Elon Musk Twitter Deal: ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ నిజమే: ట్విట్టర్ ప్రకటన
Elon Musk Twitter Deal: ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ మరోసారి ముందుకు వచ్చినమాట వాస్తవమేనని ఆ సంస్థ స్పష్టం చేసింది.
![Elon Musk Twitter Deal: ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ నిజమే: ట్విట్టర్ ప్రకటన Elon Musk Twitter Deal: Twitter Confirms Elon Musk Buyout Offer, Says Will Close Deal at $54.20 per Share Elon Musk Twitter Deal: ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ నిజమే: ట్విట్టర్ ప్రకటన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/05/2715833a8492076a51d01d6f02dc0d791664953559212218_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Elon Musk Twitter Deal: టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలుకు మళ్లీ రెడీ అయ్యారు. ఇందుకోసం మస్క్ ఓ ఆఫర్‌ను ప్రతిపాదించినట్లు ట్విట్టర్ ధ్రువీకరించింది. తాజాగా ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు చేస్తానని మస్క్.. ట్విట్టర్‌కు ఆఫర్ ఇచ్చారు.
ఈ మేరకు మస్క్ నుంచి లేఖ అందిందని ట్విట్టర్.. AFPకి తెలిపింది. ట్విటర్, మస్క్ మధ్య వివాదం తలెత్తడంతో ఈ లావాదేవీ ఇటీవల నిలిచిపోయింది. మళ్లీ ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ ప్రతిపాదన చేయడంతో ఆశలు చిగురించాయి.
మళ్లీ ఆశలు
ట్విటర్, మస్క్ మధ్య.. స్పామ్ ఖాతాలపై వివాదం తలెత్తడంతో ఈ లావాదేవీ నిలిచిపోయింది. అయితే తాజాగా ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున మస్క్ కొనుగోలు చేయడానికి ఆఫర్ చేశారు. ఈ వార్తలతో మంగళవారం ట్విట్టర్ షేరు 13 శాతం దూసుకెళ్లి 47.95 డాలర్లకు చేరాయి. అనంతరం ట్రేడింగ్‌ను నిలిపివేశారు.
ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.3.50 లక్షల కోట్లు) కొనుగోలు చేసేందుకు ఆ సంస్థతో ఈ ఏడాది ఏప్రిల్‌లో మస్క్ ఒప్పందం కుదుర్చుకున్నారు. వాటాదార్లు సైతం ఈ లావాదేవీకి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్లు 5 శాతం మించి ఉండవని ఆ సంస్థ మేనేజ్‌మెంట్ చెప్పిన వివరాలపై ఎలాన్ మస్క్ సంతృప్తి చెందలేదు. ఫేక్ అకౌంట్ల వివరాల్లో క్లారిటీ రాని పక్షంలో ట్విట్టర్‌ను టేకోవర్ చేసే విషయం పునరాలోచించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు.
" స్పామ్ విషయంలో ట్విట్టర్ మేనేజ్‌మెంట్ చెబుతోన్న లెక్కలు సరిగా లేవు. స్పామ్‌ను ఎలా గుర్తిస్తామనేది ఏమీ బ్రహ్మ విద్య కాదు. కేవలం ట్విట్టర్ మేనేజ్‌మెంట్‌కే ఇది తెలుసని అనుకోవడం కరెక్ట్ కాదు. బయటి వ్యక్తులకు ఇవ్వడం ద్వారానే అందులో మేనేజ్‌మెంట్ చేసిన తప్పులు బయటకు వస్తాయి. డేటాలో ట్విట్టర్ మేనేజ్‌మెంట్ తప్పుడు ఫైలింగ్స్ చేసి ఉండొచ్చు. "
- ఎలాన్ మస్క్, టెస్లా సీఈఓ
ఆ తర్వాత నకిలీ ఖాతాల సంఖ్యకు సంబంధించి తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైందన్న ఆరోపణలతో ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు మస్క్ జులైలో ప్రకటించారు.
కోర్టుకు
మస్క్ ఒప్పందం రద్దు చేసుకోవడంపై ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది. అక్టోబరు 17న డెలావేర్ చాన్సెరీ కోర్టులో విచారణ ప్రారంభం కానుంది. ఈ లోపు ట్విట్టర్ కొనుగోలు మస్క్ మరోసారి ముందుకు వచ్చారు.
Also Read: Pauri Garhwal Bus Accident: పండగ పూట విషాదం- లోయలో పడిన బస్సు, 25 మంది మృతి!
Also Read: Viral Video: కరెంట్ స్తంభానికి కట్టేసి, చితక్కొట్టిన పోలీసులు- వైరల్ వీడియో!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)