అన్వేషించండి

TDP Latest News: టీడీపీ నేతల మదిలో మాట సెటైర్లతో చెప్పిన వెంకయ్య- ఇకనైనా చంద్రబాబు పంథా మారుతుందా?

Andhra Pradesh Latest News: దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకొని స్వల్పకాలిక లక్ష్యాలతో పని చేయాలని చంద్రబాబుకు వెంకయ్య సూచనలు చేశారు. ఎప్పటి నుంచో టీడీపీ నేతల మదిలో ఉన్న మాట చెప్పారనే చర్చ నడుస్తోంది.

Andhra Pradesh Latest News: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. చంద్రబాబును తన తమ్ముడిగా భావిస్తానని వెంకయ్య నాయుడు చాలా సందర్భాల్లో చెప్పారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ఒక పుస్తక ఆవిష్కరణ సభలో మాట్లాడుతూ  అదే సభకు హాజరైన చంద్రబాబును ఉద్దేశించి వెంకయ్య నాయుడు కీలక కామెంట్స్ చేశారు. "చంద్రబాబు నాయుడు అతిగా ఆలోచిస్తారు. అలాగే టార్గెట్స్ అనేవి అధికారుల నుంచి ఐదేళ్లకే పరిమితం చేసుకోవాలి కానీ 20 30 ఏళ్ల తర్వాత చెయ్యాల్సిన టార్గెట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రజలు అసంతృప్తిలోనవుతారు " అనే ఉద్దేశంతో ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 

చంద్రబాబు అతిగా ఆలోచిస్తారన్న వెంకయ్య నాయుడు 
నిజంగానే ఈ చర్చ టిడిపి వర్గాల్లో సైతం ఎప్పుటి నుంచో జరుగుతూ ఉంది. ప్రభుత్వపరంగాను పార్టీపరంగాను ఏదైనా ఇష్యూ తలెత్తినప్పుడు చంద్రబాబు నాయుడు దానిపై సాగతీత ధోరణి అవలంబిస్తారంటూ టిడిపి నాయకులే చెబుతూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకుంటే ఎవరు బాధపడతారో అనే యాంగిల్‌లో డెసిషన్ తీసుకోవడానికి చాలా టైం తీసుకుంటారని అంటారు.  ఇది ఇరు వర్గాల్లోను అసహనం పెరుగుతుందనేది ఎప్పటి నుంచి టిడిపిలో ఉన్న అభిప్రాయం. అది ఏదైనా పదవులకు సంబంధించిన అంశమైనా లేక ప్రభుత్వ పరమైన నిర్ణయం అయినా చంద్రబాబు ఈ ధోరణిలోనే ఉంటారనేది చాలామందిలో ఉన్న ఒపీనియన్. అమరావతి డిజైన్ల పేరుతో 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు చేసిన కాలాయాపన 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమికి కారణమైందని ఇప్పటికీ చాలా మంది చెబుతుంటారు. ఎన్నికల సమయంలో టికెట్లు కేటాయింపులోనూ ఇదే పద్ధతి కొనసాగుతూ ఉంటుంది. ఏదీ ఒక పట్టాన తేల్చరు చంద్రబాబు అని టిడిపి శ్రేణుల్లోనే ఒక నిర్థిష్ట అభిప్రాయం ఏర్పడిపోయింది.

Also Read: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం

లక్ష్యాలు మన కాలంలోనే పూర్తయ్యేలా ఏర్పాటు చేసుకోవాలి: వెంకయ్య 
చంద్రబాబును ఉద్దేశించి వెంకయ్య నాయుడు చేసిన మరో సూచన" లక్ష్యాలు ఎప్పుడూ మన కాలంలోనే పూర్తయ్యేలా ఏర్పాటు చేసుకోవాలి". 2004 సమయంలో చంద్రబాబు 'విజన్ 2020' పేరును పదేపదే ప్రసవిస్తూ వచ్చేవారు. తర్వాత కాలంలో అది నిజమే అని రుజువు అయినా అప్పట్లో మాత్రం సామాన్య ప్రజానీకానికి అది అర్థం కాలేదు. అదేదో కంప్యూటర్లకు సంబంధించిందని చంద్రబాబు రైతులకు, ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారనే ఒక ప్రచారం జనాల్లోకి వెళ్లిపోయింది. అది ఆ తర్వాత ఎన్నికల్లో టిడిపి ఓటమికి దారితీసింది. ప్రస్తుతం "స్వర్ణాంధ్ర విజన్ 2047" అంటూ కొత్త లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. దీనిని ఉద్దేశించే లక్ష్యాలు ఎప్పుడూ  అధికారంలో ఉండే ఐదేళ్లు టార్గెట్‌గా ఉండాలని సామాన్య ప్రజలు నాయకుల నుంచి ఎంతో ఆశించి ఓట్లు వేస్తారని ఆశలకు తగ్గట్టే ప్రభుత్వ లక్ష్యాలు ఉండాలనేది వెంకయ్య నాయుడు ఉద్దేశం. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ మొదలైంది. సుదూర కాల లక్ష్యాలకు అనుగుణంగానే ప్రస్తుతం పవర్‌లో ఉన్న ఐదు ఏళ్లలో ఎంతో కొంత ఫలితాలను చూపించాలి ప్రజలకు అనేది ఆయన ఉద్దేశంగా విశ్లేషణలు మొదలయ్యాయి. 

నిజంగానే ప్రజాముఖంగా చంద్రబాబుకు  వెంకయ్య నాయుడు చేసిన సూచనలు చాలా విలువైనవని  చంద్రబాబు వాటిని పాటిస్తే మంచిదని టిడిపి వర్గాల్లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. 2014లో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు చాలా సుదీర్ఘ కాల లక్ష్యాలతో పాలించారు. కానీ తాత్కాలికంగా ప్రజలకు ఏం కావాలో వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడంలో విఫలమయ్యారు. అదే ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణమైందని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు కూడా స్వల్పకాల లక్ష్యాలు మర్చిపోయి దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకొని పని చేస్తున్నారని ఇది కూడా ప్రమాదకరమే అంటున్నారు. 

Also Read: దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget