![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
India, Omicron Cases Tally: దేశంలో 77కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. మహారాష్ట్రలో అత్యధికం
దేశంలో కరోనా కేసుల సంఖ్య అదుపులోనే ఉన్నప్పటికీ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగిస్తోంది.
![India, Omicron Cases Tally: దేశంలో 77కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. మహారాష్ట్రలో అత్యధికం Omicron Corona Cases India 16 December 2021 update Delhi Andhra Pradesh Maharashtra Chandigarh reported Omicron cases India tally at 77 India, Omicron Cases Tally: దేశంలో 77కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. మహారాష్ట్రలో అత్యధికం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/15/899135d242d88656b06d8535c454d492_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశంలో కొత్తగా 7,974 కరోనా కేసులు నమోదయ్యాయి. 343 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 87,245కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.25గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. 7,948 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,41,54,879కి పెరిగింది. రికవరీ రేటు 98.38 శాతంగా ఉంది. 2020 మార్చి నుంచి అత్యధికం.
మరణాల సంఖ్య 4,76,478కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 77 కేసులు నమోదయ్యాయి. బంగాల్, రాజస్థాన్, గుజరాత్, దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. బంగాల్‌లో బుధవార ఉదయం తొలి కేసు నమోదుకాగా, తమిళనాడులో నిన్న సాయంత్రం నమోదైంది. మహారాష్ట్ర, కేరళలో నాలుగు చొప్పున ఒమిక్రాన్ కేసులు బుధవారం వచ్చాయి. మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరింది.
వార్నింగ్..
WHO ప్రాథమిక ఆధారాల ప్రకారం.. ఇండియాలో తీసుకున్న Covid-19 వ్యాక్సిన్లు ఈ వేరియెంట్‌పై తక్కువ ప్రభావం చూపుతాయి. ఇది రీఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని కలిగి ఉన్నట్లు తెలిపింది. కోవిడ్ వ్యాక్సిన్‌లు లేదా గతంలో ఏదైనా ఇన్‌ఫెక్షన్ చికిత్స కారణంగా పొందిన రోగనిరోధక శక్తిని ఒమిక్రాన్(Omicron) ఎంతవరకు తప్పించుకోగలదో తెలుసుకోడానికి మరింత డేటా అవసరమని పేర్కొంది. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నా.. ఒమిక్రాన్ బారిన పడే అవకాశాలు ఉన్నట్లు WHO స్పష్టం చేసింది. GISAID గ్లోబల్ సైన్స్ డేటాబేస్‌లో రిజిస్టర్ చేసిన డెల్టా వేరియెంట్ల సీక్వెన్స్‌ల శాతం ఇతర ఆందోళనకర వేరియంట్‌లతో పోల్చితే ఈ వారం క్షీణించిందని పేర్కొంది. డెల్టా(Delta) వేరియంట్ ఇప్పటికీ ఆందోళనకర స్థాయిలోనే ఉందని, ప్రజలు మాస్క్, శానిటైజేషన్ తప్పకుండా పాటించాలని హెచ్చరించింది.
Also Read: Omicron Vaccine: ఒమిక్రాన్‌పై మన వ్యాక్సిన్లు పనిచేస్తాయా? WHO షాకింగ్ న్యూస్!
Also Read: India New CDS: భారత నూతన COSCగా ముకుంద్ నరవాణే బాధ్యతల స్వీకరణ
Also Read: Central Cabinet: అమ్మాయి పెళ్లి వయసు 18 కాదు 21 ఏళ్లు.. త్వరలోనే పార్లమెంట్‌లో చట్టం
Also Read: Vijay Diwas 2021: భారత్ పంజా దెబ్బకు పాక్ పరార్.. విజయ్ దివస్.. ఇది కథ కాదు విజయగాథ!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)