By: ABP Desam | Updated at : 09 Dec 2022 03:26 PM (IST)
పూజా హెగ్డే (Image courtesy - @Pooja Hegde /Instagram)
సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) సరసన 'మహర్షి' చిత్రంలో పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటించారు. ఇప్పుడు మరోసారి ఆ జోడీ సందడి చేయనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో 'అతడు', 'ఖలేజా' చిత్రాల తర్వాత ఇప్పుడు ముచ్చటగా మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో పూజా హెగ్డే హీరోయిన్. 'అరవింద సమేత వీర రాఘవ', 'అల వైకుంఠపురములో' సినిమాల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆమెకు మూడో చిత్రమిది. త్వరలో ఈ సినిమా సెట్స్‌లో పూజా హెగ్డే సందడి చేయనున్నారు.
డిసెంబర్ 15 నుంచి...
మహేష్, త్రివిక్రమ్ సినిమా తాజా షెడ్యూల్ వచ్చే వారం మొదలు కానుంది. పూజా హెగ్డే డిసెంబర్ 15 నుంచి షూటింగులో జాయిన్ కానున్నారు. ఆల్రెడీ దర్శక నిర్మాతలకు డేట్స్ విషయంలో కన్ఫర్మేషన్ ఇచ్చేశారు.
పుకార్లకు చెక్ పెట్టిన పూజపూజా హెగ్డే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల షూటింగ్ లేట్ అవుతోందని, ఆలస్యానికి కారణం ఆమెదే అన్నట్లు ఆ మధ్య కొందరు పుకార్లు సృష్టించారు. తాను షూటింగ్‌కు రెడీ అని చెప్పడం ద్వారా పరోక్షంగా ఆ పుకార్లకు పూజా హెగ్డే చెక్ పెట్టారు. ఇప్పుడు ముంబైలో రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా నటించిన 'సర్కస్' సినిమా పబ్లిసిటీ పనుల్లో బిజీగా ఉన్న పూజ, త్వరలో హైదరాబాద్ రానున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులతో పాటు SSMB 28 సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్ ముంబైలో ఉన్నారు. ఆ సినిమా స్క్రిప్ట్, మ్యూజిక్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కథ విషయంలో హీరో, దర్శకుడు మధ్య ఏకాభిప్రాయం కుదరపోవడం కారణంగా షూటింగ్ ఆగిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఆ వార్తలు నిజం కాదని తెలిపాయి. మహేష్ తండ్రి కృష్ణ, కొన్ని రోజుల క్రితం తల్లి ఇందిరా దేవి మరణాల కారణంగా చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది.
Also Read : 'గుర్తుందా శీతాకాలం' రివ్యూ : గుర్తుంచుకునేలా ఏమైనా ఉందా? సత్యదేవ్, తమన్నా ఎలా చేశారంటే?
తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అయితే... అతను వద్దని త్రివిక్రమ్ మీద మహేష్ బాబు ఒత్తిడి తీసుకు వచ్చినట్లు ఆ మధ్య సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. అప్పుడే పుకార్లకు చిత్ర బృందం చెక్ పెట్టింది. ఆల్రెడీ తమన్ మూడు ట్యూన్స్ ఫైనలైజ్ చేశారు. ఇప్పుడు ఆయన కూడా ముంబైలో ఉన్నారు. మిగతా పాటలు, నేపథ్య సంగీతం విషయంలో హీరో, దర్శకుడితో డిస్కస్ చేస్తున్నారట. త్రివిక్రమ్ సినిమా అంటే తమన్ ప్రాణం పెట్టి పాటలు చేస్తారని పేరు వచ్చింది. వాళ్ళ కాంబినేషన్ మ్యూజికల్ హిట్. ఇప్పుడు మహేష్ సినిమాకు ఎలాంటి సాంగ్స్ ఇస్తారో చూడాలి.
ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.
K. Viswanath: సీతారాముల కళ్యాణంలో వితంతు వివాహం - ‘స్వాతిముత్యం’లో విశ్వనాథ్ సాహసం
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
K Viswanath Death: సెల్యూట్ టు మాస్టర్ - కళాతపస్వికి కమల్, బాలకృష్ణ, అనిల్ కపూర్ నివాళులు
K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం
K Vishwanath Top 10 Movies: విశ్వనాథ్ మరపురాని 10 చిత్రాలివే - గుండె బరువెక్కిస్తాయ్, మనసును హత్తుకుంటాయ్!
కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Hanuma Vihari: శెబ్బాష్ హనుమ విహారీ! మణికట్టు విరిగినా ఆంధ్రా కోసం బ్యాటింగ్ చేశాడు!
Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల