Bahubali Samosa: 12 కిలోల బాహుబలి సమోసా - ఆరగించారంటే రూ.71 వేలు మీ సొంతం! ఆ టైంలోగా తినేయాలి
Bahubali Samosa: 12 కిలోల బరువు ఉన్న బాహుబలి సమోసా అరగంటలో ఆరగించారంటే 71 వేల రూపాయలను సొంతం చేసుకోవచ్చు. ఇదెక్కడా అనుకుంటున్నారా..?
Bahubali Samosa: సమోసాలు అంటే ఇష్టపడని ఇండియన్స్ ఉండరు. ఇందులో అనేక రకాలు ఉండగా.. వాటిని బాగా ఇష్టంగా తింటుంటారు. ఇందులో చిన్న వాటి నుంచి కొంచెం పెద్ద వాటి వరకు ఉండడం అందరికీ తెలిసిందే. కానీ మరీ పెద్దగా చేసే సమోసాలు చాలా అరుదు. తాజాగా 12 కిలోల బరువు ఉన్న బాహుబలి సమోసాను తయారు చేయగా.. దాన్ని 30 నిమిషాల్లో తినేస్తే.. 71 వేల రూపాయలు ఇస్తామని ఆఫర్ ప్రకటించారు.
ఈ బంపరాఫర్ ప్రకటించింది ఎప్పుడంటే..?
ఉత్తర ప్రదేశ్ లోని మేరఠ్ లో ప్రాంతంలోని లాల్ కుర్తీకి చెందిన కౌశల్ స్వీట్స్ యజమాని కౌశల్.. తాను తయారు చేసే సమోసాలకు గుర్తింపు వచ్చేలా ఏదైనా చేయాలనుకున్నాడు. ఈక్రమంలోనే మొదట 4 కిలోల సమోసా చేయడం ప్రారంభించాడు. దానికి ఆదరణ రావడం వల్ల ఎనిమిది కిలోల సమోసాలు తయారు చేశాడు. దీనికి మంచి స్పందన రావడం, ఎక్కువ అమ్మకాలు జరగడంతో.. ఎనిమిది కిలోల సమోసాలు తయారు చేశాడు. దీనికి కూడా విపరీతమైన ప్రజాదారణ వవచ్చింది. దీంతో ఈసారి 12 కిలోల సమోసాను తయారు చేశాడు. తన దుకాణానికి వచ్చిన కస్టమర్లు వారి పుట్టిన రోజుకు కేక్ కట్ చేయడానికి బదులుగా సమోసా కట్ చేస్తున్నారని ఆనందంగా చెబుతున్నాడు. ఈ 12 కిలోల సమోసాను 30 నిమిషాల్లో తింటే రూ.71 వేలు గెలుచుకోవచ్చని ఆఫర్ కూడా పెట్టారు.
అయితే ఈ సమోసా తయారు చేయడానికి ఆరు గంటల సమయం పడుతుందని కౌశల్ చెబుతున్నాడు. దాన్ని ఫ్రై చేయడానికి గంటన్నర సమయం పడుతుందని చెప్పాడు. 12 కిలోల్లో దాదాపు 7 కిలోలల వరకు బంగాళ దుంపలు, బఠఆనీలు, మసాలా, పనీర్, డ్రై ఫ్రూట్స్ మిశ్రయం ఉంటుందని వివరించాడు. ఇంత పెద్ద సమోసాను తయారు చేయడానికి దాదాపు 6 గంటల సమయం పడుతుందని అన్నారు. 12 కిలోల బాహుబలి సమోసా ధర దాదాపు 1500 రూపాయలు అని.. ఈ సమోసాల కోసం ఇప్పటి వరకు దాదాపు 40 నుంచి 50 ఆర్డర్లు వచ్చాయని కౌశల్ తెలిపాడు. తమ సమోసా దేశంలోనే అతి పెద్దదని కౌశల్ చెప్పాడు.
గతంలో 8 కిలోల సమోసా.. 51 వేల ప్రైజ్ మనీ!
ఇదే వ్యాపారి గతంలో ఎనిమిది కేజీల బరువుంటే సమోసా తయారు చేశాడు. అలాంటి సమోసా ఎవరూ కొనరు కదా.. అతను కాడా అమ్మడానికి తయారు చేయలేదు. దానికి బాహుబలి సమోసా అని పేరు పెట్టి ప్రదర్శనకు పెట్టాడు. పోటీ కూడా పెట్టాడు. ఈ సమోసాను అరగంటలో తింటే... దానికి బిల్లు కట్టక్కర్లేదని... పైగా తానే రూ. 51 వేలు ఇస్తానని ఆఫర్ ప్రకటించాడు. తన దుకాణానికి ఏదైనా ప్రత్యేకత ఉండాలని శుభం అనే వ్యాపారి ఈ భారీ సమోసా తయారు చేశాడు. దానికి బాహుబలి సమోసా అని పేరు పెట్టాడు. ఈ సమోసాలో ఆలూ, బఠానీలతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేశారు. సమోసా తయారీకి రూ. 1100 ఖర్చు అయిందని వ్యాపారి చెబుతున్నారు. అయితే ట్రై చేసి మొత్తం తినకపోతే సమోసాకు బిల్లు కట్టాలి. చాలా మంది ట్రై చేశారని కానీ ఎవరూ తినలేకపోయారని చెప్పారు.