో చర్చించారు. తెలంగాణ వ్యాప్తంగా 231 ఎకాల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుకు సిద్ధమైనట్టు వివరించారు. వీటి బాధ్యతను మహిళా సంఘాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
Also Read: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
మహిళాశక్తి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎస్ సోలార్ ప్లాంట్లు, ఎలక్ట్రిక్ బస్‌లపై ఆదేశాలు జారీ చేశారు. మహిళా సంఘాల ద్వారానే 231 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రయోగాత్మకంగా ఐదు జిల్లాల్లోని మహిళా సంఘాలకు ఇందుకు సిద్ధం చేయాలన్నారు. ఆరు నెలల్లోనే 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వినియోగంలో లేని ఎండోమెంట్ భూములు వారికి కౌలుకు ఇచ్చి అక్కడే ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
మరోవైపు 150 ఎలక్ట్రిక్ బస్సులు మహిళా సంఘాలు కొనేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. వాటి నిర్వహణ బాధ్యత తెలంగాణ ఆర్టీసీ చూసుకుటుందన్నారు. దీనికి కూడా ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆసక్తి ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించాలన్నారు.
Also Read: 'స్మగ్లర్ హీరో అంటే అదేం సినిమా?' - పుష్ప 2 సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు డీజిల్‌తో నడుస్తున్న బస్‌ల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే తిరుగుతాయని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ముందుగా హైదరాబాద్‌లో డీజిల్ బస్‌లు తిరగకుండా చేయాలని చూస్తున్నారు. అన్ని ఎలక్ట్రిక్ బస్‌లు నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్న రూట్‌లలో ఎలక్ట్రిక్ బస్‌లు తిరుగుతున్నాయి.
ఆటోలు, ఇతర డీజిల్ వాహనాలను తగ్గిస్తామన్నారు. సమీప భవిష్యత్‌లో హైదరాబాద్‌లో డీజిల్ వాహనాలే ఉండబోవని ప్రకటించారు. ఇలాంటి సంస్కరణలు తీసుకురావాలంటే ప్రభుత్వమే ఎలక్ట్రిక్ వాహనాలు కొనడం బడ్జెట్‌కు మించిన భారం అవుతుంది. అందుకే ఇందులో ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇంందులో భాగంగానే మహిళలకు ముందుగా ఆ అవకాశం ఇవ్వబోతోంది. అది విజయవంతం అయితే మిగతా వారికి ఈ ఛాన్స్ ఇస్తారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం అయితే మాత్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.