అన్వేషించండి

Male vs Female Peeing : మగవారికంటే ఆడవారే యూరిన్​ను ఎక్కువగా కంట్రోల్ చేసుకుంటారట.. సమస్య పెరగడానికి ఇదే ప్రధాన కారణం

Who can Hold Urine Longer : మహిళల కంటే పురుషులే ఎక్కువగా మూత్రవిసర్జన చేస్తారట. మరి లేడిస్ ఎందుకు చేయరు. యూరిన్ సమస్యలకు ఇదే కారణమవుతుందా? సరైన రీజన్స్ ఏంటి?

Women do not Urinate as Often as Men : బ్లాడర్ ఫుల్ అయితే మగ, ఆడ సంబంధం లేకుండా అందరూ టాయిలెట్స్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఎలా పోల్చి చూసిన.. ఆడవారి కంటే మగవారే మూత్రవిసర్జన ఎక్కువ చేస్తారట. సాధారణంగా మూత్ర నిల్వ సామర్థ్యం.. అంటే బ్లాడర్ ఫుల్ అవ్వడానికి 300 మి.లీ నుంచి 600 మి.లీ వరకు ఉంటుంది. ఆ లెవెల్​ని రీచ్​ అయినప్పుడు వాష్​రూమ్​కి వెళ్లేందుకు కంగారు పడతారు. పైగా మూత్రవిసర్జనతో శరీరంలో టాక్సిన్స్ బయటకు వస్తాయి. టాయిలెట్​ని ఎక్కువసేపు కంట్రోల్ చేసుకుంటే వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇన్ని తెలిసినా.. ఆడవారు ఎక్కువ మూత్రవిసర్జన చేయరు. ఎందుకంటే..

మహిళలు మూత్ర విసర్జన ఎక్కువ చేయరంటే అర్థం వారికి బ్లాడర్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని కాదు. వారు టాయిలెట్ యూజ్ చేసుకునేందుకు సరైన, అనువైన ప్రదేశం లేకపోవడమే. ఈ విషయంలో మగవారికి ఉండే బెనిఫిట్స్ అన్ని.. ఇన్ని కాదు. చాలా సులభంగా, వాష్ రూమ్స్ లేకపోయినా.. ఎక్కడపడితే అక్కడ యూరినేట్ చేయగలిగే ఫ్రీడమ్ మగవారికి ఉంది. కానీ మహిళల్లో అలా కాదు. అనువైన ప్రదేశం లేకుంటా వారు యూరిన్​కు వెళ్లలేరు. కాబట్టి పురుషుల్లాగ మహిళలు ఎక్కువ టాయిలెట్స్​కి వెళ్లలేరు. 

యూరిన్ సమస్యలకు అదే కారణం..

కొందరు మహిళలు.. ఇంటి నుంచి బయటకు వెళ్తే.. గమ్యానికి చేరుకున్నాక.. లేదా తిరిగి ఇంటికి వచ్చేవరకు టాయిలెట్స్​కి వెళ్లరు. ఎందుకంటే దారిలో వాష్ రూమ్ వినియోగించుకునే పరిస్థితి లేకపోవడం, వాష్ రూమ్స్​ ఉన్నా.. అవి వినియోగించుకునేందుకు అనువుగా లేకపోవడం వల్ల వెళ్లలేరు. దీనివల్ల వారు బయటకు వెళ్లినప్పుడు నీటిని ఎక్కువగా తాగరు. దీనివల్ల డీహైడ్రేషన్​కి కూడా గురవుతారు. ఇలా యూరిన్​ని కంట్రోల్ చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా యూరిన్ సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయి. 

తీవ్రమైన ఆరోగ్య సమస్యలు

సరైన వసతుల్లేని వాష్ రూమ్స్​ వినియోగించుకోవడం వల్ల యూరిన్ సమస్యలు వస్తాయి అనుకుంటారు కానీ.. యూరిన్​ని కంట్రోల్ చేసేకోవడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలతో పాటు.. యూరిన్ సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అలా అని వసతుల్లేని ప్రదేశాలకు వెళ్తే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యూరినరీ ఇన్​ఫెక్షన్లు వస్తే యోని నుంచి పొత్తికడుపులోకి నొప్పి వస్తుంది. ఈ పెయిన్ మీరు యూరిన్​కి వెళ్లినప్పుడు మరింత ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీకు తరచూ వాష్​రూమ్​కి వెళ్లాలనే భ్రమని కలిగిస్తుంది. ఒకవేళ బ్లాడర్ నిండిందని వెళ్లినా.. యూరిన్ రాదు. 

పీరియడ్స్ సమయంలో నరకమే..

మరికొందరు జర్నీలో వాష్​రూమ్​కి వెళ్లే సౌలభ్యం లేక.. అలాగే ఉండిపోతారు. దీనివల్ల కాళ్లలో నీరు చేరుకుంటుంది. కాళ్లు ఉబ్బిపోతాయి. ఇదే తీవ్రమైతే.. తలనొప్పి సమస్య వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకం కూడా అవుతుంది. ఈ సమస్య పీరియడ్స్​లో ఉన్నవారికైతే నరకమే. పీరియడ్స్ లేని సమయంలో కాస్త అనువుగా ఎక్కడ కనిపించినా వెళ్లొచ్చు కానీ.. బ్లీడింగ్ సమయంలో ఎటూ వెళ్లలేని స్థితి ఏర్పడుతుంది. ఇది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్​ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం పెరుగుతుంది. 

ఫ్యూచర్​లో ఇబ్బంది లేకుండా.. 

ఈ పరిస్థితులను గుర్తించుకుని ప్రభుత్వం వాష్​ రూమ్స్ ఏర్పాటు చేసినా.. వాటి శుభ్రత ఏమేరకు ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే మహిళలు మాత్రం ఇలా యూరిన్​ను కంట్రోల్​ చేసుకుంటే అవి ఆరోగ్యంపై చాలా పెద్ద ఇంపాక్ట్​ని చూపిస్తాయి. కాబట్టి వీలైనంత త్వరగా యూరిన్​కి వెళ్లేందుకు ప్రయత్నించాలని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల ప్రస్తుతమే కాకుండా.. ఫ్యూచర్​లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. 

Also Read : డ్రగ్ టెస్ట్ ఎవరికి, ఎలా చేస్తారో తెలుసా? ఈ టెస్ట్​కి ఆ నమూనాలే కీలకం.. బ్లడ్ కాదట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
Ind Vs NZ Odi Update:  స‌చిన్ ని అధిగమించనున్న రోహిత్ ..! 300వ వ‌న్డే క్ల‌బ్బులో కోహ్లీ.. ఇరుజ‌ట్లు చెరో మార్పు.. కివీస్ తో మ్యాచ్
స‌చిన్ ని అధిగమించనున్న రోహిత్ ..! 300వ వ‌న్డే క్ల‌బ్బులో కోహ్లీ.. ఇరుజ‌ట్లు చెరో మార్పు.. కివీస్ తో మ్యాచ్
SLBC Tunnel Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
Nani Vs Vijay Devarakonda: విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
Ind Vs NZ Odi Update:  స‌చిన్ ని అధిగమించనున్న రోహిత్ ..! 300వ వ‌న్డే క్ల‌బ్బులో కోహ్లీ.. ఇరుజ‌ట్లు చెరో మార్పు.. కివీస్ తో మ్యాచ్
స‌చిన్ ని అధిగమించనున్న రోహిత్ ..! 300వ వ‌న్డే క్ల‌బ్బులో కోహ్లీ.. ఇరుజ‌ట్లు చెరో మార్పు.. కివీస్ తో మ్యాచ్
SLBC Tunnel Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
Nani Vs Vijay Devarakonda: విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
Babili water Release: బాబ్లీ నుంచి నీటి విడుదల- సుప్రీం ఆదేశాల మేరకు నీటిని వదిలిన మహరాష్ట్ర
బాబ్లీ నుంచి నీటి విడుదల- సుప్రీం ఆదేశాల మేరకు నీటిని వదిలిన మహరాష్ట్ర
Gorantla Butchaih Chowdary: టీడీపీలో సీనియర్, ఎన్టీఆర్‌కు భక్తుడిని.. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
టీడీపీలో సీనియర్, ఎన్టీఆర్‌కు భక్తుడిని.. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
Samsung A56: భారత మార్కెట్లోకి 3 కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్న శాంసంగ్- స్పెసిఫికేషన్లు, ధరలు పూర్తి వివరాలిలా
భారత మార్కెట్లోకి 3 కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్న శాంసంగ్- స్పెసిఫికేషన్లు, ధరలు పూర్తి వివరాలిలా
96 Movie - Vijay Sethupathi: విజయ్ సేతుపతి కాదు... బాలీవుడ్ హీరో కోసం రాసిన కథ... కల్ట్ క్లాసిక్ '96'ను మిస్ చేసుకున్న స్టార్ ఎవరో తెలుసా?
విజయ్ సేతుపతి కాదు... బాలీవుడ్ హీరో కోసం రాసిన కథ... కల్ట్ క్లాసిక్ '96'ను మిస్ చేసుకున్న స్టార్ ఎవరో తెలుసా?
Embed widget