Alekhya Chitti Hospitalized: ఆస్పత్రిలో అలేఖ్య చిట్టి... చావు తప్ప మరో దిక్కు లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న సుమ
Alekhya Chitti Pickles Closed?: అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు సుమ కంచర్ల ప్రకటించారు. తన చెల్లెలు ఆస్పత్రి పాలైందని, ట్రోలింగ్ ఆపేయమని ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Alekhya Chitti Pickles Controversy Latest Updates: అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం మూత పడింది. కాదు కాదు... ఆ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు పెద్దమ్మాయి సుమ కంచర్ల స్వయంగా ప్రకటించారు. తన చెల్లెలు ఆస్పత్రి పాలైందని, ఇకనైనా ట్రోలింగ్ ఆపేయమని ఆవిడ ప్రాధేయపడ్డారు. కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో విడుదల చేశారు.
ఆస్పత్రిలో అలేఖ్య చిట్టి...
బ్రీతింగ్ అందడం లేదు!
బ్రీతింగ్ ఇష్యూస్ వల్ల అలేఖ్య చిట్టి ఆసుపత్రిలో చేరినట్లు ఆమె అక్క సుమ కంచర్ల తెలిపారు. క్షమాపణలు కోరుతూ వీడియో చేసినా సరే ట్రోలింగ్ పేజీలు, మీమర్స్ తమను వదలడం లేదని సుమ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆడియో లీక్ అయిన తర్వాత అలేఖ్య ఎందుకు బయటకు రాలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారని, ఆ వివాదం తర్వాత తన చెల్లికి ఏం చేయాలో తెలియలేదని, అందుకే బయటకు రాలేదని ఆవిడ వివరించారు.
ఆడియో లీక్ కాంట్రవర్సీ తర్వాత అలేఖ్యకు బ్రీతింగ్ సమస్యలు వచ్చాయని సుమ కంచర్ల వివరించారు. డాక్టర్స్ దగ్గరకు తీసుకు వెళ్లగా బీపీతో పాటు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారని, అప్పుడు ఆరోగ్యం కొంత కుదుట పడిందని, మళ్లీ ట్రోలింగ్ చూశాక బ్రీతింగ్ సమస్యలు మొదలయ్యాయని, దాంతో తన చెల్లెల్ని ఆసుపత్రిలో చేర్పించామని ఆవిడ కన్నీరు మున్నీరయ్యారు.
చావు తప్ప మరో దిక్కులేదు!
తమ చెల్లెలికి చావు తప్ప మరొక దిక్కు లేదని, ప్రతి రోజు కొంత మంది యూట్యూబర్లు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా (న్యూస్ ఛానల్స్) రెండేసి వీడియోలు చొప్పున చేస్తున్నారని, తమను టార్గెట్ చేశారని సుమ కంచర్ల కన్నీళ్లు పెట్టుకున్నారు. చావు తప్ప మరొక దిక్కు లేదంటూ ఆవిడ తీవ్ర వేదనకు లోను అయ్యారు. మూడు నెలల క్రితం తమ తండ్రి మరణించారని, ఇప్పుడు మరొక చావును తట్టుకునే శక్తి తమ కుటుంబానికి లేదని, ఇక్కడితో ఈ వివాదానికి ముగింపు పలకాలని తాము కోరుకుంటున్నట్లు ఆవిడ తెలిపారు. క్షమించలేని తప్పు ఏది ఉండదని, చావుకు మించిన పెద్ద తప్పు ఏముంటుందని ఆవిడ ప్రశ్నించారు.
Also Read: ఫ్యామిలీతో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న ఐకాన్ స్టార్... అల్లు అర్జున్ ఫ్యామిలీ పిక్ చూశారా?
ఆడియో లీక్ కాంట్రవర్సీ తర్వాత తన చెల్లెలు బయటకు వచ్చే పరిస్థితి లేదని, అందువల్లే సారీ చెబుతూ ముందుగా వీడియో చేయలేకపోయిందని, తర్వాత ఆమెతో సారీ చెప్పిస్తూ ఒక వీడియో చేయించినా తమను వదలడం లేదని సుమ కంచర్ల ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మంచిది అంటూ సుమకు నెటిజనులు కొందరు సలహాలు ఇస్తున్నారు.
పాపం ఇంకా వదలండయ్యా వీళ్లని పాపం వాళ్ల ముఖాల్లో అంత బాధ ఉంటే అలా jokes ఎలా వేస్తున్నారు
— సూర్య కాంతం (@katthiteesukora) April 8, 2025
పాడు లోకం 👀#alekhyachittipickles #ramya #alekya https://t.co/3W1MxPcsl1 pic.twitter.com/yKeA4es4KC





















