Pushpa 2: ‘పుష్ప 2’ ఐటెమ్ సాంగ్ ఫోటో లీక్ - అల్లు అర్జున్ తో శ్రీలీల ఊరమాస్ స్టెప్పులు!
Pushpa 2 Special song: ‘పుష్ప 2’లో క్యూట్ బ్యూటీ శ్రీలీల ఐటమ్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ కు సంబంధించి ఫోటో లీక్ అయింది. ఇందులో అల్లు అర్జున్, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులు వేస్తూ కనిపించారు.

Pushpa 2 Special Song Pic Leaked: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో తెరకెక్కుతున్న ‘ఫుష్ప 2’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలు సినిమాపై ఓ రేంజ్ లో క్యూరియాసిటీ పెంచాయి.
బన్నీతో శ్రీలీల ఐటమ్ సాంగ్
‘పుష్ప’ సినిమాలో ఐటెమ్ సాంగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సమంత నటించిన ‘ఊ అంటావా’ పాట దేశ వ్యాప్తంగా చార్ట్ బస్టర్ గా నిలిచింది. కుర్రకారును అద్భుతంగా అలరించింది. సినిమా హిట్ లో స్పెషల్ సాంగ్ కీలక పాత్ర పోషించింది. ‘పుష్ప 2’లోనూ మరో ఐటెమ్ సాంగ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇందులో ఎవరు నటిస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూశారు. చివరకు ఈ సినిమాలో బన్నీతో స్టెప్పులు వేసే బ్యూటీ ఎవరో తెలిసింది. టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ, తెలుగమ్మాయి శ్రీలీల ఐటెమ్ సాంగ్ కు ఓకే అయ్యింది. ఈ విషయం బయటకు తెలియడంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.
Read Also : Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
‘పుష్ప 2’ ఐటమ్ సాంగ్ ఫోటో లీక్
తాజాగా ‘పుష్ప 2’కు సంబంధించిన శ్రీలీల ఐటెమ్ సాంగ్ ఫోటో లీక్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో శ్రీలీల, అల్లు అర్జున్ ఇద్దరూ ఊరమాస్ స్టెప్పులేస్తూ కనిపించారు. అల్లు అర్జున్ ఎరుపు రంగులో.. శ్రీలీల నలుపు రంగు డ్రెస్ లో ఆకట్టుకుంటున్నారు. ఇందులో శ్రీలీల చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. ‘కిస్సిక్’ అంటూ ఈ ఐటెమ్ సాంగ్ సాగనుందని ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది. ఈ సాంగ్ ‘ఊ అంటావా’ సాంగ్ కు మించి ఈ పాట అదరిపోద్దంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అటు ఈ ఫోటో లీక్ పై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు.
Leakeddd 😲🔥🔥🔥🔥🔥
— ALLU PAVAN (@PavanKu90551124) November 8, 2024
Debbalupadtai 🔥🔥🔥🔥🔥#Pushpa2TheRuleTrailer pic.twitter.com/zkaxzZAKpF
10 వేలకు పైగా థియేటర్లలో విడుదల
‘పుష్ప 2’ 10 వేలకు పైగా థియేటర్లలో విడదల కాబోతోంది. భారత్ లో 6500 స్క్రీన్స్ లో, ఓవర్సీస్ లో 5000 స్క్రీన్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రంగా ‘పుష్ప 2’ రికార్డు సాధించబోతోంది. ఇక అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఎలమంచిలి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాక డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
ట్రెండింగ్ వార్తలు





















