అన్వేషించండి

Inter Academic Calender: తెలంగాణ ఇంటర్ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల, కాలేజీలు నడిచేది ఎన్నిరోజులంటే?

Academic Calender: తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు వ‌చ్చే విద్యాసంవ‌త్సరం మొత్తం 226 పనిదినాలు ఉండనున్నాయి. వేసవి సెలవుల తర్వాత జూన్ 2 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.

Telangana Inter Academic Calender: తెలంగాణలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి జూనియర్‌ కాలేజీల అకడ‌మిక్ క్యాలెండ‌ర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి పనిదినాలు, తరగతులు, సెలవులు, పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఏప్రిల్ 3న కొత్త అకడ‌మిక్ క్యాలెండ‌ర్‌ను విడుదల చేశారు. దీనిప్రకారం.. వ‌చ్చే విద్యాసంవ‌త్సరం మొత్తం 226 పనిదినాలుగా ఇంట‌ర్ బోర్డు నిర్ణయించింది. వేసవి సెలవుల తర్వాత జూన్ 2 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి. 2026 మార్చి 31 తేదీని విద్యాసంవత్సరం చివరి పనిదినంగా నిర్ణయించారు.

పండగ సెలవులు ఇవే..
ఇంటర్ విద్యార్థులకు ఈ ఏడాది సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 5 వరకు దసరా సెలువులు ఇవ్వనున్నారు. దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 6న కాలేజీలు పునఃప్రారంభంకానున్నాయి. అదేవిధంగా.. వచ్చే ఏడాది(2026) జనవరి 11 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 

మార్చి మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు..
➥ జనవరి 19 నుంచి 24 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి మొదటి వారంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అడకమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు. మార్చి మొదటి వారంలో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు క్యాలెండర్‌లో పేర్కొన్నారు. ఇక 2026 మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. 

➥  విద్యార్థులకు నవంబర్ 10 నుంచి 15 వరకు అర్థ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. 

వేసవి సెలవులు ఎప్పుడంటే?
విద్యాసంవత్సరంలో వేసవి సెలవులు 2026 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు ఇవ్వనున్నట్లు క్యాలెండర్‌లో ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. వచ్చే ఏడాది జూన్ 1వ తేదీన జూనియర్ కాలేజీలు పునః ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్..
➥ ఇంటర్మీడియేట్ తరగతులు ప్రారంభం: 02.06.2025.

➥ దసరా సెలవులు: 28.09.2025 - 05.10.2025.

➥ అర్థ సంవత్సరం పరీక్షలు: 10.11.2025 - 15.11.2025.

➥ సంక్రాంతి సెలవులు: 11.01.2026 - 18.01.2026.

➥ ప్రీ ఫైనల్ పరీక్షలు: 19.01.2026 - 24.01.2026.

➥ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: 2026, ఫిబ్రవరి మొదటి వారంలో.

➥ ఇంటర్ వార్షిక పరీక్షలు: 2026 మార్చి మొదటి వారంలో

➥ విద్యాసంవత్సరం చివరి పనిదినం: 31.03.2026.

➥ వేసవి సెలవులు: 01.04.2026 - 31.05.2026. 

➥ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: 2026, మే చివరి వారంలో. 

➥ జూనియర్ కాలేజీల పునః ప్రారంభం: 01.06.2026.

ఏపీలో ఇంటర్ సిలబస్, ప్రశ్నపత్రాల విధానంలో మార్పులు..
ఏపీలోని ఇంటర్ విద్యావిధానంలో ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి సిలబస్, ప్రశ్నపత్రాల నమూనాలోనూ మార్పులు చేసింది. దీనిప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్‌ పరీక్షల్లో మొదటిసారిగా ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెడుతున్నారు. ఈ మార్పులకు సంబంధించి జూనియర్‌ కళాశాలలకు ఇంటర్ బోర్డు సమాచారం పంపింది. ప్రథమ సంవత్సరంలో జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ను ప్రవేశపెట్టారు. పాఠశాల స్థాయిలో ఈ ఏడాది పదోతరగతిలో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీన్ని వచ్చే ఏడాదికి ఇంటర్మీడియట్‌ వరకు పొడిగించారు. ఏపీలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 20తో ముగిసిన సంగతి తెలిసిందే. 

టాప్ హెడ్ లైన్స్

Study in Germany: జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Adilabad News: తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
Embed widget