Movie Release this Week: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే...

కరోనాకి ముందు ఆ తర్వాత అన్నట్టుంది ఇండస్ట్రీలో పరిస్థితి. గతంలో ప్రతి వారం థియేటర్లలో సందడి చేసే సినిమాల గురించి చెప్పుకుంటే..ఇప్పుడు ఆ లిస్టులోకి ఓటీటీ వచ్చిచేరింది. మరి ఈ వారం సినిమాలేంటో చూద్దాం.

FOLLOW US: 

శుక్రవారం రాగానే థియేటర్లు కళకళలాడేవి. పెద్దో-చిన్నో ఏదో ఒక సినిమా ప్రతిశుక్రవారం విడుదలయ్యేది. కరోనా దెబ్బకి ఇప్పుడు ఓటీటీల హవా ఓ రేంజ్ లో ఉంది. దీంతో వారం వారం థియేటర్లో విడుదలయ్యే సినిమాల కన్నా ఓటీటీలో విడుదలయ్యే సినిమాల సంఖ్యే ఎక్కువ ఉంటోంది. ఇక ఈవారం థియేటర్లు, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు పరిశీలిస్తే...

101 జిల్లాల అందగాడు: అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించిన 101 జిల్లాల అందగాడు సెప్టెంబర్ 3న ధియేటర్లలో విడుదల కానుంది. రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు రాచకొండ విద్యాసాగర్ దర్శకుడు. శిరీష్‌, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. పెళ్లికాక ముందే బట్టతల రావడంతో అది బయటపడకుండా హీరో తెగ తిప్పలు పడుతుంటాడు. బట్టతల సంగతి తెలిసిన తర్వాత అమ్మాయి ప్రేమ కొనసాగించిందా లేదా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

డియర్ మేఘ:  మేఘా ఆకాశ్, అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు నటించిన డియర్ మేఘ కూడా సెప్టెంబర్ 3వ తేదీనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ ప్రేమకధా చిత్రానికి సుశాంత్ రెడ్డి దర్శకుడు. మంచి ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందన్నారు చిత్ర నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. 

ఇదే రోజు విడుదల కాబోతున్న మరో మూడు సినిమాలేంటంటే... సుజన్‌, తనీష్క్‌ జంటగా చలపతి పువ్వల తెరకెక్కించిన చిత్రం ‘అప్పుడు ఇప్పుడు’. ఉషారాణి కనుమూరి, విజయ్‌ రామ కృష్ణంరాజు నిర్మాతలు. ఈ సినిమా కూడా సెప్టెంబరు 3న థియేటర్‌లలో విడుదల కానుంది.  క్రైమ్ బ్యాక్‌గ్రౌండ్ సినిమాగా వస్తున్న ది కిల్లర్ సినిమాకి చిన్నా దర్శకుడు. కార్తీక్ సాయి, నేహా దేశ్‌పాండే, డాలీషాలు ప్రధానపాత్రల్లో నటించారు.  సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అశ్మీ కూడా ఇదే రోజు విడుదలవుతోంది. రుషికా రాజ్‌, రాజ నరేంద్ర, కేశవ్‌ దీపకప్‌, ఇందు కుసుమ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శేష్‌ కార్తికేయ దర్శకుడు.

ఇక ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో విడుదల కానున్న భారీ చిత్రం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9. ఇప్పటి వరకూ ఈ పేరుతో 8 సినిమాలు విడుదలై కాసుల వర్షం కురిపించాయి. ఇది కూడా సెప్టెంబర్ 3వ తేదీనే విడుదల కానుంది.

ఓటీటీల్లో రాబోతున్న సినిమాలేంటంటే... 

నెట్‌ఫ్లిక్స్‌

స్పార్కింగ్‌ జాయ్‌ (ఆగస్టు 31)

గుడ్‌ గర్ల్స్‌ (ఆగస్టు 31)

మనీ హెయిస్ట్‌-సీజన్‌5 (సెప్టెంబరు 3)

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

 బ్లాక్‌ విడో (సెప్టెంబరు 3)

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

 సిండ్రెల్లా (సెప్టెంబరు 3)

జీ5

 హెల్మెట్‌ (సెప్టెంబరు 3)

హెచ్‌బీవో మ్యాక్స్‌

 రెమినిసెన్స్‌ (సెప్టెంబరు 3)

Published at : 30 Aug 2021 07:01 PM (IST) Tags: Here is the List of Movies Releasing this week OTT and in Theatres

సంబంధిత కథనాలు

Kamal Haasan: ‘ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొంటా’ - హిందీ భాషపై కమల్ హాసన్ వ్యాఖ్యలు

Kamal Haasan: ‘ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొంటా’ - హిందీ భాషపై కమల్ హాసన్ వ్యాఖ్యలు

NBK 107 Special Song Update: బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నది 'ఖిలాడి' భామ డింపుల్ కాదు, చంద్రిక రవి

NBK 107 Special Song Update: బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నది 'ఖిలాడి' భామ డింపుల్ కాదు, చంద్రిక రవి

Varun Tej New Movie Update: వరుణ్ తేజ్ సినిమాలో విలన్‌గా - తెలుగు తెరకు తమిళ్ హీరో రీఎంట్రీ

Varun Tej New Movie Update: వరుణ్ తేజ్ సినిమాలో విలన్‌గా - తెలుగు తెరకు తమిళ్ హీరో రీఎంట్రీ

Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై 

Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై 

Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి

Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు ఊరట- వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు ఊరట- వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Nara Lokesh: ఏపీలో ప్రతీ ఇంటా వెంకాయ‌మ్మ మాటే వినిపిస్తోంది : సీఎం జగన్‌కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

Nara Lokesh: ఏపీలో ప్రతీ ఇంటా వెంకాయ‌మ్మ మాటే వినిపిస్తోంది : సీఎం జగన్‌కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

Green Card: భారతీయులకు శుభవార్త- ఇక ఆరు నెలల్లోగా గ్రీన్ కార్డ్‌కు క్లియరెన్స్!

Green Card: భారతీయులకు శుభవార్త-  ఇక ఆరు నెలల్లోగా గ్రీన్ కార్డ్‌కు క్లియరెన్స్!

AP IPS Transfers : ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు - సుప్రీంకోర్టు చెప్పినా ఏబీవీకి మాత్రం నో పోస్టింగ్ !

AP IPS Transfers :  ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు - సుప్రీంకోర్టు చెప్పినా ఏబీవీకి మాత్రం నో పోస్టింగ్ !