Hanuman Chalisa Row: అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులకు మళ్లీ నిరాశే
Hanuman Chalisa Row: హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టయిన నవనీత్ రాణా దంపతులకు మళ్లీ నిరాశే ఎదురైంది.
Hanuman Chalisa Row: అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణాలకు శుక్రవారం కూడా కోర్టులో ఊరట లభించలేదు. వీరిద్దరూ దాఖలు చేసిన బెయిలు దరఖాస్తులపై శనివారం మధ్యాహ్నం 2.45 గంటలకు విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.
ఉద్ధవ్ ఠాక్రేలో నివాసం వద్ద హనుమాన్ చాలీసాను పఠిస్తామని ప్రకటించడంతో రాణా దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో బెయిల్ కోసం వీరు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటవరకు బెయిల్ లభించలేదు.
నవనీత్ రాణా, బడ్నేరా ఎమ్మెల్యే రవి రాణాలపై ఐపీసీ సెక్షన్ 153(ఏ), బోంబే పోలీస్ యాక్ట్‌లోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. కోర్టు వీరికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నవనీత్ బైకులా జైలులోనూ, రవి తలోజా జైలులోనూ ఉన్నారు.
ఏం జరిగింది?
మహారాష్ట్ర సీఎం నివాసం అయిన మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానని నవనీత్ కౌర్ సవాల్ చేశారు. ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్రలో భయానక వాతావరణం పెరిగిందని, అందుకే "మాతో శ్రీ " ఎదుట హనుమాల్ చాలీసా పఠిస్తానని ఆమె అన్నారు.
నవనీత్ కౌర్ భర్త రవి రాణా కూడా ఎమ్మెల్యేనే. ఆయనతో కలిసి హనుమాన్ చాలీసా పఠించేందుకు వెళ్లక ముందే శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ముంబయిలోని వారింటి ముందు ఆందోళనకు దిగారు. శివసేనతో పోరాడుతూండటంతో కేంద్రం ఆమెకు వై కేటగిరి భద్రత కల్పించింది.
రాణా దంపతులకు అధికార శివసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివసేనను సవాల్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మహారాష్ట్రలో మీరు ప్రశాంతంగా గడపలేరంటూ శివసేన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ హెచ్చరించారు.
ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి నవీనీత్ కౌర్ దంపతులను కోర్టులో హాజరు పరచగా వీరిద‍్దరికీ మే 6 వరకూ జుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు బాంద్రా మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలిచ్చింది.
Also Read: Coronavirus Cases: వరుసగా రెండో రోజు 3 వేల కరోనా కేసులు- 60 మంది మృతి