అన్వేషించండి

Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!

Unni Mukundan Marco: ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన 'మార్కో' డిసెంబర్ 20న విడుదలైంది. మలయాళంతో పాటు తెలుగులో విడుదలైన ఆ సినిమాకు కలెక్షన్స్ బావున్నాయి. 'పుష్ప 2'తో ఆ సినిమాకు ఒక కనెక్షన్ ఉందని తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన మలయాళ హీరోలలో ఉన్ని ముకుందన్ ఒకరు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాలో మోహన్ లాల్ కుమారుడిగా నటించారు. అనుష్క 'భాగమతి'లో ఐఏఎస్ అధికారి చెంచల ప్రేమికుడిగా కనిపించారు. ఆయన హీరోగా నటించిన తాజా మలయాళ సినిమా 'మార్కో'.‌ డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది.
ఉన్ని ముకుందన్ 'మార్కో' సినిమాకు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాకు ఒక కామన్ కనెక్షన్ ఉంది. అదేమిటో తెలుసా?

ఆ రెండు ఫైట్స్... సేమ్ టు సేమ్...
హీరోలు ఇద్దరు అలా కొరికేశారేంటి?
'పుష్ప ది రూల్' సినిమా ప్రీ క్లైమాక్స్ ఫైట్ అల్లు అర్జున్ అభిమానులకు మాత్రమే కాదు ఆడియన్స్ అందరికీ ఒక 'హై' ఇచ్చింది. అన్నయ్య కుమార్తెను కాపాడే సమయంలో హీరో చేసే ఫైట్ మామూలుగా లేదు అసలు. థియేటర్లలో జనాలకు పూనకాలు తెప్పించింది. ముఖ్యంగా మెడలో కపాలం పడిన తర్వాత బన్నీని చూస్తే ప్రాణాలు తీసే కాల యముడిగా కనిపించాడనే కామెంట్లు కూడా వినిపించాయి. ఆ ఫైట్ చూస్తే... అందులో హీరో రెండు చేతులు కాళ్లు కట్టేస్తారు.‌ అయినా సరే గాల్లో ఎగురుతూ వెళ్లి రౌడీ మూకల పీకలు కొరుకుతాడు.

'మార్కో' విషయానికి వస్తే... ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ఫైట్ ఒకటి మన తెలుగు ప్రేక్షకులకు 'పుష్ప ది రూల్' క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్‌ను గుర్తు చేస్తుంది. 'పుష్ప 2'ను రూరల్ యాక్షన్ సినిమాగా తీస్తే... 'మార్కో'ను స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అన్నట్టు తీశారు. ఈ రెండు సినిమాల బ్యాక్ డ్రాప్స్ వేరు. అయితే, 'మార్కో' ఇంటర్వెల్ ఫైట్‌లో కూడా హీరో చేతులు రెండు వెనక్కి కట్టేస్తారు. అప్పుడు గాల్లో ఎగురుతూ వెళ్లి విలన్ గ్యాంగ్ లో ఒకరి చెవిని కొరికేస్తారు. అక్కడ ప్రేక్షకులకు వచ్చే 'హై' మాత్రమే సేమ్ టు సేమ్ 'పుష్ప 2' ఇచ్చిన 'హై'. 

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న థియేటర్లు
'మార్కో' చిత్రాన్ని క్యూబ్ ఎంటర్టైన్మెంట్ పథకం మీద షరీఫ్ మహమ్మద్ ప్రొడ్యూస్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మలయాళ, హిందీ వెర్షన్స్ విడుదల చేశారు. ఏపీ, తెలంగాణలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 'మార్కో' హిందీ వెర్షన్‌కు వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకుని 'జినీవర్స్' అధినేత బల్వంత్ సింగ్ మరిన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.‌

Also Read: టాలీవుడ్ మీద 'పుష్ప 2' ఎఫెక్ట్... ఇకపై బెనిఫిట్ షోలు ల్లేవ్ - టికెట్ రేట్లూ పెరగవ్

'జినీవర్స్' అధినేత బల్వంత్ సింగ్ మాట్లాడుతూ... ''తెలుగు చిత్రసీమ నుంచి వచ్చిన 'బాహుబలి', తాజా 'పుష్ప 2' - అలాగే కన్నడ చిత్రసీమ నుంచి వచ్చిన 'కాంతార', 'కేజిఎఫ్' గురించి దేశవ్యాప్తంగా ఎలా అయితే మాట్లాడుకుంటున్నారో... అదే విధంగా మలయాళ చిత్రసీమ నుంచి వచ్చిన తాజా సినిమా 'మార్కో' గురించి కూడా మాట్లాడుకుంటారని కచ్చితంగా చెప్పగలను. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఆదరణ లభించడంతో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర 'మార్కో' హిందీ వర్షన్ ప్రభంజనం సృష్టిస్తోంది. అందుకే మంగళవారం నుంచి మరిన్ని థియేటర్లు పెంచుతున్నాం. తెలుగు ప్రేక్షకులకు ఉన్ని ముకుందన్ తెలుసు కనుక థియేటర్లకు జనాలు ఎక్కువ మంది వస్తున్నారు'' అని అన్నారు.

Also Read: సలార్ డిజప్పాయింట్ చేసింది... 'సలార్ 2'లో నేనేంటో చూపిస్తా - ప్రశాంత్ నీల్

టాప్ హెడ్ లైన్స్

Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?

వీడియోలు

Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget