అన్వేషించండి

Andhra Pradesh Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు - కసిరెడ్డికి హైకోర్టులో లభించని ఊరట

Kasireddy: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో కీలక వ్యక్తిగా ఉన్న కసిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించలేదు. సీఐడీ కఠిన చర్యలు తీసుకోకుండా రిలీఫ్ ఇచ్చేందుకు నిరాకరించింది.

Kasireddy did not get relief from the High Court : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో కర్త, కర్మ , క్రియగా విజయసాయిరెడ్డి ప్రకటించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనకు ఇటీవల సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులపై హైకోర్టులో కసిరెడ్డి  పిటిషన్ దాఖలు చేశారు. సిట్ అధికారులుపై తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే అలా ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో  సిట్ నోటీసులకు ఆయన స్పంది విచారణకు హాజరు కావాల్సి ఉంది. 

మద్యం స్కాంలో కీలక విషయాలు బయటకు తీసిన   సీఐడీ సిట్                

ఏపీ మద్యం స్కాంలో సైలెంట్‌గా సీఐడీ సిట్ తన పని చేసుకుపోతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కీలక పాత్రధారులకు నోటీసులు జారీ చేస్తున్నారని అంటున్నారు.  ఏపీ లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆయనపై సీఐడీ ఎప్పుడో దృష్టి పెట్టింది. నోటీసులు జారీ చేసింది. ఆయన నోటీసులను తాజాగా హైకోర్టులో సవాల్ చేశారు. తనపై దూకుడైన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసి ఆయన పిటిషన్ డిస్మిస్ చేసింది.        

ఐ ప్యాక్ లో పని చేసి జగన్ కు నమ్మకస్తుడిగా మారిన రాజ్ కసిరెడ్డి          
  
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. వరంగల్ జిల్లా కు చెందిన వారు. ఐఐటీ ఖరగ్ పూర్ లో చదువుకున్నారు.  ఐ-ప్యాక్ టీంలో  కీలకంగా ఉండేవారు. ఆయన 2019 లో వైసీపీ విజయానికి పని చేశారు. తర్వాత రాజ్ కసిరెడ్డి నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా మారారు. ఐటీ సలహాదారు పదవిని రాజ్ కసిరెడ్డికి  ఇచ్చారు. ఆయనకు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సేకరించే సమాచారాన్ని ప్రాసెస్ చేసే కంపెనీ కూడా ఉంది.ఇప్పటికే మద్యం స్కాం లో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది.   

ఏపీబీసీఎల్ వాసుదేవరెడ్డి అప్రూవర్ గా మారారా ?           

ఏపీబీసీఎల్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి మొత్తం వ్యవహారాలపై రోజుల తరబడి స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆయన అప్రూవర్ గా మారారని అంటున్నారు. కోర్టులో  న్యాయమూర్తి ముందు కూడా వాంగ్మూలం ఇచ్చారని చెబుతున్నారు.  దీంతో ఈ స్కాంలో కీలకంగా ఉన్న వారి గుట్టు అంతా బయటకు వస్తుందని టీడీపీ నేతలంటున్నారు. వాసుదేవరెడ్డి  రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి. ఆయనకూడా తెలంగాణకు చెందిన వ్యక్తి.  అయినా వైసీపీ నేతలు ఆయనను తీసుకు వచ్చి కీలకమైన ఏపీబీసీఎల్ ఎండీ పదవి ఇచ్చి స్కాం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.                       

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget