Virgin Boys: సమ్మర్లో సందడికి సిద్ధమైన 'వర్జిన్ బాయ్స్'... క్రియేటివ్ పోస్టర్‌తో రిలీజ్ డేట్ అప్డేట్
Virgin Boys : గీతానంద్ - మిత్రా శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న రోమ్ కామ్ ఎంటర్టైనర్ వర్జిన్ బాయ్స్. తాజాగా సినిమా రిలీజ్ కదా సిద్ధమైందంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా అప్డేట్ ఇచ్చారు.

సమ్మర్లో థియేటర్లలో ప్రేక్షకులను నవ్వుల వర్షంలో ముంచెత్తడానికి సిద్ధమైంది రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'వర్జిన్ బాయ్స్'. 'బ్రో ఆర్ యూ వర్జిన్?' అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ సినిమా స్పెషల్ గా యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. అందమైన అమ్మాయి పెదాలపై ముగ్గురు అబ్బాయిలు ఉన్నట్టుగా ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా మూవీ రిలీజ్ కి సిద్ధమైందన్న అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
రిలీజ్ కు సిద్ధమైన 'వర్జిన్ బాయ్స్'
ఇటీవల కాలంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్లకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. రొమాన్స్ తో పాటు కావలసినంత కామెడీ ఉండే ఫార్ములాతో రూపొందుతున్న సినిమాలే ఇప్పుడు కొత్త ట్రెండ్. ఇలాంటి కథతోనే రూపొందుతున్న మూవీ 'వర్జిన్ బాయ్స్'. గీతానంద్ - మిత్రా శర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న రోమ్ కామ్ ఎంటర్టైనర్ 'వర్జిన్ బాయ్స్'. రాజ్ గురు ఫిలిమ్స్ పతాకంపై రాజా దరపునేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. ఇందులో గీతానంద్, మిత్రా శర్మలతో పాటు సుజిత్ కుమార్, బబ్లు, అభిలాష్, శ్రీహన్, రోనీత్, జెన్నీఫర్, అన్షుల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఈ సమ్మర్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ మేరకు తాజాగా ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా మేకర్స్ విషయాన్ని వెల్లడించారు.
Also Read: ఆస్పత్రిలో అలేఖ్య చిట్టి... చావు తప్ప మరో దిక్కు లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న సుమ
Buckle up for the ultimate ride of laughter, love, and absolute madness🤩
— Bittu (@Bittu13126) April 8, 2025
This summer, things are heating up with these #VirginBoys 💥🥳
🌟ing : @geetanand79 #MitraawSharma #DayanandhGaddam #RajaDarapuneni Under #RajGuruFilms pic.twitter.com/QhSFQ7YslN
అట్రాక్టివ్ పోస్టర్ తో అప్డేట్
'వర్జిన్ బాయ్స్' తాజా పోస్టర్లో అందమైన అమ్మాయి ముఖం, అందులో ఆమె పెదాలు, వాటిపై ముగ్గురు యువకులు విభిన్న శైలిలో కనిపించడం క్రేజీగా అనిపిస్తోంది. అందులో ఒకరు కలర్ ఫుల్ షార్ట్ లో, మరొకరు మ్యాగజైన్ పట్టుకుని, ఇంకొకరు స్కేట్ బోర్డుతో కనిపించడం చూస్తుంటే సినిమాలో రొమాన్స్ తో పాటు కామెడీ కూడా కావలసినంతగా ఉంటుందని అర్థమవుతుంది. ఇక సినిమాలో ముగ్గురు యువకుల మధ్య నడిచే కామెడీ, ఎమోషన్స్ తో పాటు రొమాన్స్ వంటి అంశాల మేళవింపుతో సినిమా ఉంటుంది. యూత్ ఫుల్ కంటెంట్ తో రూపొందుతున్న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. మొత్తానికి పోస్టర్స్ తోనే సినిమాపై అంచనాలను పెంచడంలో నిర్మాతలు సక్సెస్ అయ్యారు. సమ్మర్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ఇప్పటి నుంచే భారీ ఎత్తున ప్రమోషన్లు మొదలు పెట్టారు మేకర్స్. ఇప్పటి నుంచి ప్రమోషన్లలో వేగం పెంచి, వరుస అప్డేట్స్ ఇవ్వనున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు.





















