Jhatka Meat: హిందువులెవరూ హలాల్ మాంసాన్ని తినొద్దు, ధర్మాన్ని కల్తీ చేయొద్దు - కేంద్రమంత్రి
Halal Ban: హిందువులెవరూ హలాల్ మాంసాన్ని తినకూడదంటూ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Jhatka Meat:
గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు..
హలాల్‌పై నిషేధం (Ban on Halal) విధించాలన్న డిమాండ్ పెరుగుతున్న క్రమంలోనే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ (Giriraj Singh) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులెవరూ హలాల్ మాంసాన్ని తినకూడదని తేల్చి చెప్పారు. అందుకు బదులుగా Jhatka మాంసాన్ని మాత్రమే తినాలని అన్నారు. ఝట్కా (Jhatka Meat) అంటే బలి ఇచ్చిన జంతువు మాంసం. బిహార్‌లోని బేగుసరై నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు గిరిరాజ్ సింగ్. హిందూ సంస్కృతిని, సంప్రదాయాలను అందరూ కాపాడుకోవాలని...ఆహారపు అలవాట్లనూ కొనసాగించాలని సూచించారు. హలాల్ మాంసం తినకూడదంటూ అందరితోనూ ప్రతిజ్ఞ చేయించారు.
"ముస్లింలు హలాల్ మాంసం మాత్రమే తింటారు. ఈ విషయంలో వాళ్లు చాలా కచ్చితంగా ఉంటారు. ఆచారాన్ని వదులుకోని వాళ్లను చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇదే విధంగా హిందువులు కూడా తమ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలి. వాటిని పాటించాలి. హిందువులకు సంబంధించినంత వరకూ బలి ఇచ్చిన జంతువు మాంసాన్ని మాత్రమే తినాలి. ఒక్కవేటుతోనే చంపిన జంతువు మాంసాన్ని మాత్రమే తినాలి. హలాల్ మాంసాన్ని తిని అనవసరంగా తమను తాము కల్తీ చేసుకోవద్దు"
- గిరిరాజ్ సింగ్, కేంద్రమంత్రి
స్పెషల్ స్టాల్స్ పెట్టాలి..
అంతే కాదు. ప్రతి చోటా ఝట్కా మాంసాన్ని విక్రయించేందుకు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ వ్యాపారాన్ని విస్తృతం చేయాలని అన్నారు. కొన్ని వారాల క్రితం..గిరిరాజ్ సింగ్ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కి లేఖ రాశారు. యూపీలో హలాల్ ఉత్పత్తులపై నిషేధం విధించడాన్ని ప్రస్తావించారు. బిహార్‌లోనూ ఇదే నిబంధన అమలు చేయాలని కోరారు. హిందువులందరూ పని నుంచి వచ్చాక అయినా సరే సాయంత్రం కాస్త వీలు చేసుకుని ఆలయానికి వెళ్లాలని సూచించారు. సనాతన ధర్మానికి మించిన ధర్మం ఎక్కడా లేదని స్పష్టం చేశారు.
అమిత్‌షా క్లారిటీ..
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. హలాల్‌ని కేంద్రం (Halal Ban) నిషేధిస్తుందన్న వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్న క్రమంలోనే ఓ క్లారిటీ ఇచ్చారు. హలాల్‌ని నిషేధం విధించే విషయంలో ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్‌ని (Halal Certified Products)విక్రయించకుండా బ్యాన్ చేయాలన్న డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి. కానీ అమిత్‌షా మాత్రం ప్రస్తుతానికి ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఇప్పటికే యూపీలో హలాల్ ఉత్పత్తులపై నిషేధం విధించారు. నవంబర్ 19న ఈ నిర్ణయం (Halal Ban in UP) తీసుకుంది. హలాల్ ట్యాగ్ ఉన్న ప్రొడక్ట్స్‌ని మార్కెట్‌లో విక్రయించేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. తక్షణమే ఈ నిబంధనల అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అయితే...ఎగుమతుల కోసం తయారు చేసిన హలాల్ ఉత్పత్తులకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు. హలాల్ ట్యాగ్ ఉన్న మెడిసిన్స్, మెడికల్ డివైస్‌లు, కాస్మెటిక్స్ ఏవైనా రాష్ట్రవ్యాప్తంగా విక్రయించడానికి వీలుండదని అధికారులు స్పష్టం చేశారు.
Also Read: Dawood Ibrahim Poisoned: దావూద్ ఇబ్రహీంని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మార్చిన కేసులు ఇవే