Nobel Prize 2022 Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
Nobel Prize 2022 Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది.
Nobel Prize 2022 Chemistry: రసాయన శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది. 'ఇంజినీరింగ్ టూల్స్ ఫర్ మాలుక్యూల్స్ బిల్డింగ్స్' పరిశోధనలకు గానూ రసాయన శాస్త్రంలో కారోలిన్ బెర్టోజి, మార్టిన్ మెల్డల్, బారీ షార్ప్‌లెస్‌లను ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. ఈ మేరకు నోబెల్ కమిటీ ప్రకటించింది.
భౌతిక శాస్త్రంలో
2022 సంవత్సరానికి భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా నోబెల్ బహుమతి వచ్చింది. భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసిన అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోన్ జైలింగర్‌లకు ఈ పురస్కారం దక్కింది. స్టాక్‌హోంలోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును ప్రకటించింది.
వైద్య రంగంలో
వైద్య రంగంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వరించింది. మానవ పరిణామంపై ఆయన చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు దక్కించుకున్నారు. ఈ మేరకు నోబెల్ కమిటీ సెక్రెటరీ థామస్ పెర్ల్మన్.. నోబెల్ విజేత పేరును ప్రకటించారు.
మానవులకు అత్యంత సమీప జాతిగా భావించే నియాండెర్తల్స్, డెనిసోవాన్స్ జీవుల జన్యువులు, ఆధునిక మానవుల జన్యువులను పోల్చుతూ చేసిన పరిశోధనకు పాబో నాయకత్వం వహించారు. రెండు జాతుల మధ్య కలయిక జరిగిందన్న విషయాన్ని ఈ పరిశోధన స్పష్టం చేసింది.
గురువారం సాహిత్య రంగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు. శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబర్ 10న ఆర్థిక రంగంలో నోబెల్ విజేత పేరును వెల్లడిస్తారు.
డిసెంబర్‌లో
నోబెల్ బహుమతి గ్రహీతలకు 10 లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.
Also Read: RSS chief: 'ఓ జనాభా విధానం ఉండాల్సిందే'- RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు!
Also Read: JK Encounter: జమ్ముకశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు- నలుగురు ఉగ్రవాదులు హతం