Dawood Ibrahim Poisoned: దావూద్ ఇబ్రహీంని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మార్చిన కేసులు ఇవే
Dawood Ibrahim Cases: దావూద్ ఇబ్రహీంపై ఉన్న 5 కేసులు అతడిని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మార్చింది.
Dawood Ibrahim Hospitalised:
గ్లోబల్ టెర్రరిస్ట్ దావూద్..
మోస్ట్ వాంటెడ్ అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం (Dawood Ibrahim Poisoned) జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్‌లోని కరాచీలోని ఓ ఆసుపత్రిలో భారీ భద్రత మధ్య ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దశాబ్జాలుగా ఎవరికీ కనిపించకుండానే మాఫియాని రన్ చేస్తున్నాడు దావూద్. భారత్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు దావూద్‌ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్ట్‌లో (Most Wanted Terrorist Dawood Ibrahim) పెట్టింది. ముఖ్యంగా భారత్, అమెరికా దావూద్ ఇబ్రహీంని Global Terroristగా ప్రకటించాయి. ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ లిస్ట్‌లోనూ దావూద్ పేరు ఉంది. అంతే కాదు. అతడి తలపై 25 మిలియన్ అమెరికన్ డాలర్ల రివార్డ్ కూడా ఉంది. దావూద్‌కి పాకిస్థాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ISIతోపాటు లష్కరే తోయిబాతో సన్నిహిత సంబంధాలున్నాయి. రకరకాల పేర్లు, ఫేక్ పాస్‌పోర్ట్‌లతో దేశాలు తిరుగుతూ ఉంటాడు దావూద్. ప్రస్తుతానికి పాకిస్థాన్‌లోని కరాచీలో ఉంటున్నట్టు తెలుస్తోంది. చరిత్రలో జరిగిన ఎన్నో మారణహోమాలకు మాస్టర్‌మైండ్ దావూదే. వీటిలో 1993లో జరిగిన ముంబయి దాడులు అత్యంత దారుణమైనవి. అక్కడితో మొదలైన ఈ రక్తపాతం కొనసాగుతూ వచ్చింది. ఆ తరవాత ఇదే ముంబయిపై 2008లోనూ దాడులు (Mumbai Attacks 2008) చేయించాడు దావూద్. 2010లో పుణెలో జర్మన్ బేకరీ బ్లాస్ట్ సంచలనం సృష్టించింది. తరవాత 2013లో IPL స్పాట్ ఫిక్సింగ్ స్కామ్ కూడా కలకలం రేపింది. ఇవొక్కటే కాదు. ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికింగ్,ఆయుధాల స్మగ్లింగ్ కూడా చేశాడు. కానీ...ఓ ఐదు కేసులు (Dawood Ibrahim Cases) మాత్రం అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా మార్చింది.
1993 ముంబయి దాడులు..
1993లో జరిగిన ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి దావూద్ ఇబ్రహీం. ఈ ఘటనలో 257 మంది ప్రాణాలు కోల్పోయారు. 700 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. పాకిస్థాన్‌కి చెందిన లష్కరే తోయిబాతో చేతులు కలిపి ఈ అటాక్స్‌కి ప్లాన్ చేశాడు దావూద్. ఉగ్రవాదులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సప్లై చేశాడు. ముంబయిలో 12 చోట్ల ఒకేసారి దాడులు చేయించాడు. ఈ దాడుల తరవాత పాకిస్థాన్‌తో భారత్‌కి ఉన్న వైరం మరింత పెరిగింది.
2008 ముంబయి దాడులు..
2008లోనూ మరోసారి ముంబయిలో ఉగ్రదాడులు జరిగాయి. ఆ సమయంలో 166 మంది బలి అయ్యారు. లష్కరే తోయిబాకి చెందిన 10 మంది ఉగ్రవాదులు ఈ అరాచకానికి పాల్పడ్డారు. ఈ దాడుల వెనక కూడా సూత్రధారి దావూద్ ఇబ్రీహీం. సముద్ర మార్గం ద్వారా ముంబయిలోకి అడుగు పెట్టి విచక్షణారహితంగా దాడులు చేశారు.
2010 పుణే జర్మన్ బేకరీ బ్లాస్ట్
2010లో పుణేలోని జర్మన్ బేకరీ బ్లాస్ట్ సంచలనం సృష్టించింది. ఈ దాడులనూ దావూద్ ఇబ్రహీం చేయించాడు. ఈ దాడుల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారు. పుణేలో జర్మన్ బేకరీ చాలా ఫేమస్. రద్దీ ఎక్కువగా ఉంటుంది. విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. దావూద్ ఇబ్రహీంతో లింక్స్ ఉన్న ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడినట్టు ప్రకటించింది.
2013 IPL స్పాట్ ఫిక్సింగ్ స్కామ్..
2013లో వెలుగులోకి వచ్చిన IPL స్పాట్ ఫిక్సింగ్ స్కామ్‌లోనూ దావూద్ ఇబ్రహీం హస్తం ఉంది. ఇండియన్ క్రికెట్‌లో అలజడి సృష్టించింది ఈ స్కాండల్. ఓవర్ల వారీగా ఎన్ని రన్లు కొట్టాలో ముందే ఫిక్స్ చేశారు. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ టీమ్స్‌లోని కొందరు ప్లేయర్స్ ఈ ఫిక్సింగ్‌కి పాల్పడ్డారు. దావూద్‌తో పాటు అతని రైట్ హ్యాండ్ చోటా షకీల్ హస్తం కూడా ఈ స్కామ్‌లో ఉంది.