అన్వేషించండి

AP SSC Exams: టెన్త్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అలర్ట్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయండిలా..

AP 10th Exams 2025 | ఏపీలో మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఎగ్జామ్ రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఆర్టీసీ అవకాశం కల్పించింది.

AP 10th Class Exams | అమరావతి: ఏపీలో పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం శుభవార్త చెప్పింది. టెన్త్ క్లాస్ ఎగ్జామ్ (AP SSC Exams) కు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం (Free Bus) అవకాశం కల్పించింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) యాజమాన్యం శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 17 నుంచి ఏపీలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3450 ఎగ్జామ్స్ సెంటర్స్ ఏర్పాటు చేయగా, సుమారు 6.5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు మన మిత్ర ప్రభుత్వ వాట్సాప్‌ సేవ 9552300009 ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

హాల్ టికెట్ చూపిస్తే చాలు..
మార్చి 17 నుంచి మార్చి 31 వరకు ఏపీలో టెన్త్ బోర్డు ఎగ్జామ్స్ (AP 10th Class Exams) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. టెన్త్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఇంటి నుంచి ఎగ్జామ్స్ సెంటర్ కి వెళ్లడానికి, పరీక్ష రాశాక తిరిగే ఇంటికి చేరుకునేందుకు సిటీ ఆర్డినరీ సర్వీసులు, ఆర్టీసీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం విద్యార్థులు తమ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ హాల్ టికెట్ చూపిస్తే చాలని అధికారులు తెలిపారు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సమయంలో విద్యార్థుల రద్దీకి తగినట్లుగా ఆర్టీసీ బస్సులు నడిపియాలా ఏర్పాట్లు చేయాలని రవాణాశాఖ అధికారులను ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది.

SSC Public Examinations - 2025 Hall Tickets.. 
Download S.S.C (Regular) HallTickets
Download S.S.C (Private) HallTickets
Download S.S.C (OSSC) HallTickets
Download S.S.C (OSSC Private) HallTickets
Download S.S.C (Vocational) HallTickets
SSC Public Examinations - 2025 School Wise Hall Tickets

టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పూర్తి షెడ్యూల్

  • 17-03-2025 (సోమవారం)  -   ఫస్ట్ ల్యాంగ్వేజ్ గ్రూప్ ఏ -  9.30 నుంచి 12.45 వరకు
  • 17-03-2025 (సోమవారం)  -   ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 కాంపోజిట్ కోర్స్ -  9.30 నుంచి 12.45 వరకు
  • 19-03-2025 (బుధవారం)  -   సెకండ్ ల్యాంగ్వేజ్ -   9.30 నుంచి 12.45 వరకు
  • 21-03-2025 (శుక్రవారం)  -    ఇంగ్లీష్     - 9.30 నుంచి 12.45 వరకు
  • 22-03-2025 (శనివారం)   -      ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 2  కాంపోజిట్ కోర్స్ -  9.30 నుంచి 11.15 వరకు
  • 22-03-2025 (శనివారం)   -      OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) -  9.30 నుంచి 12.45 వరకు
  • 24-03-2025 (సోమవారం)  -   మ్యాథమేటిక్స్ -  9.30 నుంచి 12.45 వరకు
  • 26-03-2025 (బుధవారం)  -   భౌతికశాస్త్రం   -  9.30 నుంచి 12.45 వరకు
  • 28-03-2025 (శుక్రవారం)  -     జీవశాస్త్రం      -  9.30 నుంచి 12.45 వరకు
  • 29-03-2025 (శనివారం)  -    OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2  (సంస్కృతం, అరబిక్, పర్షియన్) -  9.30 నుంచి 12.45 వరకు
  • 29-03-2025 (శనివారం)  -    SSC ఒకేషనల్ కోర్స్ (థియరీ)-  9.30 నుంచి 11.30 వరకు
  • 31-03-2025 (సోమవారం)  -    సాంఘీక శాస్త్రం    -  9.30 నుంచి 12.45 వరకు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
KTR Help: మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
మాట నిలబెట్టుకున్న కేటీఆర్. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
Best Mileage Diesel Cars: మీ డబ్బు ఆదా చేస్తూ ఎక్కువ మైలేజీ ఇచ్చే డీజిల్ SUVలు.. 16.5 నుంచి 24.08kpl వరకు!
బెస్ట్‌ మైలేజీ ఇచ్చే 7 డీజిల్ కాంపాక్ట్ SUVలు ఇవే.. టాప్ ప్లేస్‌లో టాటా నెక్సాన్
Embed widget