TGCET Merit List: గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Telangana Gurukulam Results: గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ పరీక్ష ఫలితాలను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది.

TGCET 2025 Results: తెలంగాణలోని గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ పరీక్ష ఫలితాలను(ఫేజ్-1) తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఏప్రిల్ 3న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాల ఆధారంగా ఎంపికైన విద్యార్థులకు బీసీ (MJPTBCWREIS), ఎస్సీ ( TSWREIS), ఎస్టీ (TTWREIS), బీసీ (MJPTBCWREIS) గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యతో పాటు, ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సొసైటీల కింద మొత్తం 643 గురుకులాల్లో 51,924 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
TGCET-2025 - 5th Class Results
TGCET-2025 - 5th Class merit List
TGCET-2025 - 5th Class, Special Category Results
TGCET-2025 - 6th Class merit List
TGCET-2025 - 7th Class merit List
TGCET-2025 - 8th Class merit List
TGCET-2025 - 9th Class merit List
* తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు
అర్హత: సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 2024-25 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదివి ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.
వయోపరిమితి: ఓసీ, బీసీ, బీసీ విద్యార్థులు 9 నుంచి 11 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతం రూ.1.50,000; పట్టణ ప్రాంతం రూ.2,00,000 మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.100.
ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ప్రవేశ పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు ఓఎంఆర్ షీట్ విధానంలో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో తెలుగు-20 మార్కులు, ఇంగ్లిష్-25 మార్కులు, మ్యాథమెటిక్స్-25 మార్కులు, మెంటల్ ఎబిలిటీ-10 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-20 మార్కులు ఉంటాయి. 4వ తరగతి స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు.
గురుకులాల్లో సీట్ల వివరాలు ఇలా..
సొసైటీ | బాలికల గురకులాలు | బాలుర గురుకులాలు | సీట్ల సంఖ్య |
ఎస్సీ గురుకులాలు | 141 | 91 | 18,560 |
ఎస్టీ గురుకులాలు | 46 | 36 | 6,560 |
బీసీ గురుకులాలు | 146 | 148 | 23,680 |
సాధారణ సొసైటీ | 20 | 15 | 3,124 |
మొత్తం | 353 | 290 | 51,924 |
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపికచేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ, రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాలు పొందినవారికి రెగ్యులర్ చదువుతోపాటు ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్, ఎప్‌సెట్ లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తారు. విద్యార్థులకు పుస్తకాలు, ఇతర స్టేషనరీ వస్తువులు ఉచితంగా ఇస్తారు. ఉచిత వసతి, ఆరోగ్యకరమైన భోజన సదుపాయాలు ఉంటాయి. వీటితోపాటు స్కూల్ యూనిఫామ్, షూతోపాటు విద్యార్థికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

