News
News
X

Chicken: కోడిమాంసాన్ని కడగకుండానే వండాలా? పచ్చి చికెన్‌ను చేతులతో తాకితే ప్రమాదమా?

చికెన్ తినే వారి సంఖ్య ప్రపంచంలో చాలా ఎక్కువ. కానీ వారందరికీ ఒక సందేహం వేధిస్తోంది.

FOLLOW US: 

కోడి మాంసాన్ని ఇంటికి తెచ్చాక దాన్ని శుభ్రంగా కడుగుతారు. కొంతమంది ఉప్పు, పసుపు వేసి మరీ వాష్ చేస్తారు. ఇలా అయితే బ్యాక్టిరియాలు ఏమైనా ఉంటే పోతాయని. కానీ అలా శుభ్రంచేయడం వల్లే ప్రమాదం అధికమని చెబుతున్నారు అంతర్జాతీయ పరిశోధకులు. ఇలా నీళ్లతో క్లీన్ చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే. అయితే చికెన్ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవ్వదు. చేతులతో కడగడం వల్ల అవుతుందట. అదెలాగో చూడండి. 

బ్యాక్టిరియాల వల్లే...
చికెన్‌ను తెచ్చి బాగా వండి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ దాన్ని మీరు చేతులతో కడగడం వల్ల మాత్రం చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. పచ్చి మాంసం మీద సాల్మెనెల్లా వంటి బ్యాక్టిరియాలు ఉంటాయి. వాటిని కడిగేటప్పుడు చేతులకి అంటుకుంటాయి. అలాగే ఆ చికెన్ వేసి గిన్నెకు కూడా అంటుకుంటాయి. కోసిన కత్తిని కూడా అతుక్కుంటాయి. మీరు అదే చేత్తో ఇంకేదైనా ఆహారాన్ని పట్టుకున్నా, అదే కత్తితో ఏ పండో కోసినా కూడా సాల్మొనెల్లా వాటిపై చేరుతుంది. అలా అది నోటి ద్వారా పొట్టలోకి వెళ్లి ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతుంది. 

క్యాంపిలోబ్యాక్టర్ అనే బ్యాక్టిరియాలు పచ్చి చికెన్ పై ఉంటాయి. ఇవి కానీ పొట్టలోకి చేరాయో వాంతులు అవ్వడం ఖాయం. కూరగాయలు, పచ్చి పాలల్లో కూడా ఈ బ్యాక్టిరియా ఉంటుంది. అందుకే బాగా ఉడికించాకే తినమని చెబుతారు. ఈ బ్యాక్టిరియా వల్ల జ్వరం, పొట్ట నొప్పి కూడా వస్తుంది. కొందరిలో చాలా ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. ఇది రోగనిరోధక శక్తిపై దాడి చేస్తుంది. నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. శరీరమంతా చచ్చుబడిపోయే పరిస్థితి వస్తుంది. ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు. ఈ బ్యాక్టిరియా వల్ల పిల్లలు, ముసలి వాళ్లే అధికంగా ప్రమాదం బారిన పడతారు. 

ఏం చేయాలి?
చికెన్ తెచ్చాక కడగవద్దు. గిన్నెలో నీళ్లు, చికెన్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. ఆ బ్యాక్టిరియా చచ్చిపోతుంది. లేదా వేడి వేడి నీళ్లలో ఓ రెండు నిమిషాలు ఉంచి తీసేసినా చాలు. పచ్చి మాంసాన్ని మాత్రం ముట్టుకోవద్దు. 

Also read: ఆ టిష్యూ పేపర్ కొనాలంటే మీ ఏడాది జీతం ఇవ్వాల్సిందే, అది ఎందుకంత ఖరీదు?

Also read: అత్యంత పురాతన పిండి మరయంత్రం ఇది, ఆరువందల ఏళ్లుగా తిరుగుతూనే ఉంది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 06 Sep 2022 08:11 AM (IST) Tags: Chicken food poisoning Uncooked chicken Dont touch Chicken Chicken dangerous

సంబంధిత కథనాలు

పెరిగే వయసుకు కళ్లెం వెయ్యాలా? ఇవి తప్పక తీసుకోవాల్సిందే!

పెరిగే వయసుకు కళ్లెం వెయ్యాలా? ఇవి తప్పక తీసుకోవాల్సిందే!

International Music Day: సంగీతం వినడం వల్ల శరీరంలో వచ్చే మార్పులు ఇవే

International Music Day: సంగీతం వినడం వల్ల శరీరంలో వచ్చే మార్పులు ఇవే

World Coffee Day 2022: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కినట్టే

World Coffee Day 2022: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కినట్టే

World Coffee Day 2022: రోజుకో కప్పు కాఫీతో మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుదల, అతిగా తాగితే ఆ నష్టం తప్పదు

World Coffee Day 2022: రోజుకో కప్పు కాఫీతో మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుదల, అతిగా తాగితే  ఆ నష్టం తప్పదు

Ghee coffee: రకుల్‌ ప్రీత్‌కు నెయ్యి కాఫీ అంటే ఎంతో ఇష్టమట! మీరూ ట్రై చేస్తారా?

Ghee coffee: రకుల్‌ ప్రీత్‌కు నెయ్యి కాఫీ అంటే ఎంతో ఇష్టమట! మీరూ ట్రై చేస్తారా?

టాప్ స్టోరీస్

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?