Jio Unlimited Offer: ఫ్రీగా జియో హాట్‌స్టార్, ఫ్రీగా జియో ఫైబర్ - ఆఫర్ గడువు పొడిగించిన జియో
Free Jio Hotstar - Free Jio Fiber: అన్‌లిమిటెడ్ ఆఫర్ ద్వారా జియో కస్టమర్లు భారీ ప్రయోజనాలు పొందవచ్చు. ఫ్రీ ఆఫర్‌ల కారణంగా ప్రస్తుతం దీనికి డిమాండ్ ఉంది.

Jio Unlimited Offer With Prepaid Recharge Plan: రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2025 సీజన్ (IPL 2025 season) సందర్భంగా ప్రకటించిన "అన్‌లిమిటెడ్" ఆఫర్‌ను ఈ టెలికాం కంపెనీ మరికొన్ని రోజులు పొడిగించింది. వాస్తవానికి, జియో అన్‌లిమిటెడ్ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే ఉండేది. ఈ తేదీ లోపు జియో సిమ్‌ను రీఛార్జ్ చేసుకున్న యాజర్లకు మాత్రమే ప్రయోజనాలు లభించేవి. అయితే, సబ్‌స్క్రైబర్ల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా ఆఫర్ గడువును జియో పెంచింది.
జియో అన్‌లిమిటెడ్ ఆఫర్ ఏంటి?
అన్‌లిమిటెడ్ ఆఫర్ ద్వారా యూజర్లకు 3 ప్రధాన ప్రయోజనాలను రిలయన్స్ జియో అందిస్తోంది.
* రూ.299 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో జియో సిమ్‌ను రీఛార్జ్ చేసుకున్న ప్రతీ యూజర్‌కు అన్‌లిమిటెడ్ ఆఫర్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ఆఫర్‌లో భాగంగా 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పూర్తి ఉచితం (Jio Hotstar subscription is free for 90 days)గా లభిస్తుంది. రూ.299 అనేది నెలవారీ ప్లాన్ అయినప్పటికీ, 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్‌ను ఉచితంగా చూడవచ్చు, ముఖ్యంగా IPL మ్యాచ్‌లను ఎంజాయ్ చేయవచ్చు. మొబైల్ ఫోన్‌తో పాటు టీవీల్లోనూ జియో హాట్‌స్టార్ కంటెంట్‌ను ఉచితంగా వీక్షించవచ్చు.
* జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్‌పై 50 రోజుల ఫ్రీ ట్రయల్ ఆఫర్ (50-day free trial offer on Jio Fiber or Jio Air Fiber) కూడా ఉంది. అంటే, జియో ఫైబర్ లేదా ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను మొదటి 50 రోజులు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దీనిలో WiFi తో పాటు 800కు పైగా ఛానళ్లు, 11 OTT యాప్స్‌ను పొందవచ్చు.
* 50 GB వరకు జియో క్లౌడ్ స్టోరేజ్ (Up to 50 GB of Jio Cloud storage is free) కూడా ఉచితంగా అందుబాటులో ఉంటుంది. గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ (Google Cloud Storage)కు పోటీగా రిలయన్స్ దీనిని తీసుకొచ్చింది. గూగుల్, ఒక్కో యూజర్‌కు 15 GB వరకు క్లౌడ్ స్టోరేజ్‌ను ఉచితంగా అందిస్తోంది.
జియో అన్‌లిమిటెడ్ ఆఫర్‌ను ఎప్పటి వరకు పెంచారు?
రిలయన్స్ జియో, 2025 మార్చి 17న అన్‌లిమిటెడ్ ఆఫర్‌ను ప్రకటించింది & 2025 మార్చి 31 వరకు మాత్రమే ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని అప్పుడు స్పష్టం చేసింది. ఇప్పుడు, కస్టమర్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్‌ను 2025 ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఏప్రిల్ 15వ తేదీన లేదా ఆలోగా రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో జియో రీఛార్జ్ ప్లాన్ కొన్నవాళ్లు అన్‌లిమిటెడ్ ఆఫర్‌ను ఉపయోగించుకోవడానికి అర్హులు. ప్రస్తుత కస్టమర్లతో పాటు కొత్తగా జియో సిమ్ తీసుకుని రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకూ ఈ అవకాశం ఉంటుంది.
జియో 299 ప్లాన్ వివరాలు
మీరు, రూ. 299 ప్లాన్‌తో జియో సిమ్‌ను రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 GB డేటాను ఎంజాయ్ చేయవచ్చు & రోజుకు 100 SMSలు కూడా పంపుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది.





















