Telecommunications Bill 2023: లోక్‌సభలో టెలీకమ్యూనికేషన్స్ బిల్, నెట్‌వర్క్‌ని అధీనంలోకి తీసుకునేలా ప్రొవిజన్
Telecommunications Bill 2023: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో టెలీకమ్యూనికేషన్స్ బిల్ 2023ని ప్రవేశపెట్టింది.
Telecommunications Bill Provisions:
టెలీకమ్యూనికేషన్స్ బిల్ 2023
కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో మరో కీలక బిల్‌ని ప్రవేశపెట్టింది. అదే Telecommunications Bill 2023. దాదాపు 138 ఏళ్లుగా దేశ టెలీకమ్యూనికేషన్ సెక్టార్ Indian Telegraph Act కింద ఉండేది. ఇప్పుడీ పాత చట్టాన్ని పక్కన పెట్టి టెలీకమ్యూనికేషన్స్ బిల్‌ని తీసుకొచ్చింది. టెలీకమ్యూనికేషన్స్ ఇండస్ట్రీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా బిల్‌ని రూపొందించింది. ఈ ఏడాది ఆగస్టులోనే కేబినెట్ ఈ బిల్‌కి ఆమోదం తెలిపింది. అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లుపై బ్రీఫింగ్ ఇచ్చారు. టెలీకమ్యూనికేషన్స్ సెక్టార్‌కి సంబంధించిన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లో సంస్కరణలు చేపట్టింది కేంద్రం. ఈ ముసాయిదా బిల్లులో OTT సర్వీస్‌లతో పాటు ఇంటర్నెట్ ఆధారిత మెసేజింగ్, కాలింగ్ యాప్స్‌పై నిఘా మరింత పెరగనుంది. టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్స్‌ని అందిపుచ్చుకోవడంతో పాటు భద్రత ముఖ్యమే అని తేల్చి చెబుతోంది ఈ బిల్లు. అయితే...Telecom Regulatory Authority of India (TRAI)పై అధికారాలపై కేంద్రం కొన్ని ఆంక్షల్ని ప్రతిపాదించింది. దీనిపైనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కానీ...వీటిపై అధికారులతో చర్చించి కొలిక్కి తీసుకొచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకూ ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తూనే అవసరమైన చోట కఠిన ఆంక్షలు విధించేలా బిల్లులో కీలక ప్రొవిజన్స్‌ని చేర్చింది కేంద్ర ప్రభుత్వం.
కేంద్రం అధీనంలోకి..
ఈ బిల్లులో మరో కీలకమైన విషయం ఏంటంటే...ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం టెలీకమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ని తాత్కాలికంగా తమ అధీనంలోకి తీసుకోవచ్చు. టెలీకమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనల మధ్యే బిల్లులోని కీలక ప్రొవిజన్స్‌ని ప్రస్తావించారు. పబ్లిక్ ఎమర్జెన్సీ, విపత్తు నిర్వహణ, ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి టెలీకమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ని అధీనంలోకి తీసుకునే అధికారం ఉంటుంది.
Also Read: Jhatka Meat: హిందువులెవరూ హలాల్ మాంసాన్ని తినొద్దు, ధర్మాన్ని కల్తీ చేయొద్దు - కేంద్రమంత్రి