అన్వేషించండి

TG Inter: ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనంలో పొరపాట్లకు చెక్, ముందస్తు పునఃపరిశీలనకు బోర్డు నిర్ణయం

TGBIE: ఇంటర్మీడియట్‌ జవాబుపత్రాల మూల్యాంకనంలో ఈసారి ఇంటర్‌బోర్డు ముందస్తు పునఃపరిశీలన చేయనుంది. 35 మార్కులు రాని విద్యార్థులకు సంబంధించి జవాబుపత్రాలను పునఃపరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Inter paper Valuation: తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ఇంటర్మీడియట్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జవాబుపత్రాల మూల్యాంకనంలో ఈసారి ముందస్తు పునఃపరిశీలన చేయాలని బోర్డు నిర్ణయించింది. సాధారణంగా ఇంటర్ ఫలితాలు వెలువడిన తర్వాత మార్కులు సరిగా రాలేదని, లెక్చరర్లు చేసిన తప్పిదం వల్లే తాము ఫెయిల్‌ అయ్యామని విద్యార్థులు ఆరోపిస్తుంటారు. ఈ నేపథ్యంలో 35 మార్కులు రాని విద్యార్థులకు సంబంధించి జవాబుపత్రాలను చీఫ్‌ ఎగ్జామినర్, సబ్జెక్టు నిపుణులతో క్షుణ్నంగా పునఃపరిశీలన చేయించనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. దీంతో విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉంటుందని వారంటున్నారు. ఏప్రిల్‌ 10 నాటికి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తికానుంది. ఫలితాలను ఏప్రిల్‌ చివరి వారంలోగా వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

తెలంగాణలో ఇంటర్ ప్రధాన పరీక్షలు మార్చి 20తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే బ్రిడ్జ్ కోర్సు, అన్ని సబ్జెక్టుల పరీక్షలు మార్చి 25తో పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రధాన సబ్జెక్టులకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పరీక్షల మొదట్లో ప్రశ్నపత్రాల్లో చిన్నచిన్న తప్పులు దొర్లినా... ఆ తర్వాత అన్ని సబ్జెక్టుల పరీక్షలు సజావుగా జరిగాయి. పరీక్షల ఫలితాలను ఏప్రిల్ నెలాఖరులోపు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.

రాష్ట్రంలో అగ్రికల్చర్, ఫార్మ, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన 'టీజీఎప్‌సెట్-2025' పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పరీక్షల ప్రారంభానికి కనీసం రెండు మూడు రోజుల ముందుగా... అంటే ఏప్రిల్ నాలుగో వారంలో ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ లక్ష్యంగా పనిచేస్తోంది.

గతేడాది మార్చి 19 నాటికి ఇంటర్ పరీక్షలు పూర్తికాగా.. ఏప్రిల్ 24న ఫలితాలు విడుదల చేశారు. ఈసారి కూడా దాదాపు అదే తేదీలో ఫలితాలు వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.80 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

మూల్యాంకనం సాగుతోందిలా..

➥ ఇంటర్ పత్రాల మూల్యాంకనం కోసం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి లోపాలు లేకుండా మూల్యాంకనం ప్రక్రియ చేపట్టనున్నారు. మార్కుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన తర్వాత.. ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 14 వేలమంది సుమారు 60 లక్షల జవాబుపత్రాలను దిద్దాల్సి ఉంటుంది.

➥ సమాధాన పత్రాలను పలు స్థాయిల్లో పరిశీలిస్తారు. ఆ తర్వాతే మార్కులను ఖరారు చేస్తారు. రోజుకు ఒక్కో అధ్యాపకుడు 40 సమాధాన పత్రాలను  మాత్రమే మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. వారిని అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ అంటారు.

➥ పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలకు తగిన సమాధానాలను నిపుణులు మూల్యాంకన ప్రక్రియ కోసం పంపుతారు. వీటి ఆధారంగా అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ జవాబుపత్రాలను పరిశీలించి మార్కులు వేస్తారు. కొన్ని పరిమితుల మేరకు విచక్షణాధికారంతో మార్కులు వేయవచ్చు. తర్వాత ఆ జవాబుపత్రం చీఫ్‌ ఎగ్జామినర్‌కు వెళ్తుంది. వారు మార్కులను, మూల్యాంకన తీరును పరిశీలిస్తారు.

➥ తర్వాతి దశలో జవాబుపత్రం సబ్జెక్టు నిపుణుల వద్దకు వెళ్తుంది. ఎక్కడైనా పొరపాటు ఉంటే నిపుణులు సరిచేస్తారు. ప్రతీ ప్రక్రియ, ప్రతీ మార్పును చీఫ్‌ ఎగ్జామినర్‌ రికార్డు చేస్తారు. ఇన్ని దశలు దాటిన తర్వాత మార్కులు బోర్డుకు వెళతాయి. మూల్యాంకన సమయంలో ఇచ్చిన కోడ్‌ను ఇంటర్‌ బోర్డ్‌లో డీకోడ్‌ చేస్తారు. ఆ విద్యార్థి మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.

➥ సాఫ్ట్‌వేర్‌పై ట్రయల్‌ రన్‌ చేస్తారు. కొందరు విద్యార్థుల మార్కులను నమోదు చేసి.. సాంకేతిక లోపాలేమైనా ఉన్నాయా.. అని మానవ వనరుల ద్వారా పరిశీలిస్తారు. ఇలా మొత్తం 4 రౌండ్లు ట్రయల్‌ జరుపుతారు. ఎలాంటి సమస్య లేకపోతే.. తుది దశ ఫలితాలను నమోదు చేస్తారు.

➥ జవాబుపత్రాల మూల్యాంకనం ఇవాళ ప్రారంభమై నెల రోజుల పాటు కొనసాగుతుంది. మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. మూల్యాంకనం ప్రక్రియను ఈసారి ఆధునిక పద్ధతుల్లో చేపట్టబోతున్నారు. హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయానికి ప్రతీ కేంద్రాన్ని అనుసంధానం చేస్తున్నారు.

➥ ఈసారి ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. మూల్యాంకనం చేసే అధ్యాపకులు ఏ సమయంలో వస్తున్నారు.. ఎప్పుడు కేంద్రం నుంచి వెళ్తున్నారనే వివరాలను రికార్డు చేస్తారు.

➥ ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేని అధ్యాపకులనే మూల్యాంకనం కోసం ఎంపిక చేయాలని.. జిల్లా అధికారులకు తెలంగాణ ఇంటర్ బోర్డ్‌ ఆదేశాలిచ్చింది.

➥ ఫస్ట్, సెకెండ్ ఇయర్ కలిపి మొత్తం 9లక్షల 96వేల 971 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. వీరందరి అన్ని సబ్జెక్టులు కలిపి సుమారు 60 లక్షల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సిఉంది.

➥ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ జరిగే 19 కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. శాస్త్రీయ పద్ధతిలో ఈసారి మూల్యాంకనం ఉండబోతోంది. ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Shreyas Iyer Breaks Virat Kohli Record: కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Embed widget