అన్వేషించండి

Prabhas: ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?

Prabhas Hombale Films Deal: ప్రభాస్, హోంబలే ఫిల్మ్స్ తో కుదుర్చున్న ఎపిక్ డీల్ లో భాగంగా ఆయన మూడు సినిమాలకు రూ. 575 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది.

Prabhas Hombale Films: పాన్ ఇండియా హీరోగా ట్యాగ్ సంపాదించుకున్న తర్వాత అలాంటి హీరోతో సినిమాలు చేయడానికి ప్రతి నిర్మాణ సంస్థ ఉవ్విరూరుల్లుతుంది. ఎప్పుడెప్పుడు ఆ స్టార్ హీరోతో ఓ బిగ్గెస్ట్ సినిమాని తీస్తామా ? ఆ స్టార్ కున్న క్రేజ్ ను క్యాష్ చేసుకుందామా అని ఈగర్ గా వెయిట్ చేస్తారు. ఇలాంటి బిగ్ మార్కెట్ ఉన్న పెద్ద హీరోలతో సినిమా చేస్తే తమ మార్కెట్ కూడా పెరుగుతుంది అనేది నిర్మాతల ఆలోచన. మంచి క్రేజ్ ఉన్న ఇలాంటి పాన్ ఇండియా హీరోలపై పెట్టుబడి ఎక్కువగా పెడితే, అదే రేంజ్ లో కాసుల వర్షం కురిసే అవకాశం కూడా ఉంటుందని ఇప్పటికే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రూవ్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తాజాగా ప్రభాస్ తో ఒక ఎపిక్ డీల్ కుదుర్చుకుంది. అయితే ప్రభాస్ తో కలిసి ఈ నిర్మాణ సంస్థ చేస్తున్న సినిమాల కోసం ఆయన ఊహించని రేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేశారంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Read Also: ‘పుష్ప 2’ ఐటెమ్ సాంగ్ ఫోటో లీక్ - అల్లు అర్జున్ తో శ్రీలీల ఊరమాస్ స్టెప్పులు!

శాండల్ వుడ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది 'కేజిఎఫ్' మూవీ. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో యష్ ను మాత్రమే కాదు కన్నడ సినిమా సత్తాను ప్రూవ్ చేశారు. అందరూ దేశవ్యాప్తంగా కన్నడ చిత్ర పరిశ్రమ గురించి ఈ సినిమాతో మాట్లాడుకునేలా చేశారు. ఇక ఈ మూవీని నిర్మించిన సంస్థ హోంబలే ఫిలిమ్స్. 'కేజీఎఫ్'తో పాటు 'కేజీఎఫ్ 2' లాంటి సినిమాలను నిర్మించి భారీగా లాభాలను మూట కట్టుకున్న హోంబలే ఫిలిమ్స్ కు ఫేమ్ కూడా రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హోంబలే ఫిలిమ్స్ కేవలం కన్నడలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలను చేయడానికి ఆసక్తిని కనబరుస్తోంది. 

ఇప్పటికే ఈ మేరకు తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది. అంతేకాదు ప్రభాస్ చేసిన 'సలార్' మూవీతో టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ చిత్ర నిర్మాణ సంస్థగా ఆధిపత్యం చెలాయించాలి అన్నట్టుగా హోంబలే ఫిలిమ్స్ భారీ ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పటికే ప్రభాస్ - హోంబలే ఫిలిమ్స్ కాంబినేషన్లో 'సలార్' విడుదల కాగా, 'సలార్ 2' మూవీ షూటింగ్ కూడా షురూ అయింది. అయితే ఇదే నిర్మాణ సంస్థలో ప్రభాస్ తో మరో రెండు సినిమాలను కూడా నిర్మించడానికి అగ్రిమెంట్ చేసుకుంది హోంబలే ఫిలిమ్స్. అందులో భాగంగా ప్రభాస్ తో 2026, 27, 28 సంవత్సరాల్లో వరుసగా సినిమాలు చేయబోతోంది. అయితే ఈ భారీ డీల్ లో భాగంగా ప్రభాస్ ఏకంగా రూ.575 కోట్ల పారితోషం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది బిగ్గెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. అంటే ప్రభాస్ దాదాపుగా ఒక్కో సినిమాకు రెండు వందల కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్టు లెక్క. అయితే ఈ వార్తపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 

Read Also : NTRNeel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్, షూటింగ్ ఎప్పటి నుంచి అంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
Tummala Nageswararao: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Embed widget