RSS chief: 'ఓ జనాభా విధానం ఉండాల్సిందే'- RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు!
RSS chief: దేశంలో అన్ని వర్గాల ప్రజలకు వర్తించేలా ఓ సమగ్ర జనాభా విధానాన్ని రూపొందించాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
RSS chief: నాగ్‌పుర్‌లో ఏర్పాటు చేసిన దసరా ర్యాలీలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. వర్గాల-ఆధారిత జనాభా అసమానత ఓ ప్రధాన అంశమని ఈ సందర్భంగా భగవత్ అన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదన్నారు.
చైనాను చూశారా?
జనాభా నియంత్రణపై కూడా మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ వల్ల చైనా పరిస్థితి ఎలా తయారైందో చూడాలన్నారు.
అయితే జనాభాకు అనుగుణంగా వనరులను పెంచుకోవాల్సిన అవసరాన్ని ఉందని భగవత్ అన్నారు.
నాన్‌వెజ్‌పై
ఆహారపు అలవాట్లపై మోహన్ భగవత్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. "తప్పుడు ఆహారం తీసుకుంటే తప్పుడు ఆలోచనలే వస్తాయి" అని వ్యాఖ్యానించారు. మాంసాహారం తీసుకునే వాళ్ల గురించి ఇలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు మోహన్ భగవత్. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థైన భారత్ వికాస్ మార్చ్ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన భగవత్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గురించి ప్రస్తావిస్తూ.. ఈ కామెంట్స్ చేశారు.
Also Read: JK Encounter: జమ్ముకశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు- నలుగురు ఉగ్రవాదులు హతం
Also Read: Elon Musk Twitter Deal: ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ నిజమే: ట్విట్టర్ ప్రకటన