Telugu breaking News: ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజవర్గ కమిటీలు, బూత్ కమిటీలతో 27న జగన్ కీలక సమావేశం
Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
LIVE

Background
ఈనెల 27న సీఎం జగన్ కీలక సమావేశం
ఇప్పటికే సిద్దం పేరుతో కేడర్‌ను ఎన్నికలకు సంసిద్ధం చేస్తున్న సీఎం జగన్‌ను ఇప్పుడు మరో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజవర్గ కమిటీలు, బూత్ కమిటీలతో ఈ నెల 27న జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. విజయవాడలోని సీకే కన్వెన్షన్ హాల్‌లో 2500 మందితో ఈ భేటీ జరగనుంది.
చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్
తొలిజాబితా విడుదల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. కాసేపట్లో 118 మందితో కూడిన జాబితాను ఇరువురు కలిసి విడుదల చేయనున్నారు.
ఇంగ్లాండ్ జట్టు 353 పరుగులకు ఆలౌట్
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 353 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ అజేయ శతకం సాధించాడు. రూట్ 274 బంతులు ఎదుర్కొని 122 పరుగులు చేశాడు. 10 ఫోర్లు బాదాడు. రాబిన్సన్ 58 పరుగులు చేశాడు. బెన్ ఫోక్స్ 47 పరుగులు చేశాడు.
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రఘురామకృష్ణరాజు రాజీనామా
వైసీపీ ఎన్నో రోజులుగా చేస్తున్న పోరాటానికి రఘురామకృష్ణ రాజు ఎండ్ కార్డు వేశారు. వైసీపీ వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

