Idli Kadai Release Date: దసరాకు ధనుష్ కొత్త మూవీ 'ఇడ్లీ కడై' - అధికారిక ప్రకటన వచ్చేసింది!
Dhanush Idli Kadai: తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కడై' రిలీజ్ వాయిదా పడింది. ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన మూవీ అక్టోబర్ 1న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ధనుష్ నెట్టింట వెల్లడించారు.

Dhanush's Idli Kadai Movie New Release Date: కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) అటు హీరోగా ఇటు డైరెక్టర్‌గా మరోవైపు నిర్మాతగానూ ఫుల్ బిజీగా మారారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కడై' (Idli Kadai). ధనుష్ సరసన హీరోయిన్ నిత్యామేనన్ నటించారు. ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా ఈ నెల 10న రిలీజ్ అవుతుందని అంతా భావించారు. అయితే, కొన్ని కారణాలతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.
కొత్త తేదీ ప్రకటిస్తూ ధనుష్ పోస్టర్
ఈ సినిమా కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తూ హీరో ధనుష్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ మూవీ అక్టోబర్ 1న రిలీజ్ కానున్నట్లు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుందని ధనుష్ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఆకాష్ భాస్కరన్, ధనుష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Idli kadai #oct1 pic.twitter.com/9EkllemSPt
— Dhanush (@dhanushkraja) April 4, 2025
రూమర్లు నిజమయ్యాయి
'ఇడ్లీ కడై' మూవీ వాయిదా పడుతుందంటూ ఇటీవల సోషల్ మీడియా వేదికగా రూమర్లు హల్చల్ చేశాయి. అయితే, వీటిని ఖండించిన నిర్మాత.. అనుకున్న టైంకే సినిమా రిలీజ్ చేస్తామని తెలిపారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో దీన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న నాల్గో సినిమా. 'తిరుచిత్రంబలం' మూవీ తర్వాత నిత్యా మేనన్ మరోసారి ధనుష్‌తో కలిసి నటిస్తున్నారు. మూవీలో అరుణ్ విజయ్, ప్రకాశ్ రాజ్, షాలినీ పాండే కీలక పాత్రలు పోషించారు. రెండోసారి ధనుష్ - నిత్యామేనన్ కాంబో వస్తుండడంతో మూవీపై ఆసక్తి నెలకొంది.
అదే కారణమా?
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ 'విదాముయర్చి' తర్వాత మరో కొత్త యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాలో అజిత్, త్రిష మరోసారి సందడి చేయనున్నారు. అనుకున్న దాని ప్రకారం 'ఇడ్లీ కడై' కూడా ఇదే రోజున రిలీజ్ అయితే రెండు సినిమాల మధ్య క్లాష్ రాకుండా ఉండడానికే ధనుష్ ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా ఓ రూమర్ ప్రచారంలో ఉంది. అయితే, షూటింగ్ ఆలస్యం కావడం వల్లే 'ఇడ్లీ కడై' వాయిదా వేసినట్లు మేకర్స్ చెబుతున్నారు.
మరోవైపు, ధనుష్ 'కుబేర' మూవీ కోసం అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రలు పోషిస్తుండగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత దర్శకుడు రాజకుమార్ పెరియాసామితో ఓ మూవీ చేయబోతున్నారు. ఇక ధనుష్ ఇళయారాజా బయోపిక్‌లోనూ నటిస్తుండగా ఆ మూవీ ఆగిపోయిందనే రూమర్లు వినిపిస్తున్నాయి.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు






















