ICC Champions Trophy 2025 Ind Vs Nz Final: వరుస విజయాలు సాధిస్తున్నా, అక్కడ ఇంప్రూవ్ అవ్వాలి.. లేకపోతే నష్టమే.. దిగ్గజ క్రికెటర్ సూచన
టీమిండియా వరుస విజయాలు సాధించినా, ఇంకా కొన్ని విషయాల్లో ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉందని దిగ్గజం సునీల్ గావస్కర్ భావిస్తున్నాడు. ముఖ్యంగా ఓపెనింగ్ విషయంలో కాస్త అసంతృప్తిని బయట పెట్టాడు.

Gavaskar Comments: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలో ఫైనల్ కు మాజీ చాంపియన్ భారత్ దూసుకెళ్లింది. ఇప్పటిరవరకు ఆడిన అన్ని మ్యాచల్లోనూ విజయం సాధించి అన్ బీటెన్ గా టీమిండియా నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే టోర్నీని మూడుసార్లు గెలిచిన జట్టుగా నిలుస్తుంది. గతంలో 2002, 2013లో భారత్ టోర్నీని నెగ్గింది. ఈసారి కూడా గెలిచి ముచ్చటగా మూడోసారి కప్పు గెలవాలని భావిస్తోంది. అయితే టీమిండియా వరుస విజయాలు సాధించినా, ఇంకా కొన్ని విషయాల్లో ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ భావిస్తున్నాడు. ముఖ్యంగా ఓపెనింగ్ విషయంలో కాస్త అసంతృప్తిని బయట పెట్టాడు. ఓపెనర్ల నుంచి మంచి శుభారంభం రావడం లేదని పేర్కొన్నాడు. అలాగే బౌలింగ్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్ విభాగం నుంచి మరింత మెరుగైన ప్రదర్శనను ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. అటు ఓపెనింగ్ బౌలింగ్, ఇటు మిడిల్ ఓవర్లలో బౌలింగ్ గురించి వ్యాఖ్యానించాడు.
ఆరంభంలో వికెట్లు తీయడం లేదు..
ప్రత్యర్థి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తొలి పది ఓవర్లలో మన బౌలర్లు ఎక్కువగా వికెట్లు తీయడంలో విఫలం అవుతున్నారని గావస్కర్ విమర్శించాడు. కనీసం రెండు, మూడు వికెట్లు కూడా తీయడం లేదని పేర్కొన్నాడు. ఓపెనింగ్ బౌలర్లు ఎక్కువగా వికెట్లు తీస్తేనే ప్రత్యర్థి జట్టు ఒత్తిడిలోకి వెళుతుందని, అది జట్టుకు సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నాడు. అలాగే మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయకున్నా, పరుగుల రాకను కట్టడి చేస్తున్నారని, వికెట్లు తీయగలిగితే మరింత సానుకూలంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఏ ఫార్మాట్ అయిన డాట్ బాల్స్ ఆడేలా ప్రత్యర్థిని కట్టడి చేస్తే, వాళ్లే ఒత్తిడికి లొంగి వికెట్లు సమర్పించుకుంటారని పేర్కొన్నాడు.
టీమిండియా కాంబినేషన్..
ఇక ఫైనల్ మ్యాచ్ కు భారత కాంబినేషన్ గురించి గావస్కర్ తన అభిప్రాయాన్ని తెలియ జేశాడు. ప్రస్తుతమున్న ఫైనల్ లెవన్ ను మార్చాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ముఖ్యంగా నలుగురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగాలని సూచించాడు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చక్కగా బౌలింగ్ చేస్తున్నారని, ఎక్కువగా డాట్ బాల్స్ వేస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడుతున్నారని గుర్తు చేశాడు. ఎక్కువ డాట్స్ ఆడితే, ఆటోమాటిగ్గా ఒత్తిడి పెరుగుతుందని అప్పుడు వికెట్లు వాటంతట అవే వస్తాయని పేర్కొన్నాడు. మరోవైపు ఇండియా ఫైనల్లో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. 2000 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 223 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో కివీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఇక ఈ టోర్నీలో భారత్ కిది వరుసగా మూడో ఫైనల్ కావడం విశేషం. 2013 ఇంగ్లాండ్ పై గెలిచిన భారత్, 2017లో పాక్ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా మరోసారి ఫైనల్ కు చేరుకుంది.



















