అన్వేషించండి

Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో పరీక్షల విధానంలో సంస్కరణల కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

PM Modi | న్యూఢిల్లీ: దేశంలోని విద్యార్థుల భవిష్యత్తు పరిరక్షణే భారత ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ తరువాత జరిగిన పరిణామాలతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విద్యా వ్యవస్థ, పరీక్షల విధానంలో సంస్కరణలపై సిఫార్సులు చేయడానికి ఇన్వోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.  పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్న నేరస్థులపై ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటోందని ఆయన వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.

రాబోయే రోజుల్లో పరీక్షా విధానంలో పారదర్శకత, విశ్వసనీయత పెంచడం అత్యంత కీలకమని ప్రధాని మోదీ చెప్పారు. పరీక్షల నిర్వహణలో సాంకేతికతను సాధ్యమైనంతగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా నందన్ నిలేకణి (Nandan Nilekani) నేతృత్వంలో హైపవర్ టాస్క్‌ఫోర్స్ కమిటీ  ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

ఈ టాస్క్‌ఫోర్స్ ప్రధానంగా పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ సమర్పించే నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షలపై విశ్వసనీయతను పెంచేలా, లీకేజీలకు తావులేకుండా నమ్మకమైన పరీక్షా వ్యవస్థను రూపొందిస్తామని హామీ ఇచ్చారు. పేపర్ లీకులు అరికట్టేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకురాబోతున్నామని, సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని మోదీ పేర్కొన్నారు.

టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలో సభ్యులు వీరే..

నందన్‌ నీలేకని చైర్మన్‌గా వ్యవహరించనుండగా ఈ టాస్క్‌ ఫోర్సులో మరో ఐదుగురు సభ్యులుగా ఉంటారు. ఇస్రో మాజీ ఛైర్మన్‌ సోమనాథ్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ డైరెక్టర్‌ తపన్‌ డేకా, ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ వి. కామకోటి, కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కర్వాల్‌, లాజిస్టిక్స్‌, పరిపాలనా నిపుణులు అయిన అమృత్‌ లాల్‌ మీనా సభ్యులుగా ఉంటారు.

ఈ కమిటీ ప్రధానంగా ఏం చేస్తుంది..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే జాతీయ ప్రవేశ పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. ప్రశ్నపత్రాల లీకేజీలు, మాల్‌ప్రాక్టీస్‌లను అరికట్టడానికి అత్యాధునిక సాంకేతిక భద్రత, డిజిటల్ డేటా రక్షణ, అభ్యర్థుల వెరిఫికేషన్ వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ కమిటీ ప్రధాన ధ్యేయం. భవిష్యత్తులో ప్రభుత్వ పోటీ పరీక్షలన్నీ పూర్తి పారదర్శకత, విశ్వసనీయతతో నిర్వహించేలా ఈ కమిటీ నిర్మాణాత్మక సంస్కరణలను కేంద్ర ప్రభుత్వానికి సూచించనుంది.

Also Read: Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  

పేపర్ లీక్ విచారణపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు

పేపర్ లీక్‌లతో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న నిందితులు ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇటువంటి కేసుల విచారణ వేగవంతం చేసేందుకు ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు పూర్తి స్వేచ్ఛ, కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందని మోదీ ఇటీవల పేర్కొన్నారు. అదనంగా, పార్లమెంటులో కఠినమైన నిబంధనలతో కొత్త చట్టాన్ని తీసుకురావడానికి కేంద్రం చర్యలు చేపట్టిందని ఆయన ప్రకటించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget