Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Prabhas Salaar 2 Shooting Started: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్ వచ్చేసింది. 'సలార్ 2' మొదలైంది అంటూ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది.
Prabhas Salaar 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ "సలార్ 2". ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ మూవీ షూటింగ్ ను వచ్చే ఏడాది మొదలు పెడతాడు అంటూ ప్రచారం జరిగింది. కానీ తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ 'సలార్ 2'పై క్రేజీ అప్డేట్ ఇచ్చింది.
ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్ 'సలార్ : సీజ్ ఫైర్ '. 2023 డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ నిర్మించగా, మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మరో లీడ్ రోల్ పోషించారు. అలాగే శృతిహాసన్ ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ ఈ మూవీ తోనే స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. అయితే ఈ సినిమాకు రెండో భాగం ఉంటుందని 'సలార్' మూవీ క్లైమాక్స్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి 'సలార్ 2 : శౌర్యంగ పర్వం' అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టినట్టు చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. అందులో 'సలార్ 2 ప్రయాణం అద్భుతంగా సాగుతుంది... సలార్ 2 మొదలైంది' అని రాసుకొచ్చారు. అయితే పాపులర్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ తో ప్రభాస్ వరుసగా మూడు సినిమాలు చేయబోతున్నాడని అనౌన్స్మెంట్ వచ్చిన అతికొద్ది గంటల్లోనే ఈ మూవీ అప్డేట్ ను ప్రకటించడం విశేషం.
The journey is going to be epic…💥#Salaar2 begins!#PrabhasXHombal3Films #Prabhas #PrashanthNeel @PrithviOfficial @Vkiragandur @hombalefilms pic.twitter.com/ZbTqk39mne
— Hombale Films (@hombalefilms) November 8, 2024
కాగా ఇప్పటికే 'సలార్' మూవీని వాళ్లంతా సీక్వెల్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మొదటి పార్ట్ ను మేకర్స్ కేవలం పాత్రల పరిచయానికి మాత్రమే వాడుకున్నారు. సెకండ్ పార్ట్ లో అసలు కథ ఉంటుందని ప్రశాంత్ నీల్ చాలాసార్లు చెప్పారు. పైగా ప్రమోషనల్ కంటెంట్ గా వాడిన కొన్ని హైలెట్ సీన్స్ సినిమాలో మిస్ కావడంతో అవి సెకండ్ పార్ట్ లో ఉంటాయని అందరూ ఊహిస్తున్నారు. ముఖ్యంగా 'సలార్' టీజర్ లో ప్రభాస్ కు ఉన్న ఎలివేషన్ డైలాగ్ "సింహం, చిరుత, పులి, ఏనుగు లాంటివి చాలా ప్రమాదకరమైనవి.. కానీ జురాసిక్ పార్క్ లో కాదు' అంటూ ప్రభాస్ కటౌట్ ను చూపించడం అప్పట్లో సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచింది. కానీ థియేటర్లలో మాత్రం ఈ సీన్ కనిపించకపోవడం ప్రభాస్ అభిమానులను నిరాశపరిచింది.
పైగా సెకండ్ పార్ట్ లో చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేవా శౌర్యంగ అని తెలిసినా కూడా వరదరాజ మన్నార్ అతన్నే తన సలార్ గా ప్రకటించడం చూసాం మనము. మరి ఈ ప్రాణ స్నేహితులు ఎందుకు బద్ధ శత్రువులుగా మారతారు? ఆ తర్వాత ఏం జరుగుతుంది? అసలు ఖాన్సర్ సింహాసనంపై కూర్చోవాల్సిన దేవా దాన్ని వదిలేసి ఎందుకు వెళ్లిపోతాడు? అనే విషయాలు తెలియాలంటే 'సలార్ 2' వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.