By: ABP Desam | Updated at : 29 Apr 2022 04:27 PM (IST)
Edited By: Murali Krishna
Indian Railways Update
Indian Railways Update: రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి లోకల్ ఏసీ రైళ్లలో ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. టికెట్ ధరలపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అంటే ఇక ముంబయి లోకల్ ఏసీ రైళ్లలో సగం ధరకే ప్రయాణాలు చేయొచ్చు.
పెట్రో భారంతో
దేశంలో పెట్రో ధరలు భారీగా పెరగడంతో రోడ్డు ప్రయాణాలు చేయాలంటేనే జనం భయపడుతున్నారు. ప్రజారవాణా వ్యవస్థ పరిస్ధితి కూడా అలానే ఉంది. బస్సు టికెట్ ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
ముంబయిలో లోకల్ రైళ్లు ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తాయి. ముంబయిలో జనం దాదాపు ఈ లోకల్ రైళ్ల ద్వారానే తమ రాకపోకలను సాగిస్తుంటారు. అయితే ఎండలు మండిపోవడంతో రైలు ప్రయాణాలు కూడా కష్టంగానే ఉన్నాయి. దీంతో ఏసీ లోకల్ రైళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
హర్షం
ఏసీ రైళ్లలో టిక్కెట్ ధర 50 శాతం తగ్గించడాన్ని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్వాగతించారు. కొన్ని రోజులుగా ఈ డిమాండ్ ఉందని, ఇప్పుడు తగ్గించడం సంతోషకరమన్నారు.
Also Read: Hanuman Chalisa Row: అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులకు మళ్లీ నిరాశే
Also Read: World’s Most Loyal Employee: 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో ఉద్యోగం- నీ ఓపికకు దండం సామీ!
Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!
SonuSood Foundation : ఆపన్నులకు సేవ చేయాలనుకుంటున్నారా ? సోనుసూద్ పిలుపు మీ కోసమే
Tour of Duty Scheme : ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్ రిక్రూట్మెంట్లో విప్లవాత్మక మార్పులు, 4 ఏళ్ల తర్వాత సర్వీస్ నుంచి రిలీజ్
IAS Couple Dog : ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ? బదిలీ అయిన ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు
Indigo OverAction : ఇండిగోకు రూ. ఐదు లక్షల జరిమానా - మళ్లీ అలా చేస్తే ?
Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం
Airtel Network Issue: ఎయిర్టెల్ వినియోగదారులకు నెట్వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!
IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్ బట్లర్ ఫెయిల్యూర్! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!
JioFi Postpaid Plans: జియోఫై కొత్త ప్లాన్లు వచ్చేశాయ్ - రూ.250లోపే 150 ఎంబీపీఎస్ స్పీడ్!