అన్వేషించండి

Sound Bath Benefits : సౌండ్ బాత్ గురించి మీకు తెలుసా? దీనితో శారీరకంగా, మానసికంగా ఎన్ని ప్రయోజనాలున్నాయో

Sound Bath Healing : సౌండ్ బాత్​ని మీ రోటీన్​లో చేర్చుకుంటే శారీరక, మానసిక ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. ఇంతకీ ఈ సౌండ్ బాత్ అంటే ఏమిటి? దాని బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Health Benefits with Sound Bath : హెడ్ బాత్ గురించి తెలుసు.. కోల్డ్ బాత్​ గురించి తెలుసు.. ఈ రెగ్యూలర్​ బాత్​లకు రోటీన్​గా సౌండ్​ బాత్ తెరపైకి వచ్చింది. ఇదేంటి సౌండ్ బాత్ కొత్తగా అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఇదే ట్రెండ్​లోకి వచ్చిన బాత్. శారీరకంగా, మానసికంగా దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇంతకీ ఈ సౌండ్ బాత్ ఏంటి? దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

సౌండ్ బాత్ అంటే ఏమిటి?

సౌండ్ బాత్​లో చాప మీద పడుకుని ప్రతిధ్వనించే, మనసుని లీనం చేసే సంగీతాన్ని వినడం. సాధారణంగా సాంగ్స్, లేదా మ్యూజిక్ అనేది గ్రూప్స్​తో ఉన్నప్పుడు వింటారు. అయితే ఈ సౌండ్​ బాత్​లో ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు చేయాల్సిన ప్రక్రియ. ఇది మిమ్మల్ని ధ్వనిలో లీనమయ్యేలా చేయడమే లక్ష్యంగా ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం ప్రతిధ్వనించే టోన్స్, విశ్రాంతిని, సంగీతాన్ని అందించేలా గిన్నెలతో మృదువైన సంగీతాన్ని అందిస్తారు. సౌండ్ బాత్​లో పాల్గొనేవారు యోగా లేదా ధ్యానం చేస్తూ పడుకుంటారు. శిక్షణ పొందిన ట్రైనర్ మనకి సౌండ్ బౌల్​తో ధ్వనిని విడుదల చేస్తారు. ఇది శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. వారి మంచి విశ్రాంతి దొరుకుతుంది. 

సెషన్​లో పాల్గొనేవారి అవగాహన స్థితిని బట్టి దీనిని సున్నితంగా మార్గనిర్దేశం చేస్తూ ముగిస్తారు. వినసొంపైన సౌండ్​ని అందించే గిన్నెలు.. సౌండ్​ బాత్​లో ప్రధాన సాధనాలు. ఇది టిబెటిన్​నుంచి వచ్చి ఓ సాంప్రదాయబద్ధమైన ప్రక్రియగా చెప్తారు. బౌద్ధులు ఎక్కువగా దీనిని ఫాలో అయ్యేవారు. అంతేకాకుండా దీనిని మతపరమైన కార్యక్రమాల్లో కూడా వినియోగిస్తారు. ఆచారపరమైన సంగీతంలో ఈ సంగీత పాత్రలు వినియోగించినప్పటికీ.. చారిత్రాత్మకంగా.. ఆరోగ్య ప్రయోజనాల కోసం వీటిని వినియోగిస్తున్నారు. సౌండ్​ బాత్​లు.. సౌండ్ హీలింగ్ అనే ప్రక్రియగా చాలామంది చెప్తారు. శతాబ్ధాలుగా దీనిని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు కానీ.. ఎక్కువమందికి దీనిగురించి తెలీదు. 

సౌండ్ బాత్​ వల్ల కలిగే ప్రయోజనాలివే..

సౌండ్ బాత్​తో ఒత్తిడి దూరమవుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలపై ఒత్తిడి పూర్తి నెగిటివ్​గా ఎఫెక్ట్ చేస్తుంది. అలాంటి స్ట్రెస్​ను ఈ సౌండ్ బాత్ కంట్రోల్ చేస్తుంది. ఈ సెషన్​లో విడుదలయ్యే ప్రశాంతమైన టోన్స్, వేవ్స్ మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. నాడీ వ్యవస్థ కంట్రోల్ అవుతుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గి.. ప్రశాంతత దొరుకుతుంది. 

సౌండ్​బాత్​తో మనసును రీసెట్ చేసుకోవచ్చు. ఇది వ్యక్తుల మానసిక గందరగోళాన్ని దూరం చేస్తుంది. అయోమయాన్ని దూరం చేసి క్లారిటీ ఇస్తుంది. ముఖ్యమైన విషయాల్లో క్లారిటీగా ఉండేలా చేస్తుంది. అతి ఆలోచించడాన్ని కంట్రోల్ చేసి.. శాంతపరచడంలో సౌండ్ థెరపీ హెల్ప్ చేస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. 

నిద్ర సమస్యలుంటే..

నిద్ర సమస్యలున్నవారికి సౌండ్ బాత్ అనేది ఓ అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. ఇది నాడీ వ్యవస్థను శాంత పరిచి.. లోపలి నుంచి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. క్రమంగా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. రెగ్యూలర్​గా సౌండ్ బాత్ సెషన్​లు తీసుకుంటే.. ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు. ఇది శక్తిని, మొత్తం ఆరోగ్యాన్ని ప్రమోట్ చేస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా మీరు మంచి అనుభూతిని పొందుతారు. అయితే ధ్వనితో ఇబ్బంది ఉండేవారు, మైగ్రేన్ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సౌండ్​ బాత్​కి దూరంగా ఉంటేనే మంచిది. 

Also Read : అలర్ట్, చైనాలో విజృంభిస్తోన్న వింత దగ్గు సమస్య - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, కరోనా కంటే ప్రమాదకరమా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana VS Andhra Pradesh: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
AP Nominated posts: కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
HCU Land Dispute: ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
CSK Captain MS Dhoni:  చెన్నై కెప్టెన్ గా ధోనీ..! మ‌ళ్లీ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న వెట‌ర‌న్ ప్లేయ‌ర్..!! శ‌నివారం చెపాక్ లో ఢిల్లీతో మ్యాచ్
చెన్నై కెప్టెన్ గా ధోనీ..! మ‌ళ్లీ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న వెట‌ర‌న్ ప్లేయ‌ర్..!! శ‌నివారం చెపాక్ లో ఢిల్లీతో మ్యాచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Angkrish Raghuvanshi 50 vs SRH | ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసిన రఘువంశీKamindu Mendis Ambidextrous Bowling vs KKR | IPL 2025 లో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ ప్లేయర్Sunrisers Flat Pitches Fantasy | IPL 2025 లో టర్నింగ్ పిచ్ లపై సన్ రైజర్స్ బోర్లాSunrisers Hyderabad Failures IPL 2025 | KKR vs SRH లోనూ అదే రిపీట్ అయ్యింది

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana VS Andhra Pradesh: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
AP Nominated posts: కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
HCU Land Dispute: ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
CSK Captain MS Dhoni:  చెన్నై కెప్టెన్ గా ధోనీ..! మ‌ళ్లీ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న వెట‌ర‌న్ ప్లేయ‌ర్..!! శ‌నివారం చెపాక్ లో ఢిల్లీతో మ్యాచ్
చెన్నై కెప్టెన్ గా ధోనీ..! మ‌ళ్లీ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న వెట‌ర‌న్ ప్లేయ‌ర్..!! శ‌నివారం చెపాక్ లో ఢిల్లీతో మ్యాచ్
Nagababu : పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు
పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు
Hyderabad MLC Elections:.హైదరాబాద్‌లో మరోసారి బీజేపీ వర్సెస్‌ ఎంఐఎం, కిషన్ రెడ్డిపై రాజాసింగ్ ఆగ్రహం
హైదరాబాద్‌లో మరోసారి బీజేపీ వర్సెస్‌ ఎంఐఎం, కిషన్ రెడ్డిపై రాజాసింగ్ ఆగ్రహం
Test Movie Review - టెస్ట్ రివ్యూ: క్రికెట్ కాదు... అంతకు మించి - Netflixలో నయన్, మాధవన్, సిద్ధార్థ్ సినిమా ఎలా ఉందంటే?
టెస్ట్ రివ్యూ: క్రికెట్ కాదు... అంతకు మించి - Netflixలో నయన్, మాధవన్, సిద్ధార్థ్ సినిమా ఎలా ఉందంటే?
YS Sharmila: తల్లిపై కేసు వేసిన కొడుకు - మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామ - జగన్‌పై షర్మిల విమర్శలు
తల్లిపై కేసు వేసిన కొడుకు - మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామ - జగన్‌పై షర్మిల విమర్శలు
Embed widget