Salaar 2 : సలార్ డిజప్పాయింట్ చేసింది... 'సలార్ 2'లో నేనేంటో చూపిస్తా - ప్రశాంత్ నీల్
Prashanth Neel On Salaar 2: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ బాక్సాఫీస్ బరిలో 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. బాక్సాఫీస్ రిజల్ట్ దర్శకుడిని డిజప్పాయింట్ చేసిందట.
Salaar 2 Shouryanga Parvam : దర్శక ధీరడు ఎస్ఎస్ రాజమౌళి తర్వాత పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలు అందుకున్న దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే... ప్రశాంత్ నీల్ అని చెప్పాలి. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వం వహించిన 'సలార్ పార్ట్ 1' బాక్సాఫీస్ దగ్గర 650 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అయినా సరే దర్శకుడికి సంతోషం లేదు అంటే మీరు నమ్ముతారా!?
సలార్ డిజప్పాయింట్ చేసింది - ప్రశాంత్ నీల్
సలార్ సినిమాకు థియేటర్ల నుంచి వచ్చిన స్పందన గాని, బాక్సాఫీస్ రిజల్ట్ గాని తనను నిరాశకు గురి చేసింది అనే విధంగా తాజా ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ వ్యాఖ్యానించారు. 'కేజిఎఫ్ చాప్టర్ 2' విడుదలైన తర్వాత సలార్ రైటింగ్ మీద తాను ఎంతో కాన్సన్ట్రేషన్ చేశానని, అయితే రిజల్ట్ తనను కాస్త డిజప్పాయింట్ చేసిందని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. అయితే సలార్ సీక్వెల్ విషయంలో తానేంటో చూపిస్తానని ఆయన తెలిపారు.
సలార్ 2... నా బెస్ట్ వర్క్... అందులో నో డౌట్!
'సలార్' విడుదలైన తర్వాత ఫిలిం నగర్ వర్గాలలో పలు పుకార్లు వినిపించాయి. రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ మధ్య సత్సంబంధాలు లేవని సీక్వెల్ వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ అని పుకార్ల షికారు చేశాయి. వాటన్నిటికీ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిలిమ్స్ ఆ మధ్య చెక్ పెట్టింది. 'సలార్ 2'తో పాటు ప్రభాస్ హీరోగా మరో రెండు సినిమాలు చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా సలార్ సీక్వెల్ కన్ఫర్మ్ చేశారు.
ఇప్పటి వరకు తాను రాసిన సినిమాలలో 'సలార్ 2' బెస్ట్ వర్క్ అని ప్రశాంత్ నీల్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. తన జీవితంలో కొన్ని విషయాలలో తాను సూపర్ కాన్ఫిడెంట్ గా ఉంటానని, అటువంటి కాన్ఫిడెన్స్ 'సలార్ 2' మీద తనకు ఉంది అని ఆయన స్పష్టంగా చెప్పారు. సో... సలార్ సీక్వెల్ రైటింగ్ వర్క్ కంప్లీట్ అయింది అన్నమాట.
ప్రభాస్ అభిమానులలో మాత్రమే కాదు... ప్రేక్షకులలో కూడా 'సలార్ 2' మీద అంచనాలు పెంచేశారు ప్రశాంత్ నీల్. ''ఇప్పుడు ప్రేక్షకులు ఊహించుకున్న దానికంటే మించి 'సలార్ 2' ఉంటుంది. నా ఊహకు మించి ఆ సినిమాను తీస్తాను'' అని ప్రశాంత్ నీల్ చెప్పారు.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న 'ది రాజా సాబ్', హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న 'ఫౌజీ' షూటింగ్స్ చేస్తున్నారు. ఇటీవల ఆయనకు గాయం కావడంతో చిత్రీకరణలకు కాస్త విశ్రాంతి ఇచ్చారు. ఆ రెండు సినిమాలు పూర్తి అయ్యాక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 'స్పిరిట్', ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్ 2' స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ సినిమా కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభాస్ మీద ఉంది.
Also Read : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్!