అన్వేషించండి

AP News: ఓర్వకల్లు నోడ్‌‌కు మహర్ధశ, హైదరాబాద్- బెంగుళూరు కారిడార్‌లో భాగం చేస్తూ నోటిఫికేషన్ జారీ

Hyderabad Bengaluru Industrial Corridor | కర్నూలులోని ఓర్వకల్లు నోడ్ ను హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగం చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

Orvakal Node in Kurnool District | అమరావతి: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు నోడ్ ను హైదరాబాద్ - బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ (Hyderabad - Bengaluru Industrial Corridor)లో భాగం చేస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. కర్నూలులోని ఓర్వకల్లు మండలంలోని 13 గ్రామాల పరిధిలో ఉన్న 9,718 ఎకరాలను ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ గా గుర్తిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ యాక్టు 2017 ప్రకారం హైదరాబాద్ - బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ లో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ ను భాగం చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం కీలక పరిణామంగా చెప్పవచ్చు.

2 పారిశ్రామిక కారిడార్ లతో అనుసంధానం

ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ రాష్ట్రంలోని మరో రెండు ప్రధాన పారిశ్రామిక కారిడార్ లతో అనుసంధానం అయి ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. చెన్నై - బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ తో పాటు విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ తోనూ ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ కనెక్టివిటీని కలిగి ఉందని ప్రభుత్వం తెలిపింది. ఎరో స్పేస్, నాన్ మెటాలిక్, ఫార్మా, అప్పారెల్, డిఫెన్స్, బెవరేజెస్ సహా తదితర పరిశ్రమలకు ఓర్వకల్లు నోడ్ అనువైందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. 

కృష్ణపట్నం పోర్టుకు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్ ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా మారుతుందని ఏపీ ప్రభుత్వం ఆకాంక్షించింది. తాజా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌కు 37 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ విడుదల అయింది.

అభివృద్ధికి కట్టుబడి ఉన్న కేంద్రం

గత ఏడాది కేంద్ర కేబినెట్ సమావేశంలో ఓర్వకల్లులో పారిశ్రామిక హబ్ డెవలప్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఓర్వకల్లులో వృథాగా ఉన్న వేలాది ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు సహకారం అందిస్తామని, ఓర్వకల్లు పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గతేడాది కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారని తెలిసిందే. ఆ మధ్య సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు పెద్ద కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది.

Also Read: Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget